హోమ్ /వార్తలు /తెలంగాణ /

Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..

Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..

రోడ్డెక్కిన రైతన్నలు

రోడ్డెక్కిన రైతన్నలు

Farmers: ఓ ప‌క్క ఆకాల వ‌ర్షాలు.. మ‌రో ప‌క్క లారీలు రాక ధాన్యం రాసులు నానిపోతున్నాయ‌ని రైతులు ఆదోళ‌న చెందుతున్నారు. దాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు అలసత్వం తో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని అన్న‌దాత‌లు ధ‌ర్నాకు దిగారు.. దీంతో కామారెడ్డి జిల్లాలోని 44వ జాతీయ రహదారి పై రాస్తారోకో ధ‌ర్నా చేయ‌డంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇంకా చదవండి ...

  (P.Mahender,News18,Nizamabad)

  ఓ ప‌క్క ఆకాల వ‌ర్షాలు.. మ‌రో ప‌క్క లారీలు రాక ధాన్యం రాసులు నానిపోతున్నాయ‌ని రైతులు ఆదోళ‌న చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు అలసత్వం తో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని అన్న‌దాత‌లు ధ‌ర్నాకు దిగారు.. దీంతో కామారెడ్డి జిల్లాలోని 44వ జాతీయ రహదారి పై రాస్తారోకో ధ‌ర్నా చేయ‌డంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా, మండ‌లం అడ్లూరు గ్రామం రైతులు ధాన్యం కొనుగోలు, లారీల అన్లోడింగ్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వ‌హిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైస్ మిల్లు లో లారీలు అన్లోడింగ్ సమస్య తో లారీల రాకపోకలు నిలిచిపోయాయి.. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు రాశులు, ధాన్యం బస్తాలు రాత్రి కురిసిన‌ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి.

  Siddipeta Collector: సిద్దిపేట కలెక్టర్‌గా హనుమంతరావు.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ.. ఖారారు చేసిన కేసీఆర్..


  దీంతో రైతులు 44వ‌ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.. అయితే వాహ‌నాల‌ రాక‌పోక‌లకు తీవ్ర అంతరాయం ఎర్పాడింది.. విష‌యం తెలిసిన పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని రైతులకు న‌చ్చ‌జేప్పి రైతుల ఆందోళ‌న‌ను విర‌మింప జేశారు.. ఆనంతరం ట్రాఫిక్ క్లియ‌ర్ చేశారు.

  Telangana Farmers: ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌.. కానీ ఇప్పుడు ఇలా..


  మ‌రో వైపు సాధశివానగర్ మండ‌ల కేంద్రంలో గత 15 రోజుల నుండి వడ్లు తూకాలు నిలిచిపోయాయి.. దీంతో వడ్ల కుప్పల వద్ద హమాలీలతో క‌లిసి రైతులు భజన చేస్తూ వినూత్న నిర‌స‌న తెలిపారు.. లోడింగ్ సమయానికి లారీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత మూడు రోజుల క్రితం లారీలు వెంట వెంటనే వచ్చేలా చూడాలని సాధశివానగర్ మండల తహసీల్దార్ వెంకటరావు కి రైతులు వినతి పత్రం అందజేశారు.. అయిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాధశివానగర్ గ్రామ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ మహిపాల్, దేవదాసు, రాజు, రవి, భాస్కర్, రైతులు పాల్గొన్నారు.

  MLC Elections: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారితే ఇలా చేస్తారా.. ఈ సారి తాడో పేడో తేలాల్సిందే..


  ఇదిలా ఉండగా.. ఉమ్మ‌డి జిల్లాలో అక్టోబ‌ర్ 24న ధాన్యం సేకరణ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో 443 కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామ గ్రామాన ధాన్యం సేక‌రణ జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 2ల‌క్ష‌ల 74వేల క్వింటాళ్ల ధాన్యం సేక‌రించారు.. కామారెడ్డి జిల్లాలో 313 కొనుగోలు కేంద్రాల ద్వారా ల‌క్షా 87వేల 5వంద‌ల క్వింటాళ్ల ధాన్యం సేక‌రించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రైతు ఖాతాలో కూడా డ‌బ్బులు జ‌మ కాలేదు.

  నిజామాబాద్ జిల్లాలోని చందూరు సహకార సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 340 మంది రైతుల నుంచి 40 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యానికి సంబంధించే రైతులకు 7 కోట్ల 80 లక్షలు రైతుల‌ ఖాతాల్లో జమ కావాలి.. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతుకు ఖాతాలో ఒక రూపాయి కూడా జ‌మ‌కాలేదు. దీంతో రైతులు వడ్ల డబ్బులను జమ చేయాలని కోరుతున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Farmers, Nizamabad

  ఉత్తమ కథలు