హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kamareddy: అర్ధరాత్రి 12 దాటే వరకు దాబాలోనే ఉన్నారు. భోజనం చేశాక నలుగురు కలిసి వెళుతుండగా..

Kamareddy: అర్ధరాత్రి 12 దాటే వరకు దాబాలోనే ఉన్నారు. భోజనం చేశాక నలుగురు కలిసి వెళుతుండగా..

ప్రమాదంలో గాయపడిన యువకులు

ప్రమాదంలో గాయపడిన యువకులు

నలుగురు యువకులు ఓ దాబాలో అర్ధరాత్రి భోజనం చేసి కారులో ఇంటికి తిరుగుముఖం పట్టారు. దారిలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై కంకర కుప్పలు, ఇసుక కుప్పలు ఉండటంతో రాంగ్ రూట్లో కారులో వస్తుండగా రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని వేగంగా కారుతో ఢీ కొట్టారు.

ఇంకా చదవండి ...

కామారెడ్డి: నలుగురు యువకులు ఓ దాబాలో అర్ధరాత్రి భోజనం చేసి కారులో ఇంటికి తిరుగుముఖం పట్టారు. దారిలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై కంకర కుప్పలు, ఇసుక కుప్పలు ఉండటంతో రాంగ్ రూట్లో కారులో వస్తుండగా రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని వేగంగా కారుతో ఢీ కొట్టారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కారులోనే నలుగురు యువకులు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన సైఫ్(19), శైలానిబాబా కాలానికి చెందిన రిజ్వాన్(20), అశ్వక్(18), విద్యానగర్ కాలనీకి చెందిన సుఫియాన్(20) ఈ నలుగురు కామారెడ్డి టెక్రియల్ బైపాస్‌పై గల దాబాలో భోజనం చేయడానికి TS 09 EX 2241 కారులో బయలుదేరారు. దాదాపు అర్ధరాత్రి 12 దాటే వరకు దాబాలోనే ఉన్నారు. భోజనం అనంతరం నలుగురు అదే కారులో ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు. గత 15 రోజులుగా కామారెడ్డి నుంచి టెక్రియల్ బైపాస్ వరకు ఆరు లైన్ల రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. రోడ్లపైనే కంకర కుప్పలు, ఇసుక కుప్పలు వేసి ఉన్నాయి. దాబా నుంచి బయలుదేరిన యువకులు పాత కలెక్టర్ కార్యాలయం వద్దకు రాగానే రోడ్డుపై కంకర కుప్పలు ఉండటంతో రాంగ్ రూట్లో కామారెడ్డి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న AP28 TD 0909 నంబర్ గల లారీని వేగంగా కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న నలుగురు యువకులు కారులోనే ఇరుక్కుపోయారు. 108 సిబ్బంది వారిని బయటకు లాగారు.

ఇది కూడా చదవండి: Very Sad: రాత్రి భార్య కాళ్లకు చున్నీ కట్టి తన చేతికి కట్టుకుని పడుకున్న భర్త.. తెల్లారేసరికి ఊహించని ఘోరం

ఇందులో అశ్వక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా కంకర కుప్పలు వేయడంతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అశ్వక్ మేనమామ సయ్యద్ మాజిద్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వర్కర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిందని అయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవని ఆయన కోరారు.

First published:

Tags: Car accident, Kamareddy, Road accident, Telangana crime news, Telangana News

ఉత్తమ కథలు