హోమ్ /వార్తలు /telangana /

Nizamabad: బీజేపీ చీఫ్​ బండి సంజయ్​కి షాక్​.. ఆయన పర్యటించిన 24 గంటల్లోనే పార్టీ మారిన బీజేపీ నేతలు

Nizamabad: బీజేపీ చీఫ్​ బండి సంజయ్​కి షాక్​.. ఆయన పర్యటించిన 24 గంటల్లోనే పార్టీ మారిన బీజేపీ నేతలు

ఇటీవలె నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎంపీని పరామర్శించారు. అయితే ఆయన పర్యటించిన 24 గంటల్లోనే అక్కడి బీజేపీ నేతలు ఆయనకు షాక్​ ఇచ్చారు.

ఇటీవలె నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎంపీని పరామర్శించారు. అయితే ఆయన పర్యటించిన 24 గంటల్లోనే అక్కడి బీజేపీ నేతలు ఆయనకు షాక్​ ఇచ్చారు.

ఇటీవలె నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎంపీని పరామర్శించారు. అయితే ఆయన పర్యటించిన 24 గంటల్లోనే అక్కడి బీజేపీ నేతలు ఆయనకు షాక్​ ఇచ్చారు.

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay), ఎంపీ‌ అరవింద్ లకు భారీ షాక్ తగిలింది. వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీ (BJP MPTC)తో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీ (TRS party)లో చేరింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) గారి సమక్షంలో, నందిపేట ఎంపీటీసి-2 అరుణ చావన్ గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఎంపీ బండి సంజయ్ ను, ఆ పార్టీ కార్యకర్తలే నమ్మకం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.

  ఇటీవల ఆర్మూర్ లో పర్యటించిన నిజామాబాద్​ ఎంపీ అరవింద్ (Nizamabad MP Arvind) ను స్థానిక పసుపు రైతులు (farmers) అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ ఎంపీ అరవింద్ ను నిలదీశారు. కొందరు రైతులు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో కొందరు అరవింద్ ‌మనుషులు రైతులపై దాడికి (Farmers Attack) ప్రయత్నించారు. కాగా, దాడి అనంతరం ఎంపీ అరవింద్​ను బీజేపీ చీఫ్​ బండి సంజయ్​  పరామర్శించిన సంగతి తెలిసిందే.

  ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

  ఖలిస్తాన్ తీవ్రవాదులతో..

  అయితే అరవింద్ ను అడ్డుకున్న పసుపు రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చారు ఎంపీ బండి సంజయ్, అనంతరం ఆర్మూర్ (Armor) లోని నందిపేటలో పర్యటించారు. అయితే రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది (Political mileage) కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా ఎంపీటీసి (MPTC),ఇతర బీజేపీ నాయకులు (BJP leaders) పార్టీకి రాజీనామా చేశారు. తమను ఎంపీ అరవింద్ తీవ్రంగా మోసం చేశారని రైతులు అవేదన వ్యక్తం చేశారు.


  ఇది కూడా చదవండి: ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

  వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా రాదని..

  ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత , నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి సమక్షంలో నందిపేట ఎంపీటీసి అరుణతో సహ పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ చేరారు. పసుపు బోర్డు పేరుతో గెలిచి, రైతులను తీవ్రంగా మోసం చేసిన ఎంపీ అరవింద్ (MP Aravnd), బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా రాదని రైతులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ జెడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసీ మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్,  సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును స్థానిక నాయకులు తప్పుపట్టారు.

  First published:

  Tags: Bandi sanjay, Kalvakuntla Kavitha, Nizamabad, Telangana bjp, Trs

  ఉత్తమ కథలు