హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: విద్యార్థుల అస్వస్థతకు కారణం అదే.. స్పీకర్ ఇలాఖాలో వారంలో ఇది రెండోసారి.. ఏం జరిగిందంటే..

Nizamabad: విద్యార్థుల అస్వస్థతకు కారణం అదే.. స్పీకర్ ఇలాఖాలో వారంలో ఇది రెండోసారి.. ఏం జరిగిందంటే..

ఆసుపత్రిలో విద్యార్థులు

ఆసుపత్రిలో విద్యార్థులు

Nizamabad: తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిస్ట‌త్మ‌కంగా పాఠ‌శాల విద్యార్థుల‌కు స‌న్న బియంతో మద్యాహ్న భోజ‌నం అందిస్తోంది. గ‌త 18 నెల‌ల త‌రువాత పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మ‌య్యాయి. అయితే మ‌ద్యాహ్న భోజ‌నం విష‌యంలో నిర్వ‌ాహ‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా స్పీక‌ర్ పోచారం నియోజ‌క‌వ‌ర్గంలో వారం రోజుల్లో రెండు చోట్ల మ‌ధ్యాహ్న భోజనం విక‌టించి విద్యార్థులు ఆసుప‌త్రి పాల‌య్యారు.

ఇంకా చదవండి ...

(P.Mahender,News18,Nizamabad)

తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) ఎంతో ప్ర‌తిస్ట‌త్మ‌కంగా పాఠ‌శాల విద్యార్థుల‌కు(Students) స‌న్న బియ్యంతో మద్యాహ్న భోజ‌నం అందిస్తోంది. గ‌త 18 నెల‌ల (18 Months) త‌రువాత పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మ‌య్యాయి. అయితే మ‌ద్యాహ్న భోజ‌నం విష‌యంలో నిర్వ‌ాహ‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా స్పీక‌ర్ పోచారం నియోజ‌క‌వ‌ర్గంలో వారం రోజుల్లో రెండు చోట్ల మ‌ధ్యాహ్న భోజనం విక‌టించి విద్యార్థులు ఆసుప‌త్రి(Hospital) పాల‌య్యారు. దీంతో విద్యార్థుల త‌ల్లి దండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. పిల్ల‌లు చ‌దువుకుంటే వారి జీవితాలు బాగుప‌డుతాయ‌ని పాఠ‌శాల‌కు పంపితే వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం వ‌చ్చింద‌ని వాపోయారు. చ‌దువుల సంగతి దేవుడెరుగు.. ముందు పిల్ల‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలని త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Application Invited: ప్రతినెలా రూ. 25 వేల స్టైఫండ్..​​ దాని కోసం ఇలా చేయండి..


కామారెడ్డి జిల్లాలో వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండు చోట్ల మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించిన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.. తెలంగాణ శాస‌న స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని బాన్సువాడ మండ‌లం ఇబ్ర‌హీంపేట్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో వారం రోజుల క్రితం 30 మంది విద్యార్థుల‌కు ఆస్వ‌స్థ‌త‌కు గురికాగా.. బుధవారం బీర్కూర్ మండ‌ల కేంద్రంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో మధ్యాహ్న భోజనం విక‌టించింది.. 70 మంది విద్యార్థుల‌కు వాంతులు విరోచనాలు క‌డుపు నోప్పితో విల‌విలాడారు.. 70 మంది విద్యార్థుల పరిస్థితి విషమించ‌డంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బీర్కూర్ మండ‌ల కేంద్రంలోని ప్రాథ‌మిక‌ పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు.. బుధవారం 264 మంది స్కూల్ కు వ‌చ్చారు.. రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు.


Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


విద్యార్థుల‌కు అన్నం.. పప్పు తో పాటు గుడ్డు ఇచ్చారు.. విద్యార్థుల‌తో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం చేశామని చెప్పారు.. అయితే అన్నం తిన్న తర్వాత కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పితో అల్లాడిపోయారు.. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.. విద్యార్థుల ప‌రిస్థితిని గ‌మ‌నించిన పాఠ‌శాల ఉపాధ్యాయులు వెంట‌నే విద్యాశాఖ అధికారులకు.. స్థానిక ప్రజాప్రతినిధులకు.. ఆరోగ్య సిబ్బందికి.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.. బాన్సువాడ, కోటగిరి, వర్ని నుంచి ఆంబులెన్స్ లను ర‌ప్పించారు.. వాటి తో పాటు రెండు ప్రైవేటు వాహనాల్లో 70 మంది చిన్నారులను బాన్సువాడ‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. విష‌యం ముందుగానే బాన్సువాడ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడ ప‌డ‌క‌ల‌ను అరెంజ్ చేశారు. దీంతో వెంట‌నే విద్యార్థుల‌కు ప్రాథ‌మిక చికిత్స అందిస్తున్నారు.. విద్యార్థుల ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. మధ్యాహ్న భోజనంలో వండించిన కోడి గుడ్ల వ‌ల్ల‌నే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు గుర్తించారు.

Uses Of Ladyfinger: బెండకాయ వంటలకే కాదు.. ఔషద పరంగా కూడా ఎంతో ఉపయోగకరం.. ఏ వ్యాధులకు ఉపయోగిస్తారంటే..


ఉడికించిన గుడ్లు కుల్లిపోయిన వాసన వచ్చినట్లు అధికారులు చెప్పారు. తహసీల్దార్ రాజు.. ఎంఈఓ నాగేశ్వరరావు వంటశాల‌ను, వంట సామాగ్రిని పరిశీలించారు. అయితే మా పిల్ల‌లు చ‌దుకుంటే వారి జీవితాలు బాగుంటాయాని పాఠ‌శాల‌కు పంపితే వారి ప్రాణాల‌మిద‌కు వ‌చ్చింద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు వాపోయారు. మధ్యాహ్న భోజన నిర్వ‌ాహ‌కులు , పాఠ‌శాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కార‌ణంగానే మా పిల్ల‌ల‌కు ఈ పరిస్థితి వ‌చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నం నిర్వ‌హ‌ణ సాధ్యం కాకపోతే మా పిల్ల‌ల‌కు టిఫిన్ పెట్టించి పంపుతామ‌ని వారు అన్నారు. మా పిల్ల‌ల బంగారు భావిష‌త్తు విద్యతోనే సాధ్యం అన్నారు. మ‌ధ్యాహ్న భోజన నిర్వ‌హణ విష‌యంలో పాఠ‌శాల టీచ‌ర్లు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

Lemon And Chilli: గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు వేలాడదీస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. తెలుసుకోండి..


స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో మద్యాహ్న బోజనం విక‌టించ‌డంతో అధికారుల నిర్ల‌క్ష్యం మాత్రం కొట్టోచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.. విద్యార్థుల‌కు వంట వండే సామాగ్రి విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగేవి కావు. అయితే విద్యార్థుల అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థును పరామర్శించారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినడం వల్ల కడుపులో నొప్పి వాంతులు వ‌చ్చాయ‌ని విద్యార్థులు స్పీక‌ర్ కు తెలిపారు.

ఈ విష‌యంపై స్పీకర్ మండిప‌డ్డారు. గుడ్డు తినడం తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. దీనికి కార‌ణ‌మైన వారిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఎవ‌రూ కంగారు ప‌డ‌కండి.. మీ పిల్ల‌ల ఆరోగ్యం మా బాధ్యత అన్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నం నిర్వ‌హ‌కులపై పాఠ‌శాల టీచ‌ర్లు ఎప్పుడూ క‌నిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రో సారి జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

First published:

Tags: Crime, Kamareddy, Nizamabad