Home /News /telangana /

NAZIMABAD AMBULANCE DRIVERS SAID THERE WAS NO DEMAND FOR CORONA PATIENTS IN THE ICU AT A GOVERNMENT HOSPITAL TRYING TO STOP OXYGEN VB NZB

Telangana: కాసుల కోసం కక్కుర్తి.. పేషెంట్ ఆక్సిజన్ సప్లై ఆపేసి.. చివరకు..

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

Telangana: ఇల్లు కాలి ఒక‌డు ఎడుస్తుంటే చుట్ట కాలచ్చుకోవడానికి మంట అడిగినట్లు.. క‌రోనా సోకి ప్రాణాల‌తో పోరాడుతుంటే అంబులెన్స్ డ్రైవ‌ర్లు వారి గిరాకీ కోసం రోగుల ప్రాణాలు తీసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు కిరాతకులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో చాలా మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరి కొందరు చికిత్స పొంతుతున్నారు. ఇటువంటి సమయంలో అందరు ఒకరికొకరు తోడు ఉండి మనోధ్యైర్యం ఇవ్వాల్సింది పోయి.. ఇదే అదునుగా భావించి కొందరు వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వాలిపోయే అంబులెన్స్ డ్రైవర్లు దారుణాలకు ఒడి గడుతున్నారు. తమకు లాక్ డౌన్ పెట్టిన దగ్గర నుంచి గిరాకీ రావడం లేదని పాడు పనులకు పాల్పడుతున్నారు. కరోనా రోగులు సీరియస్‌ అయినా.. చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పాల్ప‌డ్డారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. ఈ అత్యంత దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా లో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లాలో గ‌త లాక్ డౌన్ నాటి నుంచి క‌రోనా వ్యాప్తి రోజు రోజుకు త‌గ్గుతుంది. లాక్ డౌన్ స‌మ‌యంలో జ‌నాలు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా క‌లెక్ట‌ర్ సీ నారాయాణ రెడ్డి, సీపీ కార్తీకేయ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

    దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్క‌సారిగా 10శాతానికి కేసులు ప‌డిపోయాయి. దీంతో సీరియ‌స్ కేసులు లేక పోవ‌డంతో ప్రైవేట్ అంబులెన్సుకు గిరాకీ లేకుండా పోయింది. గ‌త మూడు నెల‌లుగా అంబులెన్స్ డ్రైవ‌ర్లు ఒక క‌రోనా పేషెంట్ ను హైద‌రబాద్ కు త‌ర‌లించి రూ. 15నుంచి రూ. 20వేల వ‌ర‌కు గుంజారు. క‌రోనా మృత దేహ‌ల‌ను త‌ర‌లిస్తే రూ. 25వేలు వ‌సులు చేసేవారు. అయితే ఈ లాక్ డౌన్ వ‌ల్ల క‌రోనా వ్యాప్తి త‌గ్గింది.. ఆసుప‌త్రిలో కూడా పేషెంట్ల తాకిడి విపరీతంగా తగ్గింది. అయితే కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ముగ్గురు అంబులెన్స్ డ్రైవ‌ర్లు ఈ ఘోరానికి ఒడిగ‌ట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాని ఆపేశారు. అయితే అప్పుడే వార్డులోకి వ‌చ్చిన వార్డు బాయ్ ఆక్సిజన్ సప్లై ఆగిపోవడాన్ని గమనించి వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.

    ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ‌త‌ కొద్దిరోజులుగా అంబులెన్సులకు గిరాకీ లేక‌పోవ‌డం.. ఎవరికైనా సీరియస్ అయి.. చనిపోతే తమకు గిరాకీ వస్తుందని భావించి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు గాలిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Ambulence, Corona alert, Crime, Drivers, Hospital, Illegal income, Nizamabad District, Oxygen, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు