బీజేపీ(BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. ఈ కాంగ్రెస్ (Congress party) పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ సెఫ్టిక్ ట్యాంక్ లాంటి వాడని అన్నాడు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటీ కామెంట్ చేయనని, దూరంగా ఉంటానని అన్నారు. నిజామాబాద్‌లోని (Nizamabd) పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు పార్టీలో చేరిన సంధర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బుత్ లేవల్(Booth Level) నుంచి కార్యకర్తలు కరువయ్యారని అన్నారు.. ఆ పార్టీ నాశనం కావాడానికి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కారణం అన్నారు.. మరోవైపు రేవంత్ రెడ్డికి బాగా ప్రెషర్ ఉందని, ఓ పక్క ఈడీ ,మరోపక్క ఏసిబీ (acb)ఒత్తిడి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో లొట్టపీస్ కూడా లేదని విమర్శించారు.
ఇది చదవండి : కీచకుడు... తల్లితో సహజీవనం కూతురుపై కన్ను.. చివరకు ఆమెపై కూడా.. ?
కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు లేకపోవడంతోపాటు.. బలమైన అభ్యర్ధులు కూడా లేరని అన్నారు.. డీ.శ్రీనివాస్ పిసిసిగా (D Srinivas)ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే 36 పార్లమెంట్(Parlament) సిట్లు వచ్చాయని.. మరో సారి 34 పార్లమెంట్ సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.... కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 36 మంది ఎంపిలు (mp) కూడా లేరని ఆయన ఎద్దేవ చేసారు.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందన్నారు.
ఇది చదవండి : నిజాం ఆస్తులన్ని హిందువులవే.. మూడో రోజు ముగిసిన పాదయాత్ర..!
నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇతర పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరడంతో వారికి కండువా కప్పి అర్వింద్ అహ్వానించారు. ఈ సంధర్భంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి : పడిపోయో ప్రభుత్వానికే... పథకాలు ఎక్కువ.... కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
కాగా ఇటివల రేవంత్ రెడ్డి బీజేపీని సైతం విమర్శిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసిఆర్ పాలన ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అయన ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Revanth Reddy