Home /News /telangana /

NAZIMABAD FATHER AND SON ATTACKED SANITATION WORKERS WHO ASKED WEAR MASK VB NZB

Attacked sanitation workers: మేము మాస్క్ ధరించం.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మున్సిపల్ సిబ్బందిపై పార, గడ్డపారతో దాడి.. ఎక్కడంటే..

మున్సిపాలిటీ సిబ్బందిపై దాడికి యత్నిస్తున్న దృశ్యం

మున్సిపాలిటీ సిబ్బందిపై దాడికి యత్నిస్తున్న దృశ్యం

Attacked sanitation workers: కరోనా జనాలపై కోరలు చాస్తున్నా కొంతమంది మాత్రం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగులుతున్నారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎంత చెప్పినా నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా నిబంధనలు పాటించాలని చెప్పినందుకు దాడులకు దిగిడం, చంపుతామని బెదిరించడం చేస్తున్నారు. ఇలాంటిదే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    కోవిడ్ కేసులు ఎక్కవగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంతమంది ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అంతే కాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పిన వారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్ కార్మికులపై దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతం నగర్ లో చెత్త సేకరించడానికి మున్సిపాలిటీ సిబ్బంది వెళ్లారు.

    ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి వారిపై ఎదురు దాడికి దిగాడు. ‘నేను మస్క్ పెట్టుకోకపోతే.. మీకేంటి.. నీను పెట్టుకోను.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. దీనికి అతడితో పాటు అతని కొడుకు కూడా జతకట్టి వారిని బెదిరించారు. అంతే కాకుండా ఈ ఘటనను చిత్రీకరిస్తున్న వ్యక్తిపై కూడా దాడికి దిగారు. ఎంత ధైర్యం ఉంటే వీడియో తీస్తావురా.. అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.

    సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యం


    ఇలా తండ్రీ కొడుకుల ప్రవర్తనపై మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మాపై బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attacked on muncipolity workers, Corona, Covid, Covid cases, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు