KamaReddy: కామారెడ్డిలో షాకింగ్ ఘటన.. యువకుడితో మరో యువకుడి ‘గే’ సెక్స్.. అతని తల్లితో కూడా అఫైర్.. ముగ్గురూ..

పోలీసుల అదుపులో నిందితుడు

కామం మత్తులో కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. కన్నూమిన్నూ కానరాక మానవ సంబంధాలకే మాయని మచ్చ తెస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన సరిగ్గా అలాంటిదే. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఓ యువకుడితో మరో వ్యక్తి లైంగిక సంబంధం కొనసాగించాడు.

 • Share this:
  కామారెడ్డి: కామం మత్తులో కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. కన్నూమిన్నూ కానరాక మానవ సంబంధాలకే మాయని మచ్చ తెస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన సరిగ్గా అలాంటిదే. స్వలింగ సంపర్కానికి (Homo Sexuality) అలవాటు పడిన ఓ యువకుడితో మరో వ్యక్తి లైంగిక సంబంధం (Affair) కొనసాగించాడు. ఆ యువకుడు ఈ వ్యక్తిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఉన్న యువకుడి తల్లితో కూడా సదరు వ్యక్తి వివాహేతర సంబంధం (Extra Marital Affair) ఏర్పరచుకున్నాడు. ముగ్గురూ కొన్నాళ్లుగా కామం మత్తులో మునిగితేలుతున్నారు.

  ఈ తల్లీకొడుకులు ఆ వ్యక్తితో సాగిస్తున్న లైంగిక సంబంధం గురించి ఆ వివాహిత భర్తకు తెలిసింది. దీంతో.. ఇవేం పనులంటూ నిలదీశాడు. భార్య, కొడుకుతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్యాకొడుకుతో కనిపిస్తే మర్యాదగా ఉండదని ఆ వ్యక్తిని ఆమె భర్త హెచ్చరించాడు.

  దీంతో.. కొన్నాళ్లుగా ఆ యువకుడు సదరు వ్యక్తితో తండ్రికి తెలియకుండా లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ.. తమకు నచ్చినట్టుగా అతనితో కలిసేందుకు తన భర్త అడ్డుపడుతున్నాడని భావించిన అతని భార్య, తన కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను నమ్మించి గొంతు పిసికి చంపేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మిట్టపెల్లి రాజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో నివాసముంటున్నాడు. అతనికి హైదరాబాద్‌కు చెందిన జాజు రాజేశ్‌తో ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. రాజు చిన్నప్పటి నుంచి హోమో సెక్సువల్ కావడంతో రాజు, రాజేష్‌తో శారీరక సంబంధం పెట్టుకొని తన సొంత ఊరు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి రాజు ఇంట్లోనే రాజేశ్ ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి పోచమ్మ ( అలియాస్ పుష్ప ) తో కూడా రాజేష్ వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ అనైతిక సంబంధం గురించి రాజు తండ్రి కృష్ణ (55) కు తెలిసింది. దీంతో.. గొడవలు మొదలయ్యాయి. ఇలా చేయొద్దంటూ భార్య, కొడుకును మందలించాడు. రాజేష్‌ను హెచ్చరించి ఇంట్లో నుంచి పంపించేశాడు. అయితే.. కొన్నాళ్లు రాజు రాజేష్‌తో కలిసి బయట తమ సంబంధాన్ని కొనసాగించాడు.

  ఇది కూడా చదవండి: Nizamabad: ఈ మధ్యే ఇతనికి పాప పుట్టింది.. కానీ ఆ దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడో.. హృదయవిదారక ఘటన

  కానీ.. తమ తండ్రి ఉంటే తమ సంబంధాన్ని కొనసాగించలేమని భావించిన రాజు, అతని తల్లి కృష్ణను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ముగ్గురూ కలిసి నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 4వ తేదీన దైవ దర్శనానికి వెళదామని కృష్ణను నమ్మించి వేములవాడ రాజన్న దర్శనానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లి కొండపైన ఓ కాటేజీలో గది అద్దెకు తీసుకున్నారు. రాత్రి పూటుగా మద్యం తాగిన తర్వాత నలుగురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే అనుకున్న ప్లాన్ ప్రకారం.. రాజు, అతడి తల్లి, రాజేష్ కలిసి కృష్ణ కాళ్లూ, చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్టు చేయగా అసలు గుట్టు బయటపడింది. పరారీలో ఉన్న రాజు తల్లి , రాజేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  శ్రీనివాస్.పి, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్
  జగిత్యాల జిల్లా

  Published by:Sambasiva Reddy
  First published: