Home /News /telangana /

NAZIMABAD INTER STUDENT WHO CAUSED A ROAD ACCIDENT HAS COMMITTED SUICIDE BY JUMPING FROM A COLLEGE BUILDING NZB VB

OMG: ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. ఓ ఘటనకు బాధ్యుడిగా మారాడు.. దీంతో తన కాలేజీకి వెళ్లి ఇలా చేశాడు..

సీసీ టీవీ ఫుటేజీ

సీసీ టీవీ ఫుటేజీ

OMG: ఓ రోడ్డు ప్రమాదానికి కారణం అయిన ఇంట‌ర్ విద్యార్థి.. గాయ‌ప‌డివ‌న వారికి న‌ష్ట ప‌రిహారం చేల్లించాల‌నే భయంతో తాను చ‌దువుత‌న్న క‌ళాశాల‌ మూడో అంతస్తు భవనం మీద నుంచి దూకి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘ‌ట‌న‌ నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  (P.Mahender,News18,Nizamabad)

  ఓ రోడ్డు ప్రమాదానికి కారణం అయిన ఇంట‌ర్ విద్యార్థి.. గాయ‌ప‌డివ‌న వారికి న‌ష్ట ప‌రిహారం చేల్లించాల‌నే భయంతో తాను చ‌దువుత‌న్న క‌ళాశాల‌ మూడో అంతస్తు భవనం మీద నుంచి దూకి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘ‌ట‌న‌ నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాక‌తీయ క‌లేజీలో సాయికుమార్ (17) ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు.. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన సాయికుమార్ హాస్ట‌ల్ లో ఉంటున్నారు. అయితే సోమవారం స్నేహితుడు బైక్ తీసుకొని అతడు కంటేశ్వర్ వైపు వెళ్లాడు.. జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు రాగానే అతని బైక్ హ్యాండిల్ మరో ద్విచక్ర వాహనానికి తగలడంతో ఆవాహనం మరో బైక్ ను ఢీకొట్టింది..

  Disha Patani: హీటెక్కిస్తోన్న దిశా ప‌టానీ బికినీ ఫొటోలు.. చూసి తట్టుకోవడం కష్టమే..


  దీంతో మూడు వాహనాలు అదుపుతప్పి సాయి కుమార్ తో పాటు వినాయ‌క్ న‌గ‌ర్ కు చెందిన‌ బల్విందర్, నవీపేట్ కి చెందిన మరో వ్యక్తి కింద పడిపోగా వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు తమకు చికిత్స ఖర్చుతో పాటు బైక్ రిపేర్ కోసం ఇరవై వేలు ఇవ్వాలని చెప్పారు.. అయితే అక్క‌డి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.. చికిత్స కోసం పది వేలు ఖర్చు అవుతుందని చెప్పారు.

  దీంతో సాయికుమార్ త‌న వద్ద డబ్బు లేవని మా అమ్మ నాన్నకు చెబుతా అని చెప్పి బయటకు వెళ్లాడు. అయితే అక్క‌డి నుంచి త‌ప్పించుకుని కాలేజీకి వ‌చ్చాడు. గాయ‌ప‌డిన ఆ ఇద్ద‌రు సాయికుమార్ కోసం కళాశాలకు వ‌చ్చారు.. సాయి కుమార్ ను పంపిచాల‌ని సెక్యూరిటీ సిబ్బంది గ‌ట్టిగా మాట్లాడారు.

  Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. తెల్లవారుజామున ఇలా జరగడంతో..


  ఈ విష‌యం గ‌మ‌నించిన సాయికుమార్ బ‌య‌ట‌కు వ‌స్తే ఏం చేస్తారో అనే భయంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి కింద దూకేశాడు.. దీంతో సాయి కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.. చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు.. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు ఆస్పత్రికి వచ్చి బోరున విలపించారు.. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పిల్ల‌లు మంచిగా చ‌దువుకుంటే మంచి భ‌విశ్యత్తు ఉంటుంది..

  Double Shocking: ఇద్దరూ మగవాళ్లు అయి ఉండి ఇదేం బుద్ది.. ఆ పని కోసం ఎంత పనిచేశావయ్యా..


  అందుకోసం త‌ల్లిదండ్రులు వారి స్థొమ‌త‌కు మించి ఖర్చు చేస్తున్నారు.. మంచి పేరున్న కాలేజీల్లో చేర్పించి ఎంత ఫీజైన క‌ట్టి చ‌దివిస్తున్నారు.. కానీ పిల్ల‌లు వారి క‌ల‌ల‌ను నిజం చేయాల్సింది పోయి.. ఇత‌ర వ్యాప‌కాల్లో త‌ల దూర్చి ప్రాణాలు తీసుకుంటున్నారు.. దీంతో పిల్ల‌లు వారి త‌ల్లి దండ్రుల క‌న్నీరే మిగుల్చుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Nizamabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు