NAZIMABAD NIZAMABAD MP ARAVIND HAS CHALLENGED TRS MLA JEEVAN REDDY THAT HE WOULD DEFEAT HIM WITH 50 THOUSAND MAJORITY VOTES IN NEXT ELECTIONS PRV
Nizamabad: ‘‘దమ్ముంటే కేసీఆర్ దగ్గర టికెట్ తెచ్చుకో.. నిన్ను 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తా’’: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎంపీ అరవింద్ సవాల్
ఎంపీ అరవింద్ (ఫైల్)
నిజామాబాద్ ఎపిసోడ్‌తో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బుధవారం ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Aravindh)పై మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు, పలువురు రైతులు దాడి చేయడం తెలిసిందే. ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ (TRS) నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. రాళ్లతో దాడులు (Attack) చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
బుధవారం ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మీడియాతో మాట్లాడారు. తనపై దాడికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (jeevan reddy) , నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కారణమని ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వారంతా టీఆర్ఎస్ నేతలేనని అర్వింద్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో తనను నేరుగా ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (TRS MLA Jeevan reddy)కి అర్వింద్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని 50 వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ (Challenged) విసిరారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని అర్వింద్ తెలిపారు. టీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయని ఆయన జోస్యం చెప్పారు.
ఏం జరిగింది..?
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పసుపు బోర్డు (Turmeric Board) వివాదం దశబ్దాలుగా సాగుతోంది. ఎన్నిక సమయంలోనే పసుపు బోర్డు తెరపైకి వచ్చేది తరువాత ఆ విషయంలో ఎవరు స్పందించే వారు కాదు. అయితే 2019 పార్లమెంట్ సుమారు 185 మంది పసుపు రైతులు నామినేషన్ వేశారు. దీంతో పసుపు బోర్డు సమస్య దేశరాజకీయల్లో చర్చకు వచ్చింది. అటు టీఆర్ఎస్ నుంచి పసుపు రైతులు (Turmeric farmers) నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న చోటు నుంచి 20 మంది రైతులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు.
బాండ్ పేపర్ పై రాసి..
అయితే నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అర్విం ద్ఒక అడుగు ముందుకు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు (Turmeric Board) తీసుకు వస్తానని.. లేదంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తానని బాండ్ పేపర్ పై రాసి పసుపు రైతులకు ఇచ్చారు. అనుకున్నట్టుగానే కేంద్రంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే పసుపు బోర్డు వస్తుందని రైతులు బీజేపీకి ఓటు వేసి ధర్మపురి అర్విందను ఎంపీగా గెలిపించారు. ముఖ్యమంత్రి కూతురు. సిట్టింగ్ ఎంపీ కవితపై అర్వింద్ ఘనవిజయం సాధించారు.. అయితే ఎంపీగా గెలిచి రెండున్నర యేళ్లు అవుతున్నా పసుపు బోర్డు (Turmeric Board) రాలేదు. అర్వింద్ బోర్డు తీసుకు రాలేదని పసుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.