విజయ దశమి(Vijayadashami) పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత(MlC Kavitha), ఆమె భర్త అనిల్(Anil) తో కలిసి మెట్టినింట్లో ఏర్పాటు చేసిన వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ(Telangana) ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను చేకూర్చే విజయదశమి(Vijayadashami) ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత సెక్యూరిటీ గార్డ్స్, కారు డ్రైవర్లకు సంబంధించి ఆయుధాలను అమ్మవారి ముందు ఉంచి పూజలు నిర్వహించారు. ఇందులో ఏకే 47 గన్(AK 47) తో పాటు మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇంతకు ఆయుధ పూజను దసరా పర్వదినాన ఎందుకు జరుపుకుంటారు.. పాలపిట్టను ఎందుకు దర్శించుకుంటారో తెలుసుకుందాం..
దసరా(Dussehra) ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధపూజ ఒకటి. ఆయుధ పూజతో పాటు చాలామంది వాహనపూజలు కూడా చేస్తుంటారు. ఈ ఆయుధపూజ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుని రాక్షసుడిని నాశనం చేసినందుకు ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఆయుధపూజలను అస్త్ర పూజ అని కూడా పిలుస్తారు. ప్రజలు ఉపయోగించే ఉపకరణాలు, ఆయుధాలు, యంత్రాలు మొదలైన వాటిని పూజించి శుభ్రం చేసే రోజు ఈ దసరా. ఆయుధపూజలో కేవలం ఆయుధాలే కాకుండా పిన్స్, చిన్న చిన్ యంత్రాలతో పాటు స్పానర్ లతో పాటు.. భారీ యంత్రాలు, కార్లు.. బస్సులు ఇలా అన్ని రకాలుగా ఉండే యంత్ర సామాగ్రికి ఈరోజు పూజలు చేస్తారు.
కొంతమంది కంప్యూటర్లకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పూజతో పాటు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు. అయితే ఈ ఆయుధ పూజలో ప్రతీ పరికరాన్ని లేదా వాయిద్యాలను పూర్తిగా శుభ్రం చేసి పూజించాలి. అమ్మవారు సాధించిన విజయాన్ని గుర్తించడానికి అమ్మవారి ముందు ఇలా వాయిద్యాలను ఉంచుతారు. టూల్స్ , వాహనాలపై పసుపు, గంధం మిశ్రమం యొక్క తిలకం దిద్దుతారు. కొంతమంది ఈ ఆయుధాలను పూలతో అలంకరిస్తారు. ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిది రోజులు ఆచరించి విజయదశమి రోజున సమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.
పాలపిట్టను దర్శించుకోవడానికి గల కారణం..
చూడటానికి పాలపిట్ల నీలం, పసుపు రంగుల కలబోతలో ఉంటుంది. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. పరమేశ్వరిడి స్వరూపంగా దీనిని భావిస్తుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు. ఈ నమ్మకం వెనుక అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి.
అందులో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత వారు ఏం చేసినా విజయాల వరించాయట. అజ్ఞాత వాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అందుకే శమీ పూజ అనంతరం పాల పిట్టను చూసేందుకు ప్రజలు తహతహలాడుతారు. ప్రత్యేకించి ఊరి చివరకు, పొలాల మధ్యకు వెళ్లి మరి పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kavitha, Mlc elections