Home /News /telangana /

Telangana: తెలంగాణలో ఆ ఊరికి అతడే ‘సోనూ సూద్’.. కష్టాల్లో ఉన్న వారికి అండదండ..

Telangana: తెలంగాణలో ఆ ఊరికి అతడే ‘సోనూ సూద్’.. కష్టాల్లో ఉన్న వారికి అండదండ..

ఆటో డ్రైవర్ ముజీబ్‌తో గణేష్

ఆటో డ్రైవర్ ముజీబ్‌తో గణేష్

కరోనా సోకినవారికి అతడు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు. గ్రామంలో కరోనా బాధితులకు తన వంతుగా సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

    కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గరికి ఎవ్వరు కూడా రావడానికి ఆసక్తి చూపడం లేదు. క‌రోనా అంటేనే ఆమ‌డ‌దూరం పరుగులు తీస్తున్నారు. సొంత రక్తసంబంధీకులు అయినా సరే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అంటూ ఓ యువకుడు ముందుకు వ‌చ్చి ఓ గ్రామానికి రియల్ హీరో అయ్యాడు. ఆ గ్రామం లో ఎవరికీ కరోనా పాజిటివ్ వచ్చిన తన సొంత ఖ‌ర్చుల‌తో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నాడు. అత‌నే నిజామాబాద్ జిల్లా కు చెందిన అప్పాల గ‌ణేష్. వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన అప్పాల‌ గణేష్ అనే యువకుడు.. గ్రామంలో క‌రోనా బారిన వారి ప‌రిస్థితిని చూసి చ‌లించిపోయాడు.

    కరోనా వచ్చిన పేషెంట్ల వ‌ద్ద‌కు ఎవరు దగ్గరికి రావడం లేదు. ఆలాంటి వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు ఆటోలు కూడా రావ‌డం లేదు. దీంతో గ్రామంలో కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన వారికి త‌న‌వంతు స‌హాయం చేయాల‌ని అనుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముజీబ్ కు విష‌యం చెప్పాడు. క‌రోనా బాదితుల‌ను ఆర్మూర్ అసుప‌త్రికి త‌ర‌లించేదుకు ఒప్పించాడు. డ్రైవ‌ర్ ముజీబ్ క‌రోనా బారిన ప‌డ‌కుండా ఆటోకు ప్ర‌త్యేకంగా క్యాబిన్ చేయించాడు. ఆటో డిజిల్ ఖర్చు త‌నే బ‌రిస్తూ ముజీబ్ కు నెల‌కు ప‌దివేల రూపాల‌యలు జీతం ఇస్తున్నాడు.



    అంతే కాకుండా ముజీబ్ కు జీవిత బీమ పాల‌సీ కూడా చేసాడు. దీంతో అప్ప‌టి నుంచి గ్రామంలో ఎవ‌ర‌కి క‌రోనా వ‌చ్చినా ఆర్మూర్ ప్రభుత్వ‌, ప్రైవేటు అసుప‌త్రికి వారిని ఆటోలో చికిత్స నిమిత్తం తీసుకు వెళుతున్నారు. తిరిగి గ్రామానికి తీసుకు వ‌స్తున్నారు. గ్రామంలో క‌రోనా బారిన ప‌డ్డవారు గ‌ణేష్ అన్న‌కు పోన్ చేస్తే చాలు ఆటో వారి ఇంటి ముందు వాలుతుంది. ఇంత‌టి విప‌త్కార ప‌రిస్థితుల్లో సేవ‌లు అందిస్తున్న‌ అప్పాల గ‌ణేష్‌ను ఆ గ్రామాస్తులు రియాల్ హిరో అంటున్నారు. క‌రోనా స‌మ‌యంలో త‌న సొంత డ‌బ్బుల‌తో త‌ను చేస్తున్న సేవల‌ను చూసి చూట్టు ప్ర‌క్కల గ్రామాల‌వారు అభినందిస్తున్నారు.



    గ్రామాస్తుల‌కు సేవ చేయాలనే ఉద్దేశంతో గత సర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటి చేసి స్వ‌ల్ప తేడ‌తో ఓట‌మి పాల‌య్యారు గణేష్. అయితే మాన‌వ సేవే మాద‌వ సేవా అనుకోని కోవిడ్ బారిన ప‌డిన వారికి త‌న వంత్తు స‌హయం అందిస్తున్నారు. కరోనా సమయంలో గ్రామస్తులకు అండగా నిలుస్తున్నారు. గత సంవత్సరం క‌రోనా కార‌ణంగా వలస కార్మికులు రోడ్డు మార్గంలో వారి వారి గమ్యస్థానాలకు వెళ్తున్న సమయంలో కూడా గణేష్ వారికి సేవలు అందించారు. వలస కార్మికులకు 200 జతల చెప్పులు, మాస్కులు అందజేసి గ‌ణేష్ త‌న‌ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మరోవైపు టిఫిన్స్ భోజనాలు కూడా పెట్టించారు. తన వంతు సహాయంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు.

    (పి మహేందర్, నిజామాబాద్ న్యూస్ 18 కరస్పాండెంట్)
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Nizamabad, Telangana

    తదుపరి వార్తలు