హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: కుంటాలను త‌ల‌పిస్తున్న వాట‌ర్ ఫాల్స్.. ఎక్క‌డో తెలుసా..

Telangana News: కుంటాలను త‌ల‌పిస్తున్న వాట‌ర్ ఫాల్స్.. ఎక్క‌డో తెలుసా..

జలపాతం వద్ద పర్యాటకుల సందడి

జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Telangana News: చూట్టూ ద‌ట్ట‌మైన అట‌వి ప్రాంతం. ఎత్తైన అలుగు నుంచి కింద‌కు జాలు వారుతున్న జల‌పాతం. ఈ అందాల‌ను చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్న ప్ర‌కృతి ప్రేమికులు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఆనందంగా గ‌డుపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ప‌ర్యాట‌క‌ కేంద్రంగా అభివృద్ది చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు.. మీకు కూడా చూడాల‌ని ఉందా.. అయితే నిజామాబాద్ జిల్లాకు రావాల్సిందే.

ఇంకా చదవండి ...

  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  చూట్టూ ద‌ట్ట‌మైన అట‌వి ప్రాంతం. ఎత్తైన అలుగు నుంచి కింద‌కు జాలు వారుతున్న జల‌పాతం. ఈ అందాల‌ను చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్న ప్ర‌కృతి ప్రేమికులు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఆనందంగా గ‌డుపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ప‌ర్యాట‌క‌ కేంద్రంగా అభివృద్ది చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు.. మీకు కూడా చూడాల‌ని ఉందా.. అయితే నిజామాబాద్ జిల్లాకు రావాల్సిందే.  నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంక‌లు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి జానకీబాయి చెరువును గతంలో సిర్నాపల్లి సంస్థానాదీశురాలు శీలం జానకీబాయి తన హయాంలో కట్టించింది. ద‌ట్ట‌మైన అట‌వి ప్రాంతంలో జానకి భాయి చెరువు అలుగు 42 మీటర్ల ఎత్తులో ఉంది. చెరువు నిండి పై నుంచి పొర్లుతున్న నీటిని చూస్తుంటే కుంటాల జాల‌పాతాన్ని త‌ల‌పిస్తుంది.. ఈ సుంద‌ర దృశ్యాల‌ను చూసేందుకు పర్యాటకులు తర‌లి వ‌స్తున్నారు.

  పై నుండి జలధార కిందికి రావడంతో కంటి చూపును తిప్పుకోకుండా చూస్తుండి పోతున్నారు. ఇంతటి సుంద‌ర దృశ్యాల‌ను చూసేందుకు రెండు క‌నులు చాలావు అన్న‌ట్టుగా ఉంది. చాలా పొడవైన అలుగు ఎత్తైన ప్రదేశం నుండి నీటి దారలు కిందికి వస్తున్నాయి.. ఈ అహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఇక్కడికి వెళ్లడానికి రోడ్డు బాగు చేస్తే సిర్నాపల్లి ఒక పర్యాటక ప్రదేశంగా మారుతుందని ప్ర‌కృతి ప్రేమికులు అంటున్నారు. ఇంత అంద‌మైన జ‌ల‌పాతం నిజామాబాద్ జిల్లాలో ఉండ‌డం ఆనందంగా ఉంది.. ఇక్క‌డ పర్య‌ట‌కులు వ‌చ్చి వెల్లేదుకు రోడ్డు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రాజు అనే ప‌ర్య‌ట‌కుడు అంటున్నారు. ఇక్క‌డ బ‌ట్టలు మార్చుకోవాడానికి గ‌దులు ఎర్పాటు చేస్తే బాగుంటుంద‌న్నారు.


  ఈ ప్రాంతాన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు..

  ఈ ప్రాంతాన్ని న‌యాగార పాల్స్, ఇందురూ జ‌ల‌పాతం అంటున్నారని స్థానిక గ్రామ‌స్తులు అంటున్నారు.. జిల్లాలో ఇలాంటి జ‌ల‌పాతం ఎక్క‌డా లేదు.. 44 మీట‌ర్ల ఎత్తు నుంచి నీరు జాలు వార‌డంతో ప‌ర్యాట‌కులు చూసేందుకు క్యూ క‌డుతున్నారు. అయితే ఇక్క‌డికి వ‌చ్చి వేళ్లే దారిని అబివృద్ధి చేస్తే బాగుంటుంద‌ని వారు అంటున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Nizamabad, Telangana News, Tourism

  ఉత్తమ కథలు