• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NAZIMABAD LAUNCH QR CODE APP FOR THE SAFETY OF WOMEN VB NZB

She team: షీ టీంకు ఫిర్యాదు చేయాలా.. అయితే ఇలా చేయండి.. క్షణాల్లో సంఘటనా స్థలానికి టీం చేరుకుంటుంది..

She team: షీ టీంకు ఫిర్యాదు చేయాలా.. అయితే ఇలా చేయండి.. క్షణాల్లో సంఘటనా స్థలానికి టీం చేరుకుంటుంది..

క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

She team: మ‌హిళ‌ల‌కు, యువ‌తుల‌కు, విద్యార్థినిల‌కు షీ టీం ఓ క‌వ‌చం లాంటిది.. ఆపద సమయంలో పరిష్కారం చూపుతుంది. వివిధ ప‌నుల నిమిత్తం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఒంట‌రి మ‌హిళ‌ల‌కు రక్షణగా ఉంటుంది. అయితే ఫిర్యాదుదారుల‌కు షీ టీం సేవలు మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు QR కోడ్ స్కాన్ యాప్ ను తీసుకువ‌చ్చారు. దీంతో షీ టీం సేవలు మ‌రింత సుల‌భం కానున్నాయి.

  • Share this:
    (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    నిజామాబాద్ జిల్లా సీపీ కార్యా‌ల‌యంలో రాష్ట్ర పోలీస్ శాఖ మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేసేందుకు క్యూఆర్ కోడ్ వాల్ పోష్ట‌ర్ ను సీపీ కార్తీకేయ ఆవిష్క‌రించారు. ఆటూ కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాల‌యంలో ఎస్పీ శ్వేత ఆవిష్క‌రించారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని డివిజ‌న్ ల ప‌రిధిలో ఈ షీ టీం లు ప‌నిచేస్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లాలో మ‌హిళ‌ల‌కు ఏదైనా ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడు క్యూ ఆర్ కోడ్ సాయంతో స‌మాచారం ఇస్తే వెంట‌నే షీ టీం ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. త‌క్షణ స‌హాయం అందిస్తుంది. లేదంటే డ‌య‌ల్ 100కు ఫిర్యాదు చేయాల‌ని చూచించారు. QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ లలో.. రైల్వే స్టేషన్.. సినిమా హల్స్.. స్కూల్స్.. కళాశాలలు.. జ‌న సంచారం ఉన్న‌ రద్దీ ప్రాంతాల్లో అతికించబడి ఉంటాయి. జిల్లా లో ఎవరైనా బాధిత మహిళలు షీ టీం కు ఫిర్యాదు చేయదలుచుకున్నప్పుడు ముందుగానే తమ మొబైల్ నందు QR కోడ్ స్కానర్ ను కలిగి ఉండాలన్నారు.

    తమ ఫోన్ తో పోస్టర్ పై ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడంతో https://qr.tspolice. gov.in అనే లింక్ వస్తుంది. దీనిని క్లిక్ చేయగానే ఫిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, లొకేషన్ తదితర వివరాలను నింపి స‌బ్మిట్ చేయాలి. ఈ స‌మాచారం సీపీ పోలీస్ కార్యాలయంలో షీ టీం కంట్రోల్ రూమ్ కు చేరుతుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది.. ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ లొకేషన్ కు దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడం జ‌రుగుతుంది. తద్వారా సంబంధిత అధికారులు లొకేషన్ కు చేరుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.

    కామారెడ్డి జిల్లాలో క్యూ ఆర్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం


    ఎలాంటి వేధింపులకైనా గురయ్యే మహిళలు షీ టీం కు ఫిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.. ఫిర్యాదు మహిళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.
    Published by:Veera Babu
    First published: