Home /News /telangana /

NAZIMABAD AS IF THERE ARE JOBS AS IF THERE ARE NOT CONFUSED NIZAMABAD TELANGANA UNIVERSITY OUTSOURCING STAFF NZB VB

Out Sourcing Jobs: ఉద్యోగాలు ఉన్నట్లా.. లేనట్లా..? అయోమయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది.. ఈ నెల 30న ఏం జరగనుంది..?

తెలంగాణ యూనివర్సిటీ

తెలంగాణ యూనివర్సిటీ

Out Sourcing Jobs: తెలంగాణ యూనివర్సిటీ లో నియ‌మితులైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల లొల్లి చిలికి చిలికి గాలివానగా మారింది.. ఈ విష‌యంలో వీసీ కి విద్యార్థి సంఘాల నాయ‌కుల‌కు మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మ‌గ్గు మంటుంది.. మారోవైపు యూనివ‌ర్సిటీ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు వీసి కి మ‌ధ్య దూరం ఏర్పడింది. దీంతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇంకా చదవండి ...
  (P.Mahender,News18,Nizamabad)

  తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) లో నియ‌మితులైన అవుట్ సోర్సింగ్ (Out Sourcing) ఉద్యోగుల లొల్లి చిలికి చిలికి గాలివానగా మారింది.. ఈ విష‌యంలో వీసీ కి విద్యార్థి సంఘాల నాయ‌కుల‌కు మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మ‌గ్గు మంటుంది.. మారోవైపు యూనివ‌ర్సిటి కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు వీసి(Vice Chancellor) కి మ‌ధ్య దూరం ఏర్పడింది. దీంతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగాలు ఉంటాయా.. ఊడుతాయా.. అనే భ‌యం వారిని వెంటాడుతోంది. తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమ మార్గంలో ఇటీవల కొత్తగా చేపట్టిన నియామకాన్ని రద్దు చేయాలని గత శుక్రవారం జరిగిన ఈసీ స‌మావేశంలో విద్య‌శాఖ క‌మీష‌న‌ర్ నవీన్ మిట్ట‌ల్ చెప్పారు.. అయినా తెలంగాణ యూనివ‌ర్సిటి వైస్ చాన్స్‌ల‌ర్ రవీందర్ గుప్త ఈ విష‌యాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ‌ుల ప‌రిస్థితి ఎంటనేది యూనివ‌ర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.

  TRS President CM KCR : చిల్లర రాజకీయాలు చేయొద్దు.. త్వరలోనే ఆ పథకాన్ని విస్తరిస్తాం.. సీఎం కేసీఆర్..


  నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లిలోని తెలంగాణ యూనివ‌ర్సిటీలో ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియ‌మ‌కాల‌పై రోజు కో ర‌కంగా ప‌రిస్థితులు మారుతున్నాయి. గ‌త కొంత కాలంగా యూనివ‌ర్సిటీకి ఇన్చార్జి వీసీ తో కాలం వెళ్ల‌దీశారు.. ఎట్ట‌కేల‌కు ప‌రిమినెంట్ వీసీ వ‌చ్చారు. యూనివర్సిటీ మ‌రిన్ని కొత్త కోర్సుల‌తో ముందుకు వెళ్తోంది. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని జిల్లాలో విద్యార్థుల భ‌విష్యత్తుకు బంగారు బాట‌లు ప‌డుతాయని అంద‌రు అనుకున్నారు.

  కానీ వీసీ వ‌చ్చుడేమే కాని ఈ అక్రమ నియామకాల లొల్లి ఎక్కువైంది. ఆక్ర‌మ నియామ‌కాల విషయాన్ని పూర్వ విద్యార్థి సంఘాల నాయ‌క‌ులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన విద్యాశాఖ కమిషనర్ న‌వీన్ మిట్ట‌ల్ అవుట్ సోర్సింగ్ లో నియ‌మితులు అయినా వారంద‌రిని తొల‌గించాల‌ని వీసీ చెప్పారు. అయితే పూర్వ విద్యార్థులు కొంద‌రు యూనివ‌ర్సిటీలో పార్ట్ టైం గా ఉద్యోగం చేస్తున్నారు.. అయితే వారిని ఎమ్మెల్సీ క‌విత పేరు చెప్పి తొల‌గించారు. విద్య‌ార్థుల‌పై ప‌లు ఆరోప‌ణలు చేశారు.

  Huzurabad By Elections: షాకిస్తున్న సర్వేలు.. అనూహ్యంగా మారుతున్న సమీకరణాలు.. ఆ అభ్యర్థికి ఓటమి తప్పదా..?


  దీంతో విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కోర్టులో వీసీపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ నెల 30న ఈసీ సమావేశం ఉంది.. ఆప్ప‌టి వ‌ర‌కు వర్సిటీలో ఉన్న పార్ట్ టైం అధ్యాపకులను దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు వీసీనేతృత్వంలో సమావేశం నిర్వ‌హించి.. ఆయా విభాగాల్లో వర్క్ లోడ్ ఉందని ఇటీవల తొలగించి అధ్యాపకులకు అందరిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు కొత్తగా నియమితులైన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా ఇస్తున్నారు ఈ నెల 30వ తేదీ వరకు ఆగండి ఆమోదం తీసుకొని మిమ్మల్ని కొనసాగిస్తామని వారికి చెబుతున్నార‌ని తెలిసింది.

  Minor Girl: చదువుకునే వయస్సులో ఇదేం దుర్మార్గపు ఆలోచన.. పాపం ఆ బాలిక పరిస్థితి..


  అయితే ఈ నెల 30 జ‌రిగే మీటింగ్ లోపు ఈసీ మెంబర్ ల‌ను వారి దారికి తెచ్చు కోవాల‌ని వీసీ వ‌ర్గం భావిస్తోంది. అయితే వారి వీరి మాట వింటారా అని జోరుగా చర్చ జ‌రుగుతుంది. నవీన్ మిట్టల్ ఆదేశించినా ఇప్పటి వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడం అవుట్ సోర్సింగ్ అభ్యర్థుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈసీ మెంబర్ గుర్రుగా ఉన్నారు. యూనివర్సిటీలో జ‌రుగుతున్న తాజా పరిణామాలపై నవీన్ మిట్టల్ కు సమాచారం అందించినట్లు తెలిసింది. తన ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఆయన కూడా ఆగ్రహంగా ఉన్నట్లు స‌మాచారం.

  ఏదీఏమైనా ఆవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు ఉంటాయా.. ఉడుతాయా ఆనే విషంయ‌లో ఆందోళన చెందుతున్నారు.. ఈ నెల 30న‌ జ‌రిగే యూనిర్సిటీ కార్య‌వ‌ర్గ స‌మావేశం త‌ర్వాత అక్రమంగా నియమితులైన 113 మంది సిబ్బంది భ‌వ‌త‌వ్యం తేల‌నుంది. మ‌రో వైపు ఉద్యోగ‌ల కోసం చెల్లించిన డ‌బ్బులు తిరిగి వస్తాయో రావో అన్న ఆందోళ‌నలో ఉన్నారు. అయితే ఉద్యోగాలు ఊడితే మనం చెల్లించిన డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌ాల‌ని డిమాండ్ తో ముందుకు వెలుదామ‌ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చ‌ర్చించు కుంటున‌ట్టుగా స‌మాచారం.. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఈ నెల 30వ‌ర‌కు వెచిచూడాల్సిందే.
  Published by:Veera Babu
  First published:

  Tags: JOBS, Nizamabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు