Home /News /telangana /

NAZIMABAD MAN DIES WITH CORONA FEAR AFTER CAME FOR COVID TEST IN NIZAMABAD SU NZB

Telanagana: భయం మహా చెడ్డది.. కరోనా నెగిటివ్ అని తెలిసినప్పటికీ.. కూర్చున్న చోటే..

మృతిచెందిన అశోక్..

మృతిచెందిన అశోక్..

కరోనా వైరస్ విజృంభణ సాగుతున్న వేళ.. కొందరు భయంతోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.

    భయం మహా చెడ్డది అంటారు. కరోనా వైరస్ విజృంభణ సాగుతున్న వేళ.. కొందరు భయంతోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కొందరు కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో రెంజల్ మండలంలో చోటుచేసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు..రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే యువ‌కుడు.. గ‌త ప‌ది రోజులుగాతీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. క‌రోనా సోసిందేమోన‌ని అనుమానంతో తల్లి గంగామణి, సోదరుడు రేంజ‌ల్ లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆధివారం తీసుకువచ్చారు.

    రాపిడ్ కిట్ ద్వారా కోవిడ్ ప‌రిక్ష చేశారు. కొవిడ్ నెగిటివ్ వచ్చింది. అయితే ఆశోక్ సోద‌రుడు, త‌ల్లి ఆసుప‌త్రికి సిబ్బందిని మ‌రోసారి ప‌రీక్ష చేయాల‌ని కోరారు. ఎందుకు అని వారు అడిగితే తీవ్ర జ్వరంతో వారం రోజులుగ బాధపడుతున్నడు అని చెప్పారు. దీంతో వైద్య సిబ్బంది మ‌రో సారి పరీక్ష చేశారు. రెండో సారి చేసిన ప‌రిక్ష‌కు సంబంధించిన ఫలితం రావడానికి సమయం ప‌డుతుంద‌ని చెప్పారు. దీంతో ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోని చెట్టు కింద‌ అశోక్ కూర్చున్నాడు.

    అదే చెట్టుకింద క‌ద‌ల‌కుండా ఉన్న అశోక్ ద‌గ్గ‌ర‌కు తల్లి వ‌చ్చింది.. అప్పటికే చనిపోయాడని గ్రహించిన తల్లి బోరున విలపించింది. మ‌ర‌ణించిన కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లి రోదిస్తున్న తీరు స్థానికుల‌ను కలిచివేసింది. ఆశోక్ ప్రాణాలు విడిచిన 10 నిమిషాలకే రెండోసారి నిర్వహించిన కోవిడ్ ప‌రిక్ష‌ ఫలితం వ‌చ్చింది. అందులో కూడా నెగటివ్ అని తేలింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశోక్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ట్రాక్టర్ లో స్వ గ్రామానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

    మృతునికి భార్య లక్ష్మి ఆరేళ్ళ కొడుకు ఉన్నారు. క‌రోనా వ‌చ్చిందేమో ఆనే భ‌యం తోనే ఆశోక్ మృతి చెంది ఉండ‌వ‌చ్చుని స్థానికులు అనుకుటున్నారు. క‌రోనా రాక ముందే భ‌యంకే చాలా మంది మృతి చెందుతున్నారు. ప్ర‌స్థుతం ఆసుప‌త్రులో క‌రోనా సోకిన వారి చూసి ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌జ‌ల్లో క‌రోనా అంటేనే ఆమ‌డం దూరం పోతున్నారు.. కరోనా రాకుండా వుండ‌లంటే ఏం చేయాలి వ‌స్తే ఏలా ఎదుర్కోవాల‌నే విష‌యాల‌పై పూర్తిగా ఆవ‌గ‌హ‌ణ క‌ల్పించి వారిలో ఆత్మ‌స్తైర్యాన్ని నింపాల్సిన భాద్య‌త ప్ర‌భుత్వ అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులపై ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు