Nizamabad: ఈ మధ్యే ఇతనికి పాప పుట్టింది.. కానీ ఆ దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడో.. హృదయవిదారక ఘటన

రాంచందర్ (ఫైల్ ఫొటో)

మ‌నిషి జీవితంలో అన్నింటి కంటే ముఖ్య‌మైన క్ష‌ణాలు కొన్ని ఉంటాయి. పెళ్లయిన ప్రతి మహిళ ‘అమ్మ’ అనే పిలుపు కోసం పరితపిస్తుంటుంది. మాతృత్వాన్ని వరంగా భావిస్తారు. ప్రసవవేదనను సైతం భరించి వివాహిత ఓ బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డే తన ప్రపంచంగా భావిస్తుంది.

 • Share this:
  నిజామాబాద్: మ‌నిషి జీవితంలో అన్నింటి కంటే ముఖ్య‌మైన క్ష‌ణాలు కొన్ని ఉంటాయి. పెళ్లయిన ప్రతి మహిళ ‘అమ్మ’ అనే పిలుపు కోసం పరితపిస్తుంటుంది. మాతృత్వాన్ని వరంగా భావిస్తారు. ప్రసవవేదనను సైతం భరించి వివాహిత ఓ బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డే తన ప్రపంచంగా భావిస్తుంది. కన్న బిడ్డ ముద్దుముద్దు మాటలకు మురిసిపోతుంది. బిడ్డకు ఏ చిన్న ఆపద వచ్చినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. మాతృత్వంలో అంత మాధుర్యం ఉంటుంది. అమ్మ ప్రేమలో అంత కమ్మదనం ఉంది. అందుకే.. తల్లి, తండ్రి గురువు, దైవం అని తల్లికి తొలి ప్రాధాన్యం ఇస్తారు.

  తల్లి మాత్రమే కాదు కన్న బిడ్డతో ‘నాన్న’ అని పిలిపించుకోవడం కూడా పెళ్లయిన పురుషుడు వరంగా భావిస్తాడు. తండ్రి అవ్వడం అనేది జీవితంలో ఒక మధురమైన క్షణం. ఇలాంటి మ‌ధుర క్ష‌ణాలు అనుభ‌విస్తున్న ఓ జంటకు ఆ పైవాడు తీరని అన్యాయం చేశాడు. మొద‌టి సారి తండ్రి అయినా ఆనందం పూర్తిగా ఆస్వాదించక ముందే ఆ తండ్రి మృత్యుఒడికి చేరాడు.. బిడ్డ‌తో ‘నాన్న’ అని పిలిపించుకోవాల‌న్న కోరిక తీర‌కుండానే కుక్క రూపంలో మృత్యువు ఆ కన్నతండ్రిని కబళించింది. ఈ విషాద‌ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

  నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రాంచందర్‌(25)కు ఇటీవల కూతురు పుట్టింది. మొద‌టి సారిగా తండ్రి అయిన రాంచందర్ ఈ విషయాన్ని త‌న స్నేహితుల‌తో, సన్నిహితులతో చెప్పి త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. కూతురు 21 రోజుల తొట్లె వేడుకను సోమవారం బంధువుల‌ను, స్నేహితుల‌ను అంద‌రిని పిలిని ఘ‌నంగా నిర్వహించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు, కొడుకుగా, భ‌ర్త‌గా ఉన్నరాంచంద‌ర్ తండ్రిగా మారాడు. కూతురితో ‘నాన్న’ అని పిలిపించుకోవాల‌ని ఆశ‌ప‌డ్డాడు. అయితే తొట్లెకు వ‌చ్చిన‌ బంధువు ఉదయమే వెళ్తానని చెప్పడంతో బస్సు ఎక్కించడానికి రాంచందర్‌ ద్విచక్ర వాహనంపై ఎడపల్లి మండలం జానకంపేటకు తీసుకువస్తున్నాడు. మార్గ మ‌ధ్యలో ఎదురుగా కుక్క అడ్డం వచ్చింది. దీంతో ద్విచ‌క్ర వాహ‌నం అదుపు తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. రాంచందర్‌కు త‌ల‌కు తీవ్ర గాయామై ర‌క్తస్ర‌ావం అయింది.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఎందుకిలా చేస్తార్రా బాబూ.. అయినా ఇదేం పని.. ఆ నడుచుకుంటూ వెళ్లిపోతున్న అమ్మాయి ఎవరో తెలిస్తే...

  దీంతో రాంచంద‌ర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్‌పై వెనుక కూర్చున్న బంధువు స్వల్ప గాయాలతో బ‌య‌టప‌డ్డాడు. అటుగా వ‌స్తున్న‌ స్థానికులు చూసి ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాంచందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు పుట్టిందన్న ఆనంద క్ష‌ణాల‌ను పూర్తిగా అనుభ‌వించ‌కుండానే ఆ తండ్రి మృత్యు ఒడిచేర‌డంతో కుటుంబ స‌భ్యుల రోద‌నలు మిన్నంటాయి. రాంచందర్ అకాల మరణంతో దూపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాంచందర్ తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

      న్యూస్18 తెలుగు ప్ర‌తినిధి: పి మ‌హేంద‌ర్, నిజామాబాద్

  Published by:Sambasiva Reddy
  First published: