Home /News /telangana /

NAZIMABAD MINISTER VEMULA PRASHANT REDDY HAS DIRECTED THE AUTHORITIES TO WORK PROPERLY AS THE CM HAS DECIDED TO BUY GRAIN FOR KCR FARMERS NZB PRV

Nizamabad: సీఎం కేసీఆర్​ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.. మీరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనులు చేయండి: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

సమావేశంలో మంత్రి

సమావేశంలో మంత్రి

కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో చేతులెత్తేయ‌డంతో సీఎం కేసీఆర్ రైతుల కోసం కొనుగోలు చేస్తామ‌ని సాహాసోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

    కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు (buy grain) విష‌యంలో చేతులు ఎత్తేయ‌డంతో సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల కోసం కొనుగోలు చేస్తామ‌ని సాహాసోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి  (Minister vemula Prashant Reddy)అన్నారు. వ‌రి ధాన్యం సేకరణ బాధ్యతను మహా యజ్ఞంలా భావిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని మంత్రి  అధికారులకు (directed the authorities) సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు (farmers) చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు.

    వరి ధాన్యం కొనుగోలు (Grain collection) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి  నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీపీ నాగరాజు తదితరులతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ కోసం చేపట్టాల్సిన చర్యల పై స్పష్టమైన సూచనలు చేశారు.  ధాన్యం కొనుగోళ్ల విషయం లో గడిచిన నెలన్నర రోజుల నుండి తీవ్ర సందిగ్ధత నెలకొని ఉండిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.

    లోటుపాట్లకు ఆస్కారం లేకుండా..

    రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ధాన్యం సేకరించాలని కేబినెట్ సమావేశంలో సాహసోపేత నిర్ణయం (Decision) తీసుకున్నారని అన్నారు. ఎంతో సున్నితమైన పరిస్థితి నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చింద‌న్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సాఫీగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు.

    3.46 లక్షల ఎకరాల్లో..

    గతేడాది జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తో పాటు అధికార యంత్రాంగం `యావత్తు  కష్టపడి పని చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.  ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని మంత్రి కోరారు. 3.46 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే 9 .68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందులో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు మంత్రి. అయితే ఒకేసారి కాకుండా, మూడు విడతల్లో ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

    రైతులు బాగా ఆరబెట్టి, శుభ్రపరిచిన‌ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు. ఎవరైనా తరుగు పేరుతో రైతులను నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు కూడా సహకరించాలని, ధాన్యం నిల్వలను సకాలంలో అన్ లోడ్ చేసుకోవాలన్నారు.  తూకం యంత్రాలను సరి చూసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు  పర్యవేక్షించేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలను ప్రకటించారు. జిల్లా కమిటీలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో డీసీఓ, డీ ఎస్ ఓ, వ్యవసాయ శాఖ ఏ డి, పౌర సరఫరాల సంస్థ డీ ఎం, డీ టి సి, అదనపు డీసీపీ ఉంటారని మంత్రి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Minister prashant reddy, Nizamabad, PADDY PROCUREMENT, Vemula

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు