Newborn Baby: చెత్త కుప్పలో మగ శిశువు.. బావిలో దూకిన మైనర్ బాలిక.. అసలేమైందంటే..

ఘటనా స్థలంలోని బావిలో దూకిన మైనర్ బాలిక

Newborn Baby: కామారెడ్డి జిల్లాలో మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకొంది. గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసకొంటానని మోసం చేసి గర్భవతిని చేశాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  క్ష‌ణికావేశంలో చేసిన త‌ప్పుకు ప్ర‌తిఫ‌లంగా ఓ మైనర్ బాలిక(Minor Girl ) గ‌ర్బం దాల్చింది. తొమ్మిది నెలలు మొసి పండంటి మ‌గ బిడ్డ‌కు(Baby) జ‌న్మ‌నిచ్చింది. కానీ సమాజం వేసే ప్ర‌శ్న‌ల‌కు జవాబు చెప్పలేక ఆ అమ్మాయి బిడ్డ‌ను ముళ్ల పొద‌ల్లో పారేసింది.. త‌నూ బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా(Kamareddy) గాంధారి మండలం బిర్మల్ తండా(Birmal thanda) గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గం చెరువు దగ్గర అప్పుడే పుట్టిన మగ శిశువు ముళ్లపొదల్లో క‌నిపించింది.. స్థానికులు చూసి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతికి విషయం చెప్పారు..

  తర్వాత  వెంటనే చైల్డ్ లైన్(Child line) 1098 కు స‌మాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన వైద్య సిబ్బంది.. అంబులెన్స్(Ambulance) లో ఆ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాస్ చికిత్స చేస్తూ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కానీ శిశువు తల్లి పెళ్లి కాకుండానే త‌ల్లి ఆయిన విష‌యం తెలిసింది.. దీంతో శిశువును ముళ్లపొదల్లో పడేసి తాను కూడా బావిలో పడి మృతి చెందినట్లు స్థానిక తాండా వాసులు చెబుతున్నారు.

  ఇది చదవండి: ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి.. నగ్న వీడియోలను వెబ్ సైట్ లో పోస్టు చేసిన బాలిక.. చివరకు..

  పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను మోసం చేశారని మనోవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది. బావిలో నుండి మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు.  ఇదిలా ఉంటే మైనర్ బాలికను గర్భవతిని(Pregnant) చేసిన వ్యక్తి ఎవరనే విషయమై తేలాల్సి ఉంది. ఈ ఘటనపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavath Rathod) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక మృతికి కారణమైన వారికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

  ఇది చదవండి: మగబిడ్డ కోసం క్షుద్ర పూజలు.. మహిళను నగ్నంగా చేసి.. బూడిద రాసి.. చివరకు..

  పసికందు ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. బాలిక కుటుంబానికి గవర్నమెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని… విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం శిశువును ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు.

  ఇది చదవండి: దొంగతనానికి వచ్చారు.. యజమాని చేతిలో రూ.500 పెట్టి.. చివరకు ఏం చేశారో తెలుసా..

  బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి… మోసం చేసి గర్భవతిని చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దోషులను(The Culprits) పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి(Minister) స్పష్టం చేశారు. తల్లి మృతి చెందిందా? లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి పోలీసులు వెల్లడించారు.
  Published by:Veera Babu
  First published: