హోమ్ /వార్తలు /telangana /

Nizamabad: ఇదేం బాదుడు రా నాయనా.. ఇంటి కిరాయి కంటే ఎక్కువొస్తున్న కరెంటు బిల్లు.. లబోదిబోమంటున్న వినియోగదారులు

Nizamabad: ఇదేం బాదుడు రా నాయనా.. ఇంటి కిరాయి కంటే ఎక్కువొస్తున్న కరెంటు బిల్లు.. లబోదిబోమంటున్న వినియోగదారులు

నిజామాబాద్ జిల్లాలో క‌రెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ తగులుతోంది. డెవలప్ మెంట్ చార్జీల పేరిట అదనపు బాదుడు.. కిరాయి దారుకు ఇంటి య‌జ‌మానికి మ‌ధ్య క‌రెంట్ బిల్లు గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

నిజామాబాద్ జిల్లాలో క‌రెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ తగులుతోంది. డెవలప్ మెంట్ చార్జీల పేరిట అదనపు బాదుడు.. కిరాయి దారుకు ఇంటి య‌జ‌మానికి మ‌ధ్య క‌రెంట్ బిల్లు గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

నిజామాబాద్ జిల్లాలో క‌రెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ తగులుతోంది. డెవలప్ మెంట్ చార్జీల పేరిట అదనపు బాదుడు.. కిరాయి దారుకు ఇంటి య‌జ‌మానికి మ‌ధ్య క‌రెంట్ బిల్లు గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

  (న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి, పి. మ‌హేంద‌ర్)

  కరెంట్ తీగను ముట్టుకుంటే షాక్ త‌గులుతుంది. కానీ నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో క‌రెంట్ బిల్లు (Electricity bills) పట్టుకుంటే షాక్ తగులుతోంది. డెవలప్ మెంట్ చార్జీల పేరిట అదనపు బాదుడు.. కిరాయి దారుకు ఇంటి య‌జ‌మానికి మ‌ధ్య క‌రెంట్ బిల్లు గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. వంద‌ల్లో వ‌చ్చే క‌రెంట్ బిల్ల వేల‌ల్లో రావాడంతో విద్యుత్ వినియోగా దారులు లబోదిబోమంటున్నారు.  మీట‌ర్ల లో ఏలాంటి పోరపాటు లేదు. మీరు వాడిన‌దానికే బిల్లు (Electricity bills) వ‌స్తుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కొ మీటరకు వందల్లో రావాల్సిన బిల్లులు వేలల్లో వస్తుండటం అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బిల్లులు చెల్లించేందుకు నసేమిరా అంటున్నారు. అధిక లోడ్ (Higher Load) వాడుతున్నారంటూ.. వినియోగదారులపై డెవలప్ మెంట్ చార్జీల పేరిట ఒక్కొ గృహ వినియోగదారుని పై మూడు వేల‌ రూపాయలు మొదలుకుని 10 వేల వరకు అదనపు చార్జీలు (extra charges) వసూలు చేస్తున్నారు. డెవలప్ మెంట్ చార్జీలకు తోడు సెక్యూరిటీ డిపాజిట్ అంటూ మరో 200 నుంచి 400 అదనంగా బిల్లులో వసూలు చేస్తుండటంతో హైరానా చెందుతున్నారు.  గతంలో ఎప్పుడు లేనంతగా బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈ క‌రెంట్ బిల్లు కిరాయి దారుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది.

  నిజామాబాద్ (Nizamabad) న‌గ‌రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాల‌నీలో నివాసం ఉండే న‌రేంద‌ర్ అనే కిరాయి దారు మూడు రూంల‌ను 3 వేల రూపాయ‌ల‌కు అద్దెకు తీసుకున్నారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఉంటున్నారు. అయితే ప్ర‌తి నెల 3 నుంచి 4 వంద‌ల లోపు క‌రెంటు బిల్లు వ‌చ్చేది. అయితే ఈ నెల క‌రెంట్ బిల్లు 3,440 రూపాయలు వ‌చ్చింది. ఇంటి కిరాయి కంటే ఎక్కువ బిల్లు (Electricity bills) వ‌చ్చింద‌ని సదరు కిరాయిదారు  వాపోయారు.  డెవలప్ మెంట్ చార్జీల పేరుతో విద్యుత్ శాఖ బాదుడుకు ఇంటి యజమానులు, అద్దెకు ఉన్న వారి మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. డెవలప్‌మెంట్‌ చార్జీలకు తమకు సంబంధం ఉండదని కిరాయిదారులు వాదిస్తుంటే అద్దెకు ఉన్న వారే చెల్లించాలని యజమానులు చెబుతుండటం గొడవలకు కారణం అవుతోంది.

  కిరాయి డబ్బులు కరెంటు బిల్లులకు..

  ఏసీ,  ఫ్రిడ్జ్‌, టీవీ, హీటర్‌, సీలింగ్‌ ఫ్యాన్‌లు వాడుతున్నారని చెప్పి అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారని గృహ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. అయితే చివ‌ర‌కు ఇంటి ఓనరే ఆ క‌రెంట్ బిల్లు (Electricity bills)ను క‌ట్టాల్సి వ‌స్తుంది.  వ‌చ్చిన కిరాయి క‌రెంటు బిల్లుకే స‌రిపోతుంద‌ని ఇంటి ఓనర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఏళ్లుగా వందల్లో వచ్చే బిల్లు ఒక్కసారిగా వేలల్లో వస్తుండటం పట్ల బిల్లులు పట్టుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డెవలప్ మెంట్ చార్జీల పేరుతో అధిక బిల్లుల వసూలు నిలిపివేయాలని కోరుతున్నారు.


  ఎందుకు అలా వస్తుందంటే..?

  అయితే  మీటర్లలో రికార్డు అయ్యిందంటే అధికంగా వాడుతున్నట్లేనని విద్యుత్ శాఖ ఎస్ఈ ర‌వీంద‌ర్ చెబుతున్నారు. మీట‌ర్ లోడు కంటే ఎక్కువ విద్యుత్ ను వినియోగించిన‌ప్పుడు. ఆ లోడ్ మీట‌ర్లో రికార్డు అవుతుంది.. దీంతో మీరు ఎక్కువ విద్యుత్తు వాడుతున్నారు. ఆప్పుడు మీ మీట‌ర్ పై 1 కేవీ లోడ్ ఉంటే దాన్ని పెంచి 2 కేవీ, 3 కేవీ గా మార్చ‌డం జ‌రుగుతుంది. దీంతో ఆ డిపాజిట్ ఆమౌంట్ , డెవ‌ల‌ప్మెం​ట్ చార్జీలు (Development charges) వ‌స్తాయని ఆయ‌న వివ‌రించారు..  వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు..  డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించాల్సిందేనని అయ‌న అన్నారు..

  First published:

  Tags: Nizamabad, Power problems

  ఉత్తమ కథలు