Home /News /telangana /

Telangana: రోడ్లపైనే వరి ధాన్యం.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతన్న.. పట్టించుకోని అధికారులు..

Telangana: రోడ్లపైనే వరి ధాన్యం.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతన్న.. పట్టించుకోని అధికారులు..

కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతు

కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతు

Nizamabad: ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండిచిన పంట చేతికి వ‌చ్చి నెల‌రోజులు అవుతుంది. నెల రోజులుగా రోడ్డుపై కొనుగోలు కేంద్రాల వ‌ద్ద కుప్ప‌లు పోసి రైతులు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. అకాల వ‌ర్షాలు, ఎండలు, భూగ‌ర్బ జ‌లాలు అడుగంటి నానాక‌ష్ట‌లు ప‌డి పండిచిన పంట అమ్ముకుందామంటే కొనుగోళ్లు జ‌రగ‌క తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.

ఇంకా చదవండి ...
    (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం యాసంగి పంట సంవృద్దిగా పండింది. గ‌త యేడు కంటే ఈ యేడు దిగుబ‌డి పెరిగింది. ఎంతో కష్టపడి పండించిన పంట చివరకు చేతికి వచ్చింది. పండించిన పంట‌ను రోడ్ల‌పై కొనుగోలు కేంద్రాల వ‌ద్ద అర‌బెట్టి కుప్ప‌లు పోశారు. అయితే నెల రోజులుగా కుప్ప‌ వ‌ద్ద కాప‌ల ఉండ‌టం త‌ప్ప కొనుగోలు జ‌రగ‌డం లేద‌ని రైతులు వాపోతున్నారు. పండించిన ధాన్యాన్ని త్వ‌ర‌గా అమ్ముకుని పంట కొసం చేసిన అప్పుడు క‌ట్టుకుందామంటే కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇప్ప‌టికి కనీసం 20 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయ‌లేదు. జిల్లా వ్యాప్తంగా ర‌బీ సీజ‌న్ లో ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా లు క‌లిపి మొత్తం 442 కొనుగోలు కేంద్రాల‌ను ఎర్పాటు చేయ‌ల‌ని నిర్ణ‌యించారు. అయితే ఇప్పటి వ‌ర‌కు 417 కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించ‌గా 391 కేంద్రాల్లో కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో నామ మాత్రంగా కొనుగోళ్లు జ‌రుగుత‌న్నాయ‌ని రైతులు చెబుతున్నారు. అధికారులు, నాయ‌కులు వ‌చ్చి వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించి వెళ్లారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కొనుగోళ్లు ఎలా జ‌రుగుతున్న‌య‌నే విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

    నెల రోజులుగా రోడ్డుపై ధాన్యం ఉంది. అకాల వ‌ర్షాలు వ‌స్తే మా ప‌రిస్థితి ఎంట‌ని రైతులు అడుగుతున్నారు. ధాన్యం కొనుకోలు కోసం టోకేన్లు ఇచ్చారు. కానీ రోజులు ఒక లారీ ధాన్యం కూడా కాంటా కావ‌డం లేదు. ఇలాగైతే తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారు. మా క‌ష్టాలు ఎప్పుడు తీరుతాయ‌ని వారు దీనంగా ఎదురు చూస్తున్నారు. గ‌త యేడాది కరోనాతో లాక్ డౌన్ ఉన్నా వ‌రి ధాన్యం కొనుగోళ్లు స‌జావుగా జ‌రిగాయి. గ‌త ఏప్రిల్ లో ధాన్యం కొనుగోళ్లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి.

    రోడ్లపైనే ఆరబోసిన వరి ధాన్యం కుప్పలు


    రోడ్లపైనే ఆరబోసిన వరి ధాన్యం కుప్పలు


    కానీ ఈ యేడు కరోనా పేరుతో రైతులను క‌ష్టాల‌కు గురిచేస్తున్నార‌ని అన్నదాత‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు స్పందించి వ‌రి ధాన్యం కొనుగోళ్లు వేగ‌వంతం చేయాల‌ని రైతులు కోర‌తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Farmers, Grain purchase, Nizamabad

    తదుపరి వార్తలు