• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NAZIMABAD CHAIN LINK SCAM YOUNG MAN COMMIT TO SUICIDE IN KAMAREDDY DISTRICT VB NZB

Man commit to suicide: గొలుసు కట్టు మోసానికి మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగు మందు తాగాడు.. ఆ తర్వాత..

Man commit to suicide: గొలుసు కట్టు మోసానికి మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగు మందు తాగాడు.. ఆ తర్వాత..

ఆత్మహత్యకు పాల్పడ్డ అంజాద్

ఓ యువకుడు గొలుసుకట్టు సంస్థలో డబ్బులు చెల్లించి సమయానికి రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో చిత్రించి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. సెల్ఫీ వీడియోలో పురుగుల మందు డబ్బాను చూపిస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    కామారెడ్డి జిల్లాలో ఇప్ప‌టికే గొల‌సుసు క‌ట్టు మోసానికి ఓ కుటుంబం బ‌లైంది.. తాజాగా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన అంజాద్ అనే యువకుడు.. గొలుసుకట్టు సంస్థలో లక్ష 20 వేలు రూపాయ‌లు పెట్టాడు. ఈ సంస్థ‌లో డ‌బ్బులు క‌డితే మీకు కొద్దిరోజుల్లోనే డాలర్ల రూపంలో రెట్టింపు డబ్బు వస్తుందని ఏజెంట్ ర‌మేష్ రెడ్డి ఆశ చూపాడు. దీంతో డబ్బులను ఏజేంట్ రమేష్ రెడ్డి కి ఇచ్చాడు. అయితే డబ్బులు క‌ట్టి సంవ‌త్స‌రం అయినా డ‌బ్బు తిరిగి రాలేదు. దీంతో అంజాద్ త‌ను క‌ట్టిన డ‌బ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లాడు.. అయితే ర‌మేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజాద్ ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేశారు. దాంతో మనస్తాపం చెందిన అంజాద్ పురుగుల మందు తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన బాధను తెలుపుతూ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో ఆ దృష్యాల‌ను షేర్ చేశాడు.

    దీంతో ఈ విడియో వైర‌ల్ గా మారింది. అంజాద్ కోసం గ్రామస్థులు వెతకగా గ్రామంలోని కాకుల గుట్ట తండా శివారులోని గొట్టం చెరువు ప్రాంతంలో అపస్మారక స్థితిలో క‌నిపించాడు.. వెంటనే అంజాద్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అంజాద్ చికిత్స పొందుతున్నాడు. అంజాద్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అయిన గొలుసుకట్టు ఏజెంట్ రమేష్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రమేష్ రెడ్డి కి డబ్బులు కట్టి మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ కు 10 మంది మహిళలు తరలివచ్చారు. ఏజెంట్ రమేష్ రెడ్డి కి కట్టిన డబ్బులు ఇప్పించాలని భాదితులు కోరుతున్నారు.
    మూడు నెల‌ల‌కు ఒక సారి బ్యాంక్ ఖాతాలో డ‌బ్బులు వ‌స్తాయ‌ని క‌ర్ర దేవ‌రెడ్డి( ర‌మేష్ రెడ్డి) మాకు చెప్పాడ‌ని బాధితురాలు బోడుగుల లక్ష్మి అన్నారు.

    నెల నెలా రూ. 2,600 చెల్లిస్తే మీకు 15ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు కట్టే ముందు తాము కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నామని.. అన్ని డబ్బులు కట్టలేమని చెప్పినా రూ.15 ల‌క్ష‌లు వస్తాయని ఆశ చూపి మా వద్ద డబ్బలు వసూలు చేశాడని ఆమె తెలిపింది. సంవత్సరం అయినా ఇంకా తిరిగి రాకపోవడంతో నిలదీశామాని.. కరోనా కారణంగా రావడం ఆలస్యం అవతుంది.. త్వరలోనే వస్తాయని మాటలు చెబుతూ బెదిరిస్తున్నాడని బాధితరులు చెప్పింది. ర‌మేష్ రెడ్డి పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోని తమ డ‌బ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు