NAZIMABAD MINISTER VEMULA PRASHANT REDDY HAS CRITICIZED BJP MP ARVIND ATTITUDE TOWARDS THE PURCHASE OF TELANGANA PADDY NZB PRV
Nizamabad: గ్రామాల్లో తిరిగితే కొడుతున్నరని.. ఆ ఎంపీ సోషల్ మీడియాలోనే ఉంటున్నడు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రి వేముల ప్రశాంత్
తెలంగాణ వడ్లు కొనుగోలు విషయలో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, బీజేపీ ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ వడ్లు కొనుగోలు (purchase of Telangana paddy) విషయలో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నరని, బీజేపీ ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అన్నారు. ఆదివారం నిజామాబాద్ (Nizamabad) కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను కేంద్రం కొనుగోలు చేయాలి అది వారి బాధ్యత అన్నారు. దేశంలో విపత్కర పరిస్థితి వస్తే కేంద్రం ఆహార నిల్వలను రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ( BJP MP Arvind) , బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలపై విమర్శలు చేశారు మంత్రి.
కొనుగోలు చేసి పెట్టాలి..
తెలంగాణ వడ్లు కొనుగోలు (Grains purchase) కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నరు. బీజేపీ ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతోంది. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను.. కేంద్రం ధాన్యం కొనుగోలు (paddy purchase) చేయాలి. అది వారి బాధ్యత. దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుంది.. కానీ ఈ రెండేళ్ళ నుంచి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారు.
పీయూష్‌ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు..
తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయని మంత్రి తెలిపారు. దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తామని, గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారని మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని, చాలా బాధాకరం అన్నారు. బీజేపీ నేతలు ఇలా చేస్తారనే సీఎం కేసీఆర్ ముందస్తుగానే వరి సాగు తగ్గించాలని సూచించారని గుర్తు చేశారు మంత్రి. కానీ బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని, రైతులను ఉసిగొల్పారని మంత్రి దుయ్యబట్టారు.
అరవింద్‌ను రైతులు తరిమి కొడతారు..
రా రైస్ కానీ బాయిల్ రైస్ కానీ కొనిపిస్తమని బీజేపీ నేతలు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఎంపీ అరవింద్ (MP Aravind)ను మంత్రి ప్రశ్నించారు. ‘‘అరవింద్ తెలివి హీనంగా మాట్లాడుతున్నాడు. తను ఇచ్చిన దొంగ హామీ లు కప్పి పుచ్చుకోవడానికే ఇదంతా డ్రామా.. ఎంపీ అరవింద్ ను రైతులు తరిమి కొడతారు. ఇక ఎంపీ అర్వింద్ కాలం ముగిసింది.. ఇంకా సోషల్ మీడియాకే పరిమితం.. గ్రామాల్లో తిరిగితే జనాలు కొడుతున్నరు.. దేశంలో ఎక్కడ కూడా ఎంపీని ప్రజలు కొట్టలేదు.. కానీ అర్వింద్ కు మాత్రమే ఆ గతి పట్టింది.’’ ప్రశాంత్ అన్నారు.
‘‘ఏపీతో తో పోలిస్తే రెట్టింపు ధాన్యం తెలంగాణలో పండుతుంది. అదికూడా తెలియకుండా రాష్టం కేంద్రానికి సబ్సిడీ ఇవ్వాలని అనటం ఆయన అవగాహన .లోపానికి నిదర్శనం. ఎంపీ అరవింద్ ( BJP MP Arvind) ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు . మనం కేంద్రం మెడలు వంచుతెనే వింటరు. అందుకే పోరు బాటకు సిద్దం అవ్వండి.
రైతులకు పిలుపు నిచ్చారు.. బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులే తీర్మానాలు చేస్తున్నరు. వారికున్న సృహ ఎంపీలకు లేదు. టీఆర్ఎస్ పార్టీ తలపెట్టే పోరాటంలో రైతులు మాతో కలిసి రండి. రేపటి నుంచి 11 వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం” అన్నారు. ఈ సమవేశంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.