Home /News /telangana /

Nizamabad: ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటుకు నిజంగా ఇంత డిమాండ్ ఉందా..? రూ.11 లక్షలు ఇస్తామని ఫోన్.. చివరకు..

Nizamabad: ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటుకు నిజంగా ఇంత డిమాండ్ ఉందా..? రూ.11 లక్షలు ఇస్తామని ఫోన్.. చివరకు..

బాధితుడు నర్సింలు

బాధితుడు నర్సింలు

’ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత ఐదు రూపాలయ నోటు మీ వద్ద ఉందా? అయితే దాన్ని మాకు ఇవ్వండి. మీకు 11.74 లక్షల రూపాయలు ఇస్తాం‘ అంటూ ఓ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత..

  మ‌నిషికి ఉన్న ఆశను ఆయుధంగా చేసుకుని కొంద‌రు మాయగాళ్లు మోసాల‌కు పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులను అందినకాడికి దోచేస్తున్నారు. మాయమాటలు చెప్పి అడ్డంగా మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు ఆశతో అమాయక ప్రజలు మోసగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. లక్షలకు లక్షల డబ్బును కేటుగాళ్లకు సమర్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ నయా మోసం వెలుగులోకి వచ్చింది. పాత నోట్ల గురించి కట్టుకథలు చెబుతూ ఏకంగా 8.35 లక్షల డబ్బులను కాజేశారు. వారిని భ్రమలోనే ఉంచి ఇంకా డబ్బును కొల్లగొట్టేయాలనుకున్నారు. కానీ బాధితుడు గ్రహించడంతో కొద్ది పాటి నష్టంతోనే బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లాలో జరిగిన కొత్త రకం మోసం గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  కామారెడ్డి జిల్లా మండ‌లం చిన్న మ‌ల్లారెడ్డి గ్రామానికి చెందిన క‌స్తూరి న‌ర్సింలుకు ఏప్రిల్ 1న పోన్ వ‌చ్చింది.. మీ వ‌ద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత 5 రూపాయల నోటు ఉంటే రూ.11.74 లక్షలు ఇస్తామని చెప్పారు. దీంతో న‌ర్సింలులో ఆశలు రేకెత్తాయి. తన వద్ద పాత ఐదు రూపాయల నోటు ఉండటంతో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించాడు. ’నా దగ్గర ఉంది. దాన్ని తీసుకుని డబ్బు ఇవ్వండి‘ అని అడిగితే తాము చేప్పిన‌వి చేయాల‌ని ఆలా చేస్తేనే మీకు డ‌బ్బులు వ‌స్తాయ‌ని మోస‌గాళ్లు న‌మ్మబ‌లికారు.. వారి మాటలు న‌మ్మిన న‌ర్సింలు వారితో పోన్ లో ప‌లుమార్లు మాట్లాడాడు. వారు చెప్పిన‌ట్లుగా బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్, ఆదార్ కార్డును వాట్సాప్ ద్వారా వారికి పంపాడు.

  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  ఎన్.ఓ.సి, ఐటీ క్లియరెన్స్ అంటూ పలు దఫాలుగా డబ్బులు పంపించమన్నారు. నిజమేనని నమ్మి పది విడతల్లో రూ.8.35 లక్షల రూపాయలు అకౌంట్ లో జమ చేసాడు. అయినా డబ్బులు ఇంకా కావాలని చెప్పడంతో అనుమానం వచ్చి న‌ర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సింలుకు వచ్చిన ఫోన్ నంబర్ పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ‘నాకు పోన్ చేసి పాత ఐదు రూపాల‌య నోటుకు 11ల‌క్షల 74వేల రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పార‌ు. వారు చెప్పిన మాట‌లు విని డ‌బ్బులు వస్తాయనుకుని వాళ్లు అడిన‌వ‌న్ని పంపించాను. చివరకు వాళ్లు నన్ను మోసం చేశారు. నాలాగా ఎవ‌రూ మోసపోవద్దనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా డబ్బును నాకు తిరిగి ఇప్పించాలి‘ అంటూ న‌ర్సింలు ఆవేదన వ్యక్తం చేశాడు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Nizamabad, Telangana, Telangana crime

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు