Telangana Politics: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఎంపీ అరవింద్ చెక్ పెట్టనున్నారా..? ఏం జరుగుతోంది..

ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్)

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి సారి 2014లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగాయి. అయితే రాష్ట్రంలోనే మొద‌ట నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆశ‌న్నగారి జీవ‌న్ రెడ్డిని టీఆర్ఎస్ ఆభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు. ఆనాటి నుంచి ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా జీవ‌న్ రెడ్డి 2014, 2018లో విజ‌యం సాధించారు. ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్న అతడికి ఎంపీ అరవింద్ సవాల్ విసురుతున్నాడు.

  • Share this:
    (P.Mahender,News18,Nizamabad)

    ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి సారి 2014లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగాయి. అయితే రాష్ట్రంలోనే మొద‌ట నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆశ‌న్నగారి జీవ‌న్ రెడ్డిని టీఆర్ఎస్ ఆభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు. ఆనాటి నుంచి ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా జీవ‌న్ రెడ్డి 2014, 2018లో విజ‌యం సాదించారు. నేను ఎప్పుడు నెంబ‌ర్ వ‌న్ అని అయ‌న చెప్పుకుంటారు.. సీఎం కేసీఆర్ నాపై న‌మ్మ‌కంతో రాష్ట్రంలోనే మొద‌టి ఎమ్మేల్యే అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించారని ఆయ‌న అంటుంట్టారు.. అయితే మూడో ద‌ఫా కూడా ఆర్మూర్ నుంచి గెలుపు కాయం అని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి ఎంపి ద‌ర్మ‌పూరి ఆర్వింద్ స‌వాలు విరుతున్నారు. ఎంపి అర్వింద్ ఆర్మూర్ కు మాకం మార్చి జీవ‌న్ రెడ్డికి చుక్క‌లు చూపిస్తున్నారు.

    Huzurabad: జోరందుకున్న బెట్టింగ్ లు.. ఈటల వైపు రూ.10 లక్షల పందెం.. ఎగబడుతున్న బుకీలు..


    సీఎం కేసీఆర్ పై ప్ర‌తి ప‌క్ష‌ాలు చేసే విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టికి అప్పుడు ఖండిస్తూ విరుచుప‌డే జీవ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారుతున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంపీ ఆర్వింద్ గ్రౌండ్ వ‌ర్క్ మొద‌లు పెట్టారు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆర్మూర్ నుంచే త‌న యుద్దం మొద‌లు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే పెర్కిట్ వ‌ద్ద ఓ ఇళ్లు తీసుకుని అక్క‌డి నుంచే ఆయ‌న కార్య‌కలాపాలు సాగిస్తున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా బీజేపీ సీనియ‌ర్ నేత లోక భూప‌తిరెడ్డిని క‌లిసి ఆశీస్సులు తీసుకున్నాడు.

    Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


    ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని బాజ‌పా సీనియ‌ర్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. ఆర్మూర్‌లో ప‌ట్ట‌ణంలో బీజేపీ కొంత బ‌లంగా ఉందంటే ఆ సీనియ‌ర్ నాయ‌కులే కార‌ణం.. ఇది కొంత‌ క‌లిసివ‌చ్చే ఆశంగా అర్వింద్ భావిస్తున్నారు. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ను ఎమ్మెల్యేగా పోటీకి రహ‌దారి వెసుకుంటున్నారు.. జీవ‌న్‌రెడ్డిపై పోటీ చేసి ఈజీగా గెల‌వ‌చ్చ‌నే భావ‌న‌లో అర్వింద్ ఉన్నారు. మున్నూరుకాపు ఓట్లు త‌న‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.. ఆర్మూర్ టౌన్‌, నందిపేట్‌లో బీజేపీ బ‌లంగా ఉంది. ప‌సుపు బోర్డు గురించి నిల‌దీసే రైతాంగం ఇక్క‌డ పెద్ద‌గా లేదు. ఇలా అన్ని అంశాలు క‌లిసొస్తాయ‌ని అర్వింద్ భావిస్తున్నారు. మ‌రోవైపు జీవ‌న్‌రెడ్డి కూడా త‌న మాట‌ల దాడి పెంచుతున్నాడు.

    TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..


    అర్వింద్ చేసే ప్ర‌తీ కామెంట్‌కూ కౌంట‌ర్ ఇస్తున్నాడు. ద‌స‌రా రోజు దుబాయ్ వెళ్లి కూడా అక్క‌డి నుంచి అర్వింద్‌పై విరుచుకుప‌డ్డాడు. నిజామాబాద్ జిల్లాలో అన్నింటికంటే ముందు ఆర్మూర్ రాజ‌కీయాలే ముందుగా వేడెక్కుతున్నాయి. 2014లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధిగా జీవ‌న్ రెడ్డి, కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా సురేష్ రెడ్డి, టీడీపీ అభ్య‌ర్దిగా అన్న‌పూర్ణమ్మ పోటి ప‌డ్డారు.. అయితే ఇద్ద‌రు సీనియార్ నాయ‌కుల‌పై టీఆర్ఎస్ అభ్య‌ర్థి జీవ‌న్ రెడ్డి గెలుపొందారు.

    2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి ఆకుల ల‌లిత‌, బాజ‌పా అభ్య‌ర్ధి విన‌య్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్య‌ర్ధి జీవ‌న్ రెడ్డి రెండో సారి గెలుపోందారు.. అయితే ముచ్చ‌ట‌గా మూడో ద‌ఫా గెలిచేందుకు క‌ల‌లు కంటున్న జీవ‌న్ రెడ్డి క‌ల‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేరుతాయో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.
    Published by:Veera Babu
    First published: