Home /News /telangana /

police justice:పోలీసుల్లో మళ్లీ పెరుగుతున్న లంచావతారులు.. అవి లేనిదే..న్యాయం లేదంటున్న సీఐ

police justice:పోలీసుల్లో మళ్లీ పెరుగుతున్న లంచావతారులు.. అవి లేనిదే..న్యాయం లేదంటున్న సీఐ

నిజామాబాద్ లో పెరుగుతున్న పోలీసు లంచావతారులు

నిజామాబాద్ లో పెరుగుతున్న పోలీసు లంచావతారులు

Nizamabad,తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ పోలిసింగ్ పేరుతో లంచాలను పూర్తిగా రూపు మాపే ప్రయత్నం చేస్తున్నారు. కాని చాలమంది పోలీస్ స్టేషన్‌ అధికారుల్లో మార్పులు వస్తున్నా..గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంతమంది తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. దీంతో భాదితులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
నిజామాబాద్ జిల్లా
న్యూస్18ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్,

తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ పోలిసింగ్ పేరుతో లంచాలను పూర్తిగా రూపు మాపే ప్రయత్నం చేస్తున్నారు. కాని చాలమంది పోలీస్ స్టేషన్‌ అధికారుల్లో మార్పులు వస్తున్నా..గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంతమంది తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. దీంతో భాదితులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పిటిషన్‌దారులకు డబ్బు రూపంలో పోలీసులు వేదిస్తున్న వార్తలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి..గత కొద్ది రోజులుగా స్మార్ట్ పోలిసింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు గత రెండు రోజులుగా భాదితులు మిడీయాకు ఎక్కడంతో మరోసారి పోలీసుల చేతివాటం బయటకు వస్తోంది..దీంతో న్యాయం చేయాల‌ని మహిళా పోలీస్ స్టేషన్ కు వ‌చ్చిన వారికి డబ్బు రూపంలో వేదింపులకు గురిచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే గ‌త రెండు రోజుల క్రితం ఎస్ఐ లంచం అడిగాడ‌ని ఓ యువ‌తి మీడియ ముందుకు రాగా.. తాజాగా సీఐ 80వేల రూపాయ‌లు లంచం తీసుకుని న్యాయం చేస్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు చేయాలేద‌ని మ‌రో యువ‌తి మీడియాను ఆశ్ర‌యించడం.నిజామాబాద్ ‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సంఘటనలు ఎక్కువగా మహిళ పోలీసు స్టేషన్‌లో జరుగుతుండడం మరింత ఆశ్చార్యానికి గురి చేస్తోంది.

పెళ్లి ఫోటోతో భాదితురాలు


మ‌హిళ పోలీస్ స్టేష‌న్ కు భార్య‌, భ‌ర్తల‌ కేసులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.. పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లిలు చేసి క‌ట్న‌కానుక‌లు ఇచ్చి అత్తారింటికి పంపుతారు.. అయితే అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపుల కేసులు మ‌హిళ పోలీస్ స్టేష‌న్ కు వ‌స్తాయి.. అయితే ఆ దంప‌తుల‌కు కౌన్సిలింగ్ నిర్వ‌హించి వారికి న్యాయం చేయ‌డం పోలీసుల బాద్య‌త‌.. అయితే న్యాయం కోసం వ‌స్తే, తల్లిదండ్రులకు మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు నరకం చూపిస్తున్నారు.. న్యాయం చేయాలని వేడుకుంటే డబ్బులు ఇవ్వందే న్యాయం జ‌రుడ‌గం లేదు.. పోలీసులకు ఎంతోకొంత ముట్ట చెప్పేవరకు వరకట్నం కోసం వేధిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం లేద‌ని బాదితులు ఆవేద‌న చెందుతున్నారు..

తల్లిదండ్రులతో పోలీసు స్టేషన్ కు వెళుతున్న భాదితురాలు


నిజామాబాద్ జిల్లా విన‌యాక్ న‌గ‌ర్ కు చెందిన అర్చ‌న తో ఘ‌ట్ కేస‌ర్ హైద‌రాబాద్ కు చెందిన గ‌ట్టు శాంత‌న్ ప్ర‌ణ‌య్ తో 2020 ఆగ‌ష్టు 09న వివాహం జ‌రిగింది..అయితే కొద్ది రోజుల్లో ఇద్దరు భార్యభర్తల మధ్య గొడవతో అమ్మాయిని తన తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో యువతి తల్లిదండ్రులు స్థానిక మహిళ పోలీస్ స్టేషన్‌ను నాలుగు నెలల క్రితం ఆశ్రయించారు. కేసు విష‌యంలో ఎస్ఐ నారాయణను ఇటీవల సంప్రదించగా లక్ష రూపాయ‌లు డిమాండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. లక్ష రూపాయ‌లు అకౌంట్‌లో వేస్తే నీకు న్యాయం చేస్తా అని ఎస్ఐ చెప్పినట్లు ఉన్న ఆడియో టేప్‌ను ఆమె బయటపెట్టింది. దీంతో సదరు మహిళ నిన్న సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.. అయితే  ఎస్ఐని మ‌హిళ పోలీస్ స్టేష‌న్ నుంచి విఆర్ కు పంపి చ‌ర్య‌లు తీసుకున్నారు..

డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ


తాజాగా ఈ రోజు మరో కేసు ఇదే ఎస్ఐ నారాయణ, సీఐ మస్తాన్ వాలీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. పేర్కిట్ కు చెందిన శ్రీప్రియ జగిత్యాల కు చెందిన సత్య నారాయణ కి 2018 లో వివాహం జరిగింది. పెళ్ళైన 3వ రోజు నుంచే వ‌ర‌కట్నం కోసం స‌త్య‌నారాయ‌ణ‌ వేధింపులకు గురిచేసాడు.. దీంతో చేసేదేమీ లేక మహిళా పోలీస్ స్టేషన్ లో బాదితులు ఫిర్యాదు చేశారు..అయితే ఇక్కడే పోలీసుల చేతివాటం చూపించారు. వరుడి తరుఫువారికి వారెంట్ CI ఇచ్చినట్టు నటించి మస్తాన్ వాలీ బాధితులను నమ్మించారు. అనంతరం లక్ష రూపాయాలు వారివద్ద డిమండ్ చేసినట్టు భాదితులు చెబుతున్నారు.దీంతో ముందుగా 50 వేల రూపాయలు ఇచ్చామని అనంతరం ముప్పై వేల రూపాయలు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయినా తమకు న్యాయం జరగలేదని భాదితులు మీడియా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు తీసుకుని న్యాయం అడిగినందుకు సీఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Crime news, Nizamabad, Telangana Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు