Home /News /telangana /

NAZIMABAD KAMAREDDY DISTRICT CONGRESS LEADERS BATTERED BY CLASS DIFFERENCES SNR NZB

TSCONGRESS:కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల కొట్లాట..రచ్చబండ పేరుతో రచ్చ రచ్చ

(రచ్చబండలో రచ్చ రచ్చే)

(రచ్చబండలో రచ్చ రచ్చే)

Political war:కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు బయటపడ్డాయి. రచ్చబండ పేరుతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల నేతలు ఆధిపత్యం కోసం కొట్టుకున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నేతలు రోడ్డునపడి రచ్చ రచ్చ చేశారు.

ఇంకా చదవండి ...
(P.Mahendar,News18,Nizamabad)
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌ (Congress)పార్టీ పరిస్థితి అయోమయంలో ఉంటే..పార్టీ నేతలు మాత్రం గ్రూప్‌లు మెయిన్‌టెన్ చేస్తూ..కొట్టుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేదు. వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకొని హస్తం పార్టీకి చెందిన నేతలే గ్రూప్‌లుగా విడిపోయి కొట్టుకున్న ఘటన కామారెడ్డి (Kamareddy)జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Ellareddy)అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగంపేట్(Lingampet)మండలం కోమటిపల్లి(Komatipalli)లో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి మదన్ మోహన్ రావు(Madan Mohan Rao)వర్గీయులు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుభాష్ రెడ్డి(Subhash Reddy)వర్గీయులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

కామారెడ్డి కాంగ్రెస్‌లో కుమ్ములాట..
ఒకే పార్టీకి చెందిన నేతలు కేవలం కార్యక్రమం నిర్వ హిస్తే ప్రత్యర్ధికి ఎక్కడ పేరు వస్తుందోన్న దురాలోచనతో ఘర్షణ పరిస్థితుల్ని సృష్టించారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ప‌రిస్థితి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ సుభాష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి మదన్ మోహన్‌రావు, తమ ఆధిపత్యల పోరు కోసం రచ్చబండ పేరుతో రచ్చకెక్కారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి సుభాష్‌రెడ్డి వ‌ర్గీయులు నిర్వ‌హిస్తున్నారు.

రచ్చబండ పేరుతో రచ్చ రచ్చ..
అదే రోజు లింగంపేట్ మండలంలోని కోమటిపల్లిలో మ‌ద‌న్ మోహ‌న్ వ‌ర్గీయులు ర‌చ్చ బండ నిర్వ‌హిస్తున్న‌ర‌ని తెలిసిన సుబాష్ రెడ్డి వ‌ర్గీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈవిషయంలోనే సుభాష్‌రెడ్డి తనకు తెలియకుండా రచ్చబండ నిర్వహించడంపై మండిపడ్డారు.ఈ విషయంలోనే ఇరు వర్గాలు పరస్పరం పిడి గుద్దులు గుద్దుకున్నారు. చివ‌ర‌కు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ నిర్వహించిన రైతు సభలో మదన్ మోహన్, సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి. మదన్ మోహన్ వ్యవహారశైలి పై జిల్లాకు చెందిన కొందర కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై పార్టీ జిల్లా నాయకత్వానికి గతంలో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మదన్ మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు.

మరోసారి బయటపడ్డ వర్గపోరు..
ఈ వివాదం కాంగ్రెస్ పార్టీ లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయమై డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వివాదం సద్దుమణగక ముందే ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో రెండు వ‌ర్గాల‌ మధ్య మరోసారి ఫైటింగ్ జరిగింది. ఈ పరస్పర దాడులపై కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని జిల్లా కాంగ్రెస్‌ నేతల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Kamareddy, TS Congress

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు