Home /News /telangana /

NAZIMABAD FATHER JAILED FOR 20 YEARS FOR RAPING DAUGHTER IN NIZAMABAD DISTRICT SNR

Nizamabad:కూతురిపై అత్యాచారం చేశాడు..కోర్టు ఎలాంటి శిక్ష విధించిందో తెలుసా..!

NIZAMABAD

NIZAMABAD

Nizamabad: కన్నకూతురిపై అత్యాచారం చేశాడో కిరాతకుడు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో పోక్సో స్పెషల్ కోర్ట్‌ సంచలన తీర్పు ఇచ్చింది. నేరస్తుడికి 20సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 5వేల జరిమానా విధించింది ..ఫైన్ కట్టలేని పరిస్థితి ఉంటే మరో 6నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

ఇంకా చదవండి ...
తప్పు చేస్తే నేరస్తులు శిక్ష నుంచి నుంచి తప్పించుకోలేరని మరోసారి రుజువైంది. ఏడేళ్ల క్రితం జరిగిన ఓ రేప్‌ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. కూతురిపై అత్యాచారం చేసిన కామాంధుడికి ఒకటి,రెండు కాదు..20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్న ఈఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ (Nizamabad)జిల్లాలో చోటుచేసుకుంది. మార్తాండ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం తాగిన మైకంలో కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఈవిషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. తండ్రి వార్నింగ్‌తో బెదిరిపోయిన బాలిక విషయాన్ని గోప్యంగా ఉంచింది. తండ్రి ముసుగులో ఉన్న కామాంధుడి కోరల్లో చిక్కుకున్న బాలిక గర్భవతి అయింది. తాను చేసిన ఘోరం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆలోచనతో తండ్రి ఆ అమ్మాయికి ఆర్మూర్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భ విఛ్చతి(Abortion) చేయించాడు. బాధితురాలి కడుపులో ఉన్న 7నెలల పిండాన్ని ప్రైవేట్ డాక్టర్ (Private doctor) సాయంతో తొలగించి తాను చేసిన పాపాన్ని కడిగేసుకున్నాడు.

ఇక 20ఏళ్లు జైల్లోనే ..
తండ్రి చేతిలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు 2014 ఏడాది జులై (July)నెలలో తల్లికి చెప్పుకొని బోరున విలపించింది. అదే నెల 9న బాధితురాలి తల్లి కామాంధుడి చర్యలపై మార్తాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతుర్ని రేప్ చేసిన వ్యక్తిపై పోక్సో (Pocso act) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూసేందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించారు. ఈఘటన జరిగి ఏడేళ్లు గడిచింది. ఈకేసులో పోలీసుల తరపున వాదనలు వినిపించారు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్‌. సమయం ఎక్కువ తీసుకున్నప్పటికి నేరస్తుడికి కఠిన శిక్షపడేలా తగిన సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారు.

నేరస్తుడికి తగిన శాస్తి..
తండ్రిగా బిడ్డ ఆలనా, పాలన చూడాల్సిన వ్యక్తి ..బాధ్యతారాహిత్యంగా మద్యం తాగడం..అదే మైకంలో బిడ్డపై అత్యాచారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈకేసుపై పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి 20సంవత్సరాల పాటు కఠిన కారాగారశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. అంతే కాదు 5వేల రూపాయల జరిమాన విధించింది. అది చెల్లించలేని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పిచ్చింది. బాధితురాలికి అబార్షన్ చేసిన డాక్టర్‌ పేరును కూడా పోలీసులు ఈకేసులో చేర్చారు. అయితే ఆ డాక్టర్‌ కరోనా సోకి కొద్ది రోజుల క్రితమే చనిపోయింది. నేరస్తుడికి కఠిన శిక్ష విధించిన న్యాయస్థానం బాధితురాలు న్యాయసేవ సంస్థను ఆశ్రయించి 4లక్షల పరిహారాన్ని పొందాలని సూచించింది. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పోక్సో న్యాయస్థానం మరోసారి రుజువు చేసింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Jails, Nizamabad, Rape girl

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు