Home /News /telangana /

NAZIMABAD ELDER BROTHER KILLED YOUNG BROTHER FOR NOT GIVING MONEY IN KAMAREDDY VRY NZB

Kamareddy : డబ్బులు ఇవ్వని తమ్ముడు, అన్న చేసిన పని దారుణం, మెడకు వైర్‌ చుట్టి

తమ్మున్ని చంపిన అన్న

తమ్మున్ని చంపిన అన్న

Kamareddy : మద్యం కోసం డబ్బులు ఇవ్వని తమ్మున్ని విచక్షణ రహితంగా కొట్టి వైర్‌ను మెడకు చుట్టడడంతో ఊపిరాడక తమ్ముడు అక్కడికక్కడే చనిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  

    కామారెడ్డి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా న‌ర్సుల్లాబాద్ మండలానికి చెందిన అల్లం ప్ర‌భాక‌ర్, అల్లం శివ కుమార్ అనే ఇద్దరు  అన్న‌ద‌మ్ములు.. అల్లం ప్ర‌భాక‌ర్ రోజు మ‌ద్యం సేవించి భార్యతో త‌ర‌చు గొడవ ప‌డేవాడు.. దీంతో ఆయన గొడవలు భరించలేక ప్ర‌భాక‌ర్ బార్య‌ పెట్టింటికి వెళ్లి పోయింది.. ఇక ప్ర‌భాక‌ర్ తండ్రి కూడా వీరిద్దరి గోడ‌వ‌లు భరించ‌లేక త‌ను తాను కూడా ఇంటి నుండి మరో ఊరికి వెళ్లి పోయి బ్ర‌తుకుతున్నారు.. దీంతో ప్ర‌భాక‌ర్, త‌మ్ముడు శివ కుమార్ క‌లిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు..

    ప్ర‌భాక‌ర్ కూలీ ప‌ని చేస్తుండగా.. శివ కుమార్ (27) లారీ క్లిన‌ర్ గా ప‌నిచేస్తున్నాడు.. అయితే ఇద్ద‌రు కూడా ఒంటరిగా ఉండడతో నిత్యం మ‌ద్య సేవించే వారు.. ఈ క్రమంలోనే తమ్ముడు అల్లం శివ కుమార్ కు నెల జీతం రాగానే  అన్న  ప్రభాకర్ డబ్బులు కావాలని అడిగాడు. అయితే శివ‌కుమార్  డబ్బులు ఇవ్వక పోవడం తో మ‌ద్యం మ‌త్తులో ఉన్న ప్ర‌భాక‌ర్ కోపోద్రిక్తుడు అయ్యాడు.. దీంతో శివ కుమార్‌ను విచక్షణ రహితంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా క‌ర్ర‌తో కొట్టి.. ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వైర్‌తో మెడ‌కు ఉరివేసాడు.. దీంతో శివ కుమారు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు..

    Mahabubabad : వీడు తండ్రేనా... మామతో పంచాయితీ పెట్టుకుని కోడుకు, కూతురును చంపాడు..


    కాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జోక్యం చేసుకున్న పక్కింటి వాళ్లను కూడా ప్రభాకర్ తీవ్రంగా తిట్టాడని. శివ‌ను రాళ్ల‌తో, కర్ర‌ల‌తో దారుణంగా బాదాడ‌ని మా క‌ళ్ల ముందే ప్రాణం తీశాడని స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రభాకర్‌ను అదుపులోకి
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Kamareddy, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు