Home /News /telangana /

Telangana Farmers: తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువగా నష్ట పోయింది రైతులే.. సమస్యలను పరిష్కారించాలని..

Telangana Farmers: తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువగా నష్ట పోయింది రైతులే.. సమస్యలను పరిష్కారించాలని..

మాట్లాడుతున్న కోదండరామ్

మాట్లాడుతున్న కోదండరామ్

Telangana: తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువగా నష్టపోయింది రైతులే అని.. వేసంగి వరిపంట వేయాలో వద్దో చెప్పకుండానే సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారని.. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అయ్యారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  (P.Mahender,News18,Nizamabad)

  తెలంగాణ (Telangana) వచ్చిన తరువాత ఎక్కువగా నష్టపోయింది రైతులే(Farmers) అని.. వేసంగి వరిపంట వేయాలో వద్దో చెప్పకుండానే సీఎం కెసిఆర్(Cm Kcr) ఫామ్ హౌస్ కు వెళ్లారని.. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన రైతులు రోడ్ల మీద వరిధాన్యం కుప్పల వద్ద ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం మండిపడ్డారు. రైతు రక్షణ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానీపేట్, మంతని, దేవునిపల్లిలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం పర్యటించారు.

  Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


  వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా వర్షాలకు పంట తడిసి రైతులు నష్టపోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవాణా సమస్య తీవ్రంగా ఉందన్నారు.. వరి కొనుగోలులో తీవ్ర జాప్యం వల్ల వర్షం పడి వరి ధాన్యం మొలకెత్తడం నల్లబడడం జరుగుతుందన్నారు.. ఇందుకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మరో కారణం అన్నారు. భవానీపేట్ మార్కెట్ యార్డ్ నుండి మాచారెడ్డి ఎమ్మార్వో తో ఫోన్లో మాట్లాడి అక్కడి సమస్యలు వివరించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

  Sub Inspector: ఆ ఎస్సై వివాహితతో బెడ్ పైనే రచ్చ రచ్చ.. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన భర్త.. తర్వాత ఏం జరిగిందో చూడండి..


  ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారు రోడ్ల పైన ఉన్నారు.. కానీ తెలంగాణ వ్యతిరేకులు మాత్రం ఎమ్మెల్సీ లుగా, మంత్రులుగా ఉన్నారని అయన మండి పడ్డారు.. సీఎం కెసిఆర్ ఢిల్లీ నుంచి వచ్చి వేసంగి సాగుగురించి చెప్పకుండా ఫామ్ హౌస్ లోకి వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేసాడు.. రైతులు కస్టపడి పండించిన పంటలను కచ్చితంగా కొనుగోలు చేయని అయన డిమాండ్ చేసారు.. వేసంగిలో కూడా వరి పంట పండిస్తారు.. ఆ ధాన్యాన్నికూడా సీఎం కేసీఆర్ కొనుగోలు చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ రమేష్ ముదిరాజ్ , సంగారెడ్డి జిల్లా కన్వీనర్ తులజ రెడ్డి , వినోద్ స్వామి స్థానిక రైతులు పాల్గొన్నారు.

  Mini Family Story: భర్త చేసిన పనికి.. ఆమె ఇలా బిడ్డను ఎత్తుకొని బయటకు రావాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే..


  ఇక వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. రెండు నెలలుగా వరి ధాన్యం కొనడం లేదని.. రైతులు వరి కుప్పలమీద మరణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. దేశంలో రైతులకు సంకెళ్లు వేసి వరి ధాన్యం కొనుగోల్లు నిలిపివేశారన్నారు. కాంగ్రెస్‌ నేతల్లో మనస్పర్థల గురించి మాట్లాడిన వీహెచ్‌.. అందరం ఐకమత్యంగా ఉండి పోరాడదామని చెప్పారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య గొడవులున్నాయని.. రేవంత్ రెడ్డి వారందరితో మాట్లాడి అంతా సెట్ చేయాలని కోరారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Kodandaram, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు