హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vijaya shanti: ఒక్కసారిగా తెరపైకి వచ్చిన విజయశాంతి.. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఫైర్​.. ఏమన్నారంటే..

Vijaya shanti: ఒక్కసారిగా తెరపైకి వచ్చిన విజయశాంతి.. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఫైర్​.. ఏమన్నారంటే..

విజయశాంతి (ఫైల్​)

విజయశాంతి (ఫైల్​)

టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీని చూసి టీఆర్​ఎస్​ ఓర్వలేకపోతుందని ఆమె మండిపడ్డారు.

టీఆర్​ఎస్​ ప్రభుత్వం (TRS Government)పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (BJP leader, former MP Vijaya shanti) ధ్వజమెత్తారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీని చూసి టీఆర్​ఎస్​ ఓర్వలేకపోతుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ నాయకులపై , కార్యకర్తలపై దాడులు చేయడాన్ని మాజీ ఎంపీ ఖండించారు. చాలా రోజుల తర్వాత యాక్టీవ్​ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె నిజామాబాద్లో ఎంపీ అర్వింద్​పై జరిగిన దాడిపై మాట్లాడారు. ఈ మేరకు ఆమె (Vijaya shanti) ట్విటర్​లో టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఫైర్​ అయ్యారు. ''తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండటం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్... రాజకీయంగా ఎదురించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law and order) ఉందా? అనే సందేహం కలుగుతోంది”అని ట్విటర్​లో Vijaya shanti తెలిపారు.

ఒక పార్లమెంట్ సభ్యుడి (Member of Parliament)కి రక్షణ కల్పించలేని పోలీసులు (Police) రాష్ట్రంలో ఉంటే ఎంత... లేకుంటే ఎంత? రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) ఒక్కటే హెచ్చరిక. దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే... వెన్నుచూపే ప్రసక్తే లేదు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంది. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం'' అని Vijaya shanti ట్వీట్ చేశారు.

ఏం జరిగింది?

పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంగళవారం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు (Turmeric board)ఎక్కడ అని అందరూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. ఎంపీ కాన్వాయ్​ కారు అద్దాలు ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీంతో నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

First published:

Tags: Nizamabad, Vijayashanthi

ఉత్తమ కథలు