(P.Mahender,News18,Nizamabad)
ఆమ్మాయికి 18 సంవత్సరాలు.. అబ్బాయికి 21 సంవత్సరాల వయస్సు నిండే వరకు పెళ్లి చేయాకుడాదని ప్రభుత్వ అదేశాలు ఉన్నాయి.. అయితే సరిగా 15 యేళ్లు కూడా నిండని అమ్మాయి అబ్బాయికి(Boy) కుటుంబ పెద్దలు పెళ్లి చేయాలను కున్నారు.. మెచ్చూరిటీ లేకుండా చిన్న పిల్లలకు పెళ్లి(Marriage) చేస్తున్నారనే విషయం తెలిసిన ఐసీడీఎస్(ICDS) అధికారులు, పోలీసులు కలిసి ఆ బాల్యవివాహన్ని అడ్డుకున్నారు.. ఆ అమ్మాయికి, కుటుంబ పెద్దలను కౌన్సిలింగ్(Counceling) ఇచ్చారు అధికారులు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటు చేసుకుంది.. ఐసీడీఎస్, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan) పట్టణంలోని బీటీ నగర్ లో నివాసం ఉంటున్న 8వ తరగతి చదువుతున్న 13 యేళ్ల బాలికకు.. మైనర్ అబ్బాయితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సిద్ధమయ్యారు. అమ్మాయిని పెళ్లి కూతురుగా రెడి చేశారు. అయితే బాల్య వివాహం చేస్తున్నారన్న విషయం తెలిసిన ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.. పెళ్లి వయస్సు రాకుండా పెళ్లి చేయండంతో వారి జీవితాలు నాశనం అవుతాయని చెప్పి అధికారులు ఆ వివాహాన్ని నిలిపివేశారు. బాలిక తో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ప్రాధాన్యత వివరించారు. బాల్యవివాహం చేస్తే ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. బాలికను సఖి సెంటర్ కి తరలించారు.
పెళ్లి వయస్సుకు రాకుండా బాల్య వివాహం చేస్తున్నారన్న విషయం తెలిసి ఐసీడీఎస్ అధికారులు.. తహసీల్దార్ తో కలిసి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నామని బోదన్ పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ అన్నారు.. అమ్మాయికి చదువు ప్రాధాన్యతను వివరించారు.. వారి కుటుంబ సభ్యులకు ఐసీడీఎస్ అధికారులు ఆవగాహన కల్పించారని అయన చెప్పారు.. ఎవరూ చట్ట విరుద్దంగా వివాహలు చెయకూడదన్నారు. 13 యేళ్ల మైనర్ బాలికకు పెళ్లి చేస్తున్నారనే విషయం తెలిసింది.. దీంతో వెటనే అక్కడికి వెళ్లి ఆ వివాహన్ని నిలిపివేసామని ఐసీడీఎస్ సీడీపీఓ అన్నారు.
చిన్న వయస్సులో పెళ్లి చేస్తే వారి జీవితాలు బాగుండవని వారికి వివరించాము. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో వారికి చెప్పాము. ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయాకుడదని వారికి చెప్పాము.. అమ్మాయిని సఖీ సెంటర్ తీసుకు వెళ్లి విద్యా ప్రాధాన్యత వివరిస్తామన్నారు.. ఎవరైన బాల్య వివహలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Nizamabad