(పి. మహేందర్, నిజామాబాద్ , న్యూస్ 18 తెలుగు)
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అంటే అందరూ వణికిపోతున్నారు. పలానా వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఇంకేముంది అటు వైపు కూడా వెళ్లరు. ఇలాంటి సమయంలో ఓ కరోనా పాజిటివ్ గర్బిణికి ప్రసవం చేసి 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాందీ ఆసుపత్రికి కరోనా పాజిటివ్ గర్బిణీని తరలిస్తుండగా మార్గమద్యలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆంబులెన్స్ ను ప్రక్కన నిలిపి పీపీఈ కట్లను ధరించి సిబ్బంది ఆమెకు డెలీవరీ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని ప్రతి ఒక్కరూ రియల్ హీరోలని కొనియాడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి పట్టణానికి చెందిన పనాటి పుష్ప (20).. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పుష్పకు మొదట కారోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కారోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే వైద్యులు తదుపరి వైద్య సేవల కోసం గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ కు తీసుకు వెళ్లాలని చెప్పారు.
హైదరాబాద్ వెళ్తుండగా కామారెడ్డి సమీపంలో పుష్పకు పురిటి నొప్పులు అధికం అయ్యాయి. మార్గమధ్యలో ఉన్నకామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. అక్కడ వైద్యులు చూసి పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కి తీసుకొని వెళ్లాలని సూచించారు. అయితే రాత్రి సుమారు 3 గంటల సమయంలో108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సకాలంలో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కామారెడ్డి నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో రామాయంపేట వద్ద అంబులెన్స్ ను ప్రక్కకు నిలిపివేసి, మొదటి ప్రసవం కావడంతో బిడ్డ మెడ చుట్టూ బొడ్డు తాడు చుట్టుకొని ఉంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సుఖ ప్రసవం చేశారు. పుష్ప పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తదుపరి వైద్య సేవల నిమిత్తం గాంధీ ఆసుపత్రి ఆమెను గాంధీ అసుపత్రిలో చేర్పించారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ కృష్ణ స్వామి, పైలట్ సుదర్శన్ గౌడ్ లను మహిళ భర్త ఇస్తారి, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కరోనాకు బయపడకుండా కరోనా పాజిటివ్ గర్బిణికి ప్రసవం చేసి శాబాష్ అనిపించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 108 ambulence, Corona cases, Corona positive, Deliver in 108, Hyderabad, Kamareddy, Nizamabad, Pregnent women