Home /News /telangana /

Telangana: మానవత్వం చాటుకున్న ముస్లిం యువకులు.. కరోనా మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు..

Telangana: మానవత్వం చాటుకున్న ముస్లిం యువకులు.. కరోనా మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు..

అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గన్న ముస్లిం సోదరులు

అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గన్న ముస్లిం సోదరులు

Kamareddy: ప్రస్తుత పరిస్థితిలో ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు అంటు వెల్లడానికే జంకుతున్నారు. సదరు రోగి చినిపోతే అంత్యక్రియలు చేయడానికి సొంతవాళ్లు కూడా వెనకాడటం లేదు. అలాంటిది తమకు ఏమి కాకున్నా కరోనాతో చనిపోయిన మృత దేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చటుకున్నారు ముస్లిం సోదరులు.

ఇంకా చదవండి ...
    ( పి మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    కరోనా మహమ్మారి కారణంగా సొంతవారు కూడా దూరంగా ఉంటున్నారు. కరోనా పోజిటివ్ సోకిందని తెలియగానే రక్త సంబంధీకులు సైతం అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏమికానీ పోజిటివ్ మృత దేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ముస్లిం యువకులు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి కి చెందిన మొగులయ్య అనే యువకుడికి కరోనా పోజిటివ్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రి కి తరలించారు. అయితే మొగులయ్య చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. మొగులయ్యకు కరోనా పాజిటివ్ ఉందని తెలిసి అంతక్రియలకు చేసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు.

    దీంతో విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. మతాలు వెరైన మానవత్వంతో షఫి, అలి అనే మైనారిటీ యువకులు వారి అంబులెన్స్ లో మొగులయ్య మృత దేహాన్ని బాన్సువాడలోని హిందూశ్మశానవాటికకు తీసుకువెళ్లి అంతక్రియలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా రక్త సంబంధీకులే దగ్గరకు రావడానికి మొఖం చాటేస్తున్నారు.

    ప్రభుత్వ ఆసుపత్రి


    మొగులయ్య మృతదేహం


    అంత్యక్రియల్లో పాల్గన్న ముస్లిం యువకులు


    ఇలాంటి సమయంలో కోవిడ్ పోజిటివ్ మృతుడికి అంత్య క్రియలు చేయడం గర్వించదగ్గ విషయం. మనిషిని మనిషిలా చూడడం వారి గొప్పతనమని స్థానికులు అంటున్నారు. ఎటువంటి రియల్ హీరోలకు మనమూ సెల్యూట్ చేదాం.
    Published by:Veera Babu
    First published:

    Tags: Corona cases, Corona positive body, Kamareddy, Muslim brothers, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు