Home /News /telangana /

NAZIMABAD ANOTHER CASE HAS BEEN REGISTERED AGAINST TEENMAR MALLANNA DO YOU KNOW SOME WHERE DELTAILS HERE NZB VB

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న పై మ‌రో కేసున‌మోదు.. ఎందుకో తెలుసా..

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

Teenmar Mallanna: ములిగే నక్క‌పై తాడి పండు ప‌డ్డట్టుగా ఉంది.. తీన్మార్ మల్లన్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఓ కేసులో ఆరోప‌ణలు ఎదుర్కోంటున్న మ‌ల్ల‌న్న‌పై మ‌రో కేసు న‌మోదైంది.. ఓ క‌ల్లు ముస్తాదారు వ‌ద్ద 20ల‌క్ష‌లు డిమాండ్ చేసి 5ల‌క్ష‌లు వ‌సులు చేసిన వారిపై ఆయ‌న ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (P. Mahender, News18, Nizamabad) 

    ములిగే నక్క‌పై తాడి పండు ప‌డ్డట్టుగా ఉంది.. తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఓ కేసులో ఆరోప‌ణలు ఎదుర్కోంటున్న మ‌ల్ల‌న్న‌(Mallanna) పై మ‌రో కేసు న‌మోదైంది.. ఓ క‌ల్లు ముస్తాదారు వ‌ద్ద 20ల‌క్ష‌లు డిమాండ్ చేసి 5ల‌క్ష‌లు వ‌సులు చేసిన వారిపై ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీం స‌భ్యుల‌ను ప‌ట్టుకొన విచారించిన పోలీసులు ఆస‌లు విష‌యాలు వెల్ల‌డించారు. క్యూ టీవీ అధినేత‌ మ‌ల్ల‌న్న టీం స‌భ్యుల‌ను అరెస్ట్ చేసి.. మల్లన్న పై పిటి వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు బోధన ఏసీపీ రామారావు తెలిపారు.  నిజామాబాద్(Nizamabad) జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు బోధన్ ఏసీపీ రామారావు మీడియాకు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన కల్లు ముస్తాదార్ జయ వర్ధన్ గౌడ్ ను రూ. 20 లక్షల రూపాయలు ఇవ్వాల‌ని బెదిరించారు.. వారి బెదిరింపుల‌కు భరించ‌లేక 5ల‌క్ష‌ల రూపాల‌యలు ముట్ట‌జెప్పారు.

    Teenmar mallanna : చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న ..! 14 రోజుల రిమాండ్


    అయినా వారి వేధింపులు ఎక్కువ‌య్యాయి. దీంతో త‌న‌పై బెదింపుల‌కు పాల్ప‌డిన వారిపై పోల‌సులుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ చెప‌ట్టామ‌న్నారు. అయితే బెదిరింపులకు పాల్ప‌డిన వారిలో తీన్మార్ మల్లన్న తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

    కోరలు చాస్తున్న ర్యాగింగ్.. దుస్తులను విప్పించి, రికార్డులు రాయించి.. దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సీనియర్లు..


    బాధితుడి ఫిర్యాదు మేరకు జానకంపేట కు చెందిన మల్లన్న టీం సభ్యులు ఏ1 ఉప్పు సంతోషం, ఏ2 రాధా కిషన్, ఏ3 రాజా గౌడ్ ఏ4 సాయ గౌడ్, ఏ5 చింతపండు నవీన్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముస్తాదారు జయవర్ధన్ గౌడ్ ను జూన్ నెల నుంచి డబ్బుల కోసం అదే గ్రామానికి చెందిన కొందరు బెదిరిస్తున్నారని అన్నారు.

    Telangana News: అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..


    వారి ఆగడాలకు భయపడిన జయవర్ధన్ గౌడ్ ఆగస్టు నెలలో ఐదు లక్షలు చెల్లించారని తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉందని మిగతా పదిహేను లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో గురువారం ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో తాము ఈ ఘటనకు బాధ్యులైన మల్లన్న తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఉప్పు సంతోష్ ను అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని.. తీర్మాణాలపై పీటి వారెంట్ జారీ చేస్తామ‌న్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Nizamabad, Teenmar mallanna, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు