హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Festival: మొక్కిన వారికి తీర్ధాన్ని ఇస్తూ.. చెవులు ఊపుతూ.. కంటి రెప్పలు కొడుతున్న వినాయకుడు.. ఎక్కడంటే..

Ganesh Festival: మొక్కిన వారికి తీర్ధాన్ని ఇస్తూ.. చెవులు ఊపుతూ.. కంటి రెప్పలు కొడుతున్న వినాయకుడు.. ఎక్కడంటే..

తీర్తాన్ని తీసుకుంటున్న భక్తుడు

తీర్తాన్ని తీసుకుంటున్న భక్తుడు

Ganesh Festival: మంచుతో వివిధ రూపాల్లో త‌యారు చేస్తూ భ‌క్తుల‌ను ఆక‌ర్శిస్తున్న రాజ‌స్థాన్ గ‌ణేష్ మండ‌లి. వినాయ‌క ఉత్స‌వం ఈ యేడు ఘనంగా జ‌రుగుతున్నాయి. భ‌క్తులు శ‌క్తి వంచ‌న లేకుండా గ‌ణ‌నాధుల‌ను ప్ర‌తిష్టించి ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు.. వినాయ‌కులను ఏర్పాటు చేసిన మండ‌పాల్లో భ‌క్తుల‌ను ఆకర్శించే విధంగా డేక‌రేష‌న్స్ చేస్తున్నారు. దశాబ్ధాలుగా గ‌ణేష్ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వారి ప్ర‌త్యేక‌థ‌ను చాటుకుంటున్నారు..

ఇంకా చదవండి ...

  (P. Mahender, News18, Nizamabad)

  మంచుతో వివిధ రూపాల్లో త‌యారు చేస్తూ భ‌క్తుల‌ను ఆక‌ర్శిస్తున్న రాజ‌స్థాన్(Rajasthan) గ‌ణేష్ మండ‌లి. వినాయ‌క ఉత్స‌వం ఈ యేడు ఘనంగా జ‌రుగుతున్నాయి. భ‌క్తులు శ‌క్తి వంచ‌న లేకుండా గ‌ణ‌నాధుల‌ను ప్ర‌తిష్టించి ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు.. వినాయ‌కులను ఏర్పాటు చేసిన మండ‌పాల్లో భ‌క్తుల‌ను ఆకర్శించే విధంగా డేక‌రేష‌న్స్(Decorations) చేస్తున్నారు. దశాబ్ధాలుగా గ‌ణేష్ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వారి ప్ర‌త్యేక‌థ‌ను చాటుకుంటున్నారు.. నిజామాబాద్ జిల్లాలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రజలను ఆకట్టు కుంటున్నాయి. ప్రతిష్టాపన జరిగిన నాటి నుంచి గణనాథుల కు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. న‌గ‌రంలోని నాందేవ్ వాడా రావుజీ వంజరి నవ యువక్ గణేష్ మండలి ఏర్పాటు చేసిన తీర్ధ వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు.

  Ganesh Chaturthi: వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలివే..


  ఏటా ఏదో ప్రత్యేకత తో 72 వసంతాలుగా వేడుకలు నిర్వహిస్తున్న వంజరి గణేష్ మండలి నిర్వాహకులు.. ఈ సారి తీర్ధం ఇచ్చేలా గణ నాథున్ని తీర్చిదిద్దారు. దర్శనం చేసుకుని మొక్కిన క్షణం లో వినాయకుడు తన కరుణా కటాక్షాలతో భక్తులకు స్వయంగా తీర్ధం ఇస్తున్నాడు. పిల్లలు పెద్దలను ఈ తీర్ధం గణపతి చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. న‌గ‌రంలోని రాజ‌స్థాన్ భ‌వ‌న్ లో మార్వాడి న‌వ‌యుగ గ‌ణేష్ మండ‌లి ఆధ్వర్యంలో గ‌త 90 సంవ‌త్సరాలుగా వినాయ‌క ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

  ప్ర‌తి యేడు కొత్త కొత్త ఆలోచనల‌తో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు చేస్తున్నారు. ఈ యేడు మంచు తో వివిధ రూపాల్లో దేవ‌తాముర్తుల‌ను త‌యారు చేస్తూ అంద‌రిని ఆక‌ర్శిస్తున్నారు. తొమ్మ‌ది రోజుల పాటు తొమ్మిది ర‌కాల దేవ‌తా ముర్తుల మంచు విగ్ర‌హాల‌ను త‌యారు చేస్తున్నారు.


  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  రాజ‌స్థాన్ భ‌వ‌న్ గ‌ణేష్ ను ప్ర‌త్రి యేడు చూసేందుకు భ‌క్తులు బారులు తీరుతారు. బార్కేడ్లు ఎర్పాటు చేస్తారు.. స్పేష‌ల్ ద‌ర్శ‌నం కోసం టోకెన్స్ కూడా పెడతారు. ప్ర‌తి యేడు కొత్త ఆవిష్క‌ర‌ణ‌తో గ‌ణేష్ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం వారి ప్ర‌త్యేక‌త‌. మ‌రో మండ‌లి వారు ఎర్పాటు చేసిన భారీ గ‌ణేషుడు త‌న చెవుల‌ను ఉపుతూ.. కంటి రెప్ప‌లు కోడుతున్నారు.. ఈ దృష్యాన్ని చూసేందుకు భ‌క్తులు క్యూ క‌డుతున్నారు.. మ‌నిషి కంటి రెప్ప కొట్టినట్లు ఉండ‌డంతో చూస్తూనే ఉండిపోతున్నారు భక్తులు.

  అంత అందంగా ఆ గ‌ణ‌నాధున్ని త‌యారు చేశారు. మ‌రోవైపు శ్రీ భ‌క్త హిందు యూత్ ఆధ్వర్యంలో రుద్రాక్ష‌ల‌తో గ‌ణేష్ మ‌హారాజ్ ను త‌యారు చేసి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం పూర్తిగా రుద్రాక్ష వినాయ‌కున్ని ఎర్పాటు చేశారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Ganesh Chaturthi 2021, Nizamabad

  ఉత్తమ కథలు