హోమ్ /వార్తలు /telangana /

Prison Mandi: నేరం చేయకుండానే జైలు భోజనం తినాలంటే .. నిజామాబాద్‌ వెళ్లాల్సిందే

Prison Mandi: నేరం చేయకుండానే జైలు భోజనం తినాలంటే .. నిజామాబాద్‌ వెళ్లాల్సిందే

(జైలు భోజనం లభించును)

(జైలు భోజనం లభించును)

Prison Mandi:జైలు కూడు తినాలని ఎవరూ అనుకోరు. కాని నిజామాబాద్ నగరవాసులు మాత్రం తెగ ఆసక్తి చూపుతున్నారు. ఏ నేరం చేయకుండా జైలు భోజనం ఎలా తింటున్నారని ఆశ్చర్యపోకండి. మీరు నిజామాబాద్‌కి వెళ్తే జైలు భోజనం చేయవచ్చు.

(P.Mahendar,News18,Nizamabad)

వినూత్నంగా ఆలోచించడం, కొత్త తరహా ప్రయోగాలు జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులుగా మార్కెట్‌లో సక్సెస్‌ కావాలనుకునే వాళ్లు ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. అందుకు ఏ వ్యాపారమని చూడటం లేదు. తమ వ్యాపారాల పేర్లు పెట్టడం దగ్గర నుంచి వాటిని స్టైల్‌గా ఏర్పాటు చేయడం వరకూ కొత్తదనం చూపిస్తున్నారు. నిజామాబాద్(Nizamabad)జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కొత్త రెస్టారెంట్(Restaurant)పేరు దగ్గర నుంచి రెస్టారెంట్‌ స్టైల్‌ అందర్ని ఆకర్షిస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంతోష్(Santosh)టౌన్‌లో ఓ రెస్టారెంట్‌ పెట్టాడు. రొటీన్‌కి భిన్నంగా హోటల్‌ పేరును జైల్ మండి (Prison Mandi)అని ప్రారంభోత్సవం చేశాడు.

ఏ నేరం చేయకుండానే జైలుకు..

టౌన్‌లోని శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ స్పెషాలిటీ ఏమిటంటే జైలు కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. సర్వెంట్లు ఖైదీలుగా, డైనింగ్‌ రూమ్స్‌ని ఖైదీల గదులుగా మార్చారు. జైల్ మండిలో అడుగుపెట్టగానే కచ్చితంగా జైలుకు వెళ్లిన ఫీలింగ్‌ కలిగేలా ఎంట్రీలో జైలర్‌, ఖైదీలతో పాటు బేడీలు, గన్స్, వంటి వాటిని ఏర్పాటు చేసి కస్టమర్ల దృష్టిని తమ రెస్టారెంట్‌పై పడేలా జాగ్రత్తపడ్డాడు.

నిజామాబాద్‌లో జైలు భోజనం..

రెస్టారెంట్‌ ఎంట్రీలోనే పోలీసులు, ఖైదీల వేషంలో ఉన్న బొమ్మలు వెల్‌కమ్ పలుకుతాయి. లోపలికి వెళ్లగానే జైల్‌లో సెల్‌లు ఉన్నట్లుగా ఇనుప చువ్వలతో తయారు చేసిన డౌనింగ్ రూమ్స్, బొమ్మ తుపాకీలు, ఖైదీల చేతులకు వేసే సంకెళ్లు అన్నీ కొత్తగా కనిపిస్తాయి. జైల్లో అన్నం తింటున్న ఫీలింగ్ కలగడం కోసం ఖైదీ డ్రెస్సులు వేసుకున్న సర్వెంట్లు భోజనం వడ్డిస్తారు. చూడటానికి రెస్టారెంట్ జైలు తరహాలో ఉన్నప్పటికి అనేక రకాల ఫుడ్ వెరైటీలు ఇక్కడ దొరుకుతున్నాయి. రుచికరమైన భోజనం అందిస్తున్నారు.


ఇది చదవండి : వివాహేతర సంబంధం పెట్టుకున్న వృద్ధుడి హత్య ..మంత్రగాడనే అనుమానంతోనే ఘాతుకం

వింత ఆలోచనకు విశేష స్పందన..

ప్రిజ‌న్ మండి యజమాని సంతోష్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడు. అయితే సొంత జిల్లాలో కొత్త తరహా రెస్టారెంట్‌ పెట్టాలన్న ఆలోచన రాగానే ఈ కాన్సెప్ట్ బాగుంటుందని భావించానని చెప్పాడు. ఈరెస్టారెంట్‌కు వస్తున్న పిల్లలు సైతం అక్కడి బొమ్మ తుపాకులు గురి పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఖైదీ గదుల్లో భోజనం చేస్తూ పెద్దలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ట్రైన్ సర్వీస్ రెస్టారెంట్, రోబో సర్వీస్‌ రెస్టారెంట్‌లు ఎలా పాపులర్ అయ్యాయో.. నిజామాబాద్ టౌన్‌లో జైల్ మండి రెస్టారెంట్‌ కూడా అంతే పాపులర్ అవుతోంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి తెలిసి తమ బిజినెస్‌ బాగా సాగుతుందని ఆశిస్తున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.

First published:

Tags: Nizamabad, Telangana

ఉత్తమ కథలు