NAZIMABAD MLC KAVITHA QUESTIONED WHY RAHUL GANDHI WHO COULD NOT EVEN SPEAK A WORD IN PARLIAMENT ABOUT TELANGANA FARMERS WAS ATTENDING MEETING IN WARANGAL NZB PRV
Kavita on Rahul gandhi Warangal tour: పార్లమెంటులో మాట మాట్లాడలేదు.. ఇపుడు వరంగల్‌కి వచ్చి రైతు సంఘర్షణ యాత్రలా? రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
ఎమ్మెల్సీ కవిత (ఫైల్)
తెలంగాణ గురించి పార్లమెంట్ లో మాట్లాడని రాహుల్ గాంధీకి వరంగల్ రైతు సంఘర్షణ యాత్ర ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేFeరు. ఇది కేవలం రాజకీయం మాత్రమే.. ఇది రైతు సంఘర్షణ సభ కాదు రాహుల్ గాంధీ సంఘర్షణ సభ అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు (Paddy procurement) విషయంలో రాహుల్ గాంధీ (Rahul gandhi)ని పార్లమెంట్లో మాట్లాడాలని అడిగాం. తెలంగాణ రైతులకు మద్దతు ఇవ్వాలని కోరాం.. ఐనా ఏ రోజు పార్లమెంట్ లో మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) మండిపడ్డారు. తెలంగాణ (Telangana) గురించి పార్లమెంట్ లో మాట్లాడని రాహుల్ గాంధీకి వరంగల్ రైతు సంఘర్షణ యాత్ర (raithu Sangharshana Yatra) ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయం మాత్రమే.. ఇది రైతు సంఘర్షణ సభ కాదు రాహుల్ గాంధీ సంఘర్షణ సభ అన్నారు. కాంగ్రెస్ (Congress) ఎంపీలకు సూటిగా అడుగుతున్నా పార్లమెంట్ లో వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రోజైనా మాట్లాడారా..? పార్లమెంట్ లో మాట్లాడటం చేతకాలేదు.. వరంగల్ కొచ్చి ఇంకేం మాట్లాడుతారని కవిత దుయ్యబట్టారు.
ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడలేదు..
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలు దేశమంతటా అమలు చేయాలని కోరుతుండగా.. రైతు సంఘర్షణ పేరుతో తెలంగాణ రైతులకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఓయూకి వచ్చి విద్యార్థులకు చెప్పేదేముంది.. కేంద్ర సర్కారు నుంచి ఐఐటీ.. నవోదయ రావాల్సినవి ఇప్పటికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో ఒక కాంగ్రెస్ ఎంపీ Congress MP) మాట్లాడలేదు. రాహుల్ గాంధీ కూడా ఏ రోజు మాట్లాడలేదు. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ గురించి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఇప్పుడు వరంగల్ కు ఎందుకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అంత చూస్తున్నారు.
కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ (Nizamabad) ఎంపీ అర్వింద్ పై నిప్పులు చెరిగారు. గత మూడేళ్లుగా పసుపు బొర్డు విషయంలో అబద్దాలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు . పసుపు రైతుల కోసం 2020-21 లో ఒక కోటి 18 లక్షల 71 వేల రూపాయలు కేటాయించారు. ఇందులో పసుపు బాయిలర్లకు రూ.75 లక్షలు, పసుపు పాలిషర్లకు రూ. 43.71 లక్షలు నిజామాబాద్ లో దాదాపు 60 వేల పసుపు రైతులు ఉన్నారు. అంటే ప్రతి రైతుకు రూ.190 మాత్రమే కేటాయించారు. నిజామాబాద్ పసుపు రైతుల కోసం 2021-22 లో రూ. 74.81 లక్షలు కేటాయించారు. అంటే ప్రతి రైతుకు కేవలం రూ.120 కేటాయించారు. ఇందులో పసుపు బాయిలర్ల కోసం రూ. 39.73 లక్షలు, పసుపు పాలిషర్ల కోసం రూ. 6.58 లక్షలు, టార్పలిన్ కవర్ల కోసం రూ. 15 లక్షలు, ఎంపికచేయబడిన క్లస్టర్ లోని పసుపు ఉత్పత్తిదారుల కోసం రూ. 10 లక్షలు, క్వాలిటీ టెస్టింగ్ పరికరాల కోసం రూ. 3.50 లక్షలు కేటాయించారు. ఇదేనా ఎంపీగా మూడేళ్లలో న జిల్లాకు తీసుకు వచ్చిందని ఆమె విమర్శించారు
బీజేపీ నాయకులు అన్ని భాషల్లో అబద్దాలు చెప్పారని కవిత అన్నారు. ‘‘కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరిచారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారు చెప్పాలి. పసుపు మద్దతు ధర ఎప్పుడు అని”అని ప్రశ్నించారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ఎటుపోయింది అరవింద్ అధర్మపురి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లు వదిలేశాం కానీ ఇప్పుడు వదిలేది లేదని కవిత అన్నారు.
ఎన్నికల కోసం వస్తున్నారు తప్ప ఉద్దరించడానికి కాదు..
చాలామంది యాత్రికులు తెలంగాణకు వస్తారు. యాత్రలు చేస్తూ పోతారు. తెలంగాణ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయిందని ఆమె అన్నారు. వారందారు ఎలక్షన్స్ కోసం వస్తున్నారు తప్ప ప్రజలకు ఉద్ధరించడానికి కాదు. రాబోయే తరాలకు భవిష్యత్ అందించడానికి టీఆర్ఎస్ నేతలందరూ ఒక తాటిపై పని చేస్తున్నారు. ఇతర పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ తోనే ఉంటారన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.