హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..

Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..

Love Marriage: ఇద్ద‌రు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకున్నారు. ఇద్ద‌రు కులాలు వేరు కావ‌డంతో కుటుంబ పెద్ద‌లు వీరి పెళ్లిని అంగీక‌రించలేదు. దీంతో కన్నవారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కానీ చివరకు అతడు చేసిన పని ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  (P.Mahender,News18,Nizamabad)

  ఇద్ద‌రు ఒకరినొకరు గాడంగా ప్రేమించుకున్నారు (Love) . క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకున్నారు. ఇద్ద‌రు కులాలు(Cast) వేరు కావ‌డంతో కుటుంబ పెద్ద‌లు వీరి పెళ్లిని (Marriage) అంగీక‌రించలేదు. దీంతో కన్నవారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర కాపురం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భ‌ర్త .. త‌ల్లి దండ్రుల మాట విని త‌న‌ను కాపురానికి తీసుకెళ్లకుండా మోసం చేస్తున్నారంటూ భార్య అత్తింటి ఎదుట బైఠాయించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమించుకోవాలంటే రెండు మనస్సులు కలిస్తే సరిపోతుంది.. కానీ పెళ్లికి మాత్రం రెండు కుటుంబాల అంగీకారం అప్పనిసరి. కులాలు వేరైనా, మతాలు వేరైనా ఈ రోజుల్లో పెళ్లికి మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు.

  Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..

  ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంటకు కూడా కులాలు అడ్డు వచ్చాయి. అయినా ఇద్దరు ఒకరికి ఒకరు విడిపోకుండా పెద్దలను ఎదరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ చివరకు ఇలా జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇంద‌ల్వాయి మండల తిర్మ‌న్ ప‌ల్లికి చెందిన‌ మౌనిక అదే గ్రామానికి చెందిన శ్రావణ్ ప్రేమించుకున్నారు. ఒక‌రికి ఒక‌రు జీవితాంతం తోడుగా ఉండాల‌నుకున్నారు. వీరి కులాలు వేరుకావ‌డంతో పెద్ద‌లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గ‌త సంవ‌త్స‌రం జూన్ 3న పెద్ద‌ల‌ను ఎదిరించి రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రావ‌ణ్, మౌనిక‌ గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో కాపురం పెట్టారు.

  Extramarital Affair: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తెలుసుకున్న భార్య ఏం చేసిందో చూడండి..

  పెళ్లైన‌ ఏడాదిన్న‌ర‌ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొద‌ల‌య్యాయి. అత్త మామల‌ మాటలు విని భర్త శ్రావ‌ణ్ క‌ట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడ‌ని మౌనిక నాలుగు నెలల క్రితం హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గురువారం అత్తమామలు వచ్చి నీకు భ‌ర‌ణం ఇస్తాము మా అబ్బాయికి విడాకులు ఇవ్వు అంటూ తెగేసి చెప్పారు. దీంతో నా భ‌ర్త నాకు కావాలి.. నేను విడాకులు ఇవ్వ‌నని అత్తింటి ఎదుట ఆందోళ‌న‌కు దిగానని మౌనిక చెబుతోంది.

  Nizamabad: విద్యార్థుల అస్వస్థతకు కారణం అదే.. స్పీకర్ ఇలాఖాలో వారంలో ఇది రెండోసారి.. ఏం జరిగిందంటే..

  మా అత్తగారు, భర్త యొక్క అన్న రవికాంత్, అతని భార్య ఆమని నాపై దాడి చేశార‌ని చెబుతోంది. నా భ‌ర్త నాకు కావాలి.. నేను భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌ను.. నాకు న్యాయం కావాలని మౌనిక పోలీసుల‌ను ఆశ్రయించింది. త‌న‌కు రూ. కోటి క‌ట్నం తీసుకు ర‌మ్మని వేదిస్తున్నారని.. వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన అత్తింటి వారి నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది త‌న‌కు రక్ష‌ణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  First published:

  Tags: Crime, Crime news, Dowry demand, Dowry harassment

  ఉత్తమ కథలు