హోమ్ /వార్తలు /తెలంగాణ /

kalvakuntla kavitha : సీఎం కేసీఆర్ కూతురికి మళ్లీ పదవి.. ఈసారి ఏ కోటాలో?

kalvakuntla kavitha : సీఎం కేసీఆర్ కూతురికి మళ్లీ పదవి.. ఈసారి ఏ కోటాలో?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఫైల్ ఫోటో)

తెలంగాణలో ఎమ్మెల్సీ నగారా మోగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా శాసన మండలికి మళ్లీ ఎన్నికకావాల్సి ఉండగా, ఆమెను స్థానిక సంస్థల కోటాలో బరిలోకి దింపుతారా? లేక గవర్నర్ కోటాలో నేరుగా నామినేట్ చేస్తారా? అనే నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నది. జిల్లాకే చెందిన ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియగా, ఎవరు ఏకోటా బరిలో ఉంటారు? అనేది చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...

  (P.Mahender,News18,Nizamabad)

  తెలంగాణలో ఎమ్మెల్సీ నగారా మోగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా శాసన మండలికి మళ్లీ ఎన్నికకావాల్సి ఉండగా, ఆమెను స్థానిక సంస్థల కోటాలో బరిలోకి దింపుతారా? లేక గవర్నర్ కోటాలో నేరుగా నామినేట్ చేస్తారా? అనే నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నది. ఎమ్మెల్సీ నగారాతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.. జిల్లాలో ఎమ్మేల్సీ ఆకుల ల‌లిత ప‌ద‌వి కాలం ముగిసింది.. జ‌న‌వ‌రి 4న ఎమ్మేల్సీ క‌విత ప‌దివి కాలం ముగుస్తుంది.. దీంతో ఈ రెండు స్థాల‌న‌కు నోటిపికేష‌న్ వెలువ‌డింది..

  సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ముందు బతుకమ్మగా రాష్ట్ర ప్రజలకు పరిచయమ‌య్యారు.. జాగృతి అధ్యక్షురాలు గా క‌ల్వ‌కుంట్ల క‌విత‌ బతుకమ్మను ప్రపంచదేశాలకు చాటి చెప్పింది.. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ గెలుపొంది.. పార్ల‌మెంట్ లో తెలంగాణ గొంతుక‌ను వినిపించింది.. 2018లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజ‌య‌డంఖ మోగించింది.. అయితే 2019 లో జ‌రిగ‌న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌విత‌ ఓటమి పాలయ్యారు.. దీంతో జిల్లా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు..

  స్థానిక సంస్థ‌ల ఎమ్మేల్సీగా ఉన్న భూప‌తి రెడ్డి పార్టీ ఫిరాయింపుతో ప‌ద‌వీచ్యుతుడయ్యారు.. దీంతో 2020 లో స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక వ‌చ్చింది.. అయితే 2020 మార్చిలో జ‌ర‌గాల్సిన ఎమ్మేల్సీ ఉప ఎన్నిక కరోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి.. దీంతో అక్టోబ‌ర్ 9న స్థానిక సంస్థాల ఉప ఎన్నిక జ‌రిగింది.. ఈ ఎన్నిక‌ల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత బారీ విజ‌యం సాదించారు.. ఆ నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. కీలక పాత్ర పోషిస్తున్నారు.. జిల్లాలోని నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేస్తూ తన వంతు కృషి చేస్తోంది..

  గత జూన్ లో గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీల కాల పరిమితి ముగిసింది.. అయితే జిల్లాకు చెందిన ఎమ్మేల్సీ ఆకుల‌ ల‌లిత ప‌దవికాలం ముగిసింది.. అయితే ఆమె స్థానంలో క‌ల్వ‌కుంట్ల క‌విత బారిలో దిగుతుందిని ప్రచారం జ‌రిగింది.. ఎందుకంటే 2022 జ‌న‌వ‌రి 4న ఎమ్మేల్సీ క‌విత ప‌దవికాలం ముగుస్తుంది.. అప్ప‌టి వ‌ర‌కు వేట్ చేయ‌కుండా గ‌వ‌ర్న‌ర్ కోట లో ఎమ్మేల్సీగా బ‌రిలో దిగాల‌నుకుందిని స‌మాచారం.. అయితే స్థానిక సంస్థ‌ల ఎమ్మేల్సీ న‌గరా మోగ‌డంతో సీఎం త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత స్థానిక సంస్థ‌ల బ‌రిలో నిలుస్తుంద‌ని స‌మాచారం.. గ‌వ‌ర్న‌ర్ కోటలో గెలిస్తే కిక్కేముంటుంది.. అదే స్థానిక సంస్థ‌ల ఎమ్మేల్సీగా గెలిస్తేనే మంచి కిక్కుంటుద‌ని ఆ దిశ‌గా క‌విత‌ పోటీ చేస్తారని తెలుస్తుంది..

  జిల్లా లోని కొందరు సీనియర్లు ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.. వారిలో మొదటగా టిడిపి నుంచి వచ్చిన మాజీ మంత్రి మండ‌వ‌ వెంకటేశ్వరరావు.. టిడిపి నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి. జిల్లా పార్టీ అధ్యక్షుడు 20 యేళ్లుగా సేవలందించిన ఈ గంగారెడ్డి.. మైనార్టీ నాయకులు ముజీబ్ తదితరులు ఎమ్మెల్సీగా పోటీలో దిగేందుకు వారి వారి గాడ్ ఫాదర్ ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు.. మరి ఎమ్మెల్సీ కవిత ఎటువైపు.. మరొకరు ఎవరికి అవకాశం దక్కనుంది.. అనేది నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..

  Published by:Madhu Kota
  First published:

  Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mlc elections, Nizamabad, Nizamabad District, Trs

  ఉత్తమ కథలు