• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NAZIMABAD HIJRA FASTING INITIATION TO SOLVE PROBLEMS IN KAMAREDDY DISTRICT VB NZB

Telangana: ఆ సమస్యలపై హిజ్రాల ఆమరణ నిరాహార దీక్ష.. పట్టించుకోని అధికారులు.. ఎక్కడో తెలుసా?

Telangana: ఆ సమస్యలపై హిజ్రాల ఆమరణ నిరాహార దీక్ష.. పట్టించుకోని అధికారులు.. ఎక్కడో తెలుసా?

హిజ్రాల ఆమరణ నిరాహార దీక్ష ఫ్లెక్సీ

గత పది సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఉంటున్నా తమకు లాక్‌డౌన్‌ సమయంలో గది ఇచ్చి ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటున్నారని, ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను తెలుపుదామంటే కలవనివ్వడం లేదని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం వెంటనే డబుల్‌బెడ్‌ రూం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.

  • Share this:
    గత పది సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఉంటున్నా తమకు లాక్‌డౌన్‌ సమయంలో గది ఇచ్చి ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటున్నారని, ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను తెలుపుదామంటే కలవనివ్వడం లేదని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం వెంటనే డబుల్‌బెడ్‌ రూం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద యంగ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిజ్రాలు తమ సమస్యల పరిష్కారానికై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టా రు. తమకు సమాన హక్కులు కల్పించాలని, అదే విధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    ఎమ్మార్వో చుట్టు తిరిగినా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు.. ఎమ్మార్వో కు అడిగితే ఆర్ డీఓ ఆఫీస్ కి వెళ్లమన్నారు. ఆర్ డి ఓ దగ్గరకు వెళ్లి అడగ్గా అతను కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా ఇప్పటి వరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా మనుషులమే అని తమకు ఎందుకింత చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు.

    బాన్సువాడ సూచిక బోర్డు


    నిరాహార దీక్షలో పాల్గొన్న హిజ్రాలు


    శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తున్నారని.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హిజ్రాలు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో దీప్తి, గాయత్రి, సిరి,  తదితరులు పాల్గొన్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు