(P.Mahender,News18,Nizamabad)
తెలంగాణ ప్రభుత్వం రైతులను దళారుల నుంచి కాపాడేందుకు దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకున్నారు... అయితే దాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే వరి దాన్యం అమ్మి 20 రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. అధికారులు, పాలకులు వెంటనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాని అన్నదాతలు కోరుతున్నారు. సాంకేతిక కారణాలతో రైతుల ఖాతాల్లో జమ కాలేదని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం దళారులు, కమీషన్ దారులకు వరి ధాన్యాన్ని అమ్మి రైతులు నష్టపొవద్దని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.. సీఎం కేసీఆర్ రైతులు పండిచే పంటను మార్కెట్ కు తరలిస్తే ఖర్చులు పెరుగుతాయని ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యం డబ్బులు రోజుల తరబడి ఎదురు చూడకుండా 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఈ యేడు మాత్రం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్టాలు తీరడం లేదు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 20 రోజులు అవుతున్నా డబ్బులు రావడం లేదని రైతులు వాపోతున్నారు.. పంట వేసేందుకు చేసిన అప్పులు.. పంట కోసిన కోత మిషన్, కూలీలు ఇంచ్చేదుకు డబ్బులు లేక ఏదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ 24న ధాన్యం సేకరణ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో 443 కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామ గ్రామాన ధాన్యం సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారు 2లక్షల 74వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు.. కామారెడ్డి జిల్లాలో 313 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 87వేల 5వందల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. నిజామాబాద్ జిల్లాలోని చందూరు సహకార సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు 340 మంది రైతుల నుంచి 40 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యానికి సంబంధించే రైతులకు 7 కోట్ల 80 లక్షలు రైతుల ఖాతాల్లో జమ కావాలి.. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతుకు ఖాతాలో ఒక రూపాయి కూడా జమకాలేదు.
ఆరుగాలం కష్టపడి పండిచిన పంటను కోసి నెల రోజుల పాటు రోడ్లపై పోసుకుని క్యూ లైన్ కొసం ఎదురుచూపులు.. ఒక పక్క ఆకాల వర్షాలు.. మరో పక్క గన్నీ బస్తాల కొరత.. మిల్లర్లు తీసే కడత్త ఇలా అన్ని కష్టాలను అదిగమించి పంటను అమ్ముకునే సరికి తల ప్రాణం తోకకు వస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ధాన్యం సేకరించిన తరువాత రైతులు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకల్ తీసుకుంటారు.. అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతులు మీ భూమిలో ఏ పంట వేశారు.. అనే విషయాలను సేకరించారు.. అయితే గ్రామంలో ఒకే చోట కూర్చుని వారు చెప్పినవి రాశారు.. రైతులు వరి పంట వేస్తే మరో పంట రాస్తారు.
దీంతో ఇప్పుడు వరి ధాన్యం సేకరణలో అ సర్వేనంబర్ భూమి పట్టాపాసుపుస్తాలు ఇస్తే ఈ సర్వేనంబర్ లో వరి వేయలేదు.. ఈ ధాన్యం ఎక్కడివి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.. నాకు ఉన్నది ఒకే భూమి ఆ భూమిలో వరి పంట మాత్రమే పండుతదని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. మరో వైపు ఆన్ లైన్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో పంట అమ్మి 20 రోజులు గడిచినా డబ్బులు రావాడం లేదని రైతన్నాలు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం రైతులనుంచి సేకరించిన దాన్యానికి సబంధించి డబ్బులు సిద్దంగా ఉన్నాయి.. ఆన్ లైన్ సమస్యలు.. కౌలు రైతుల ఓటీపీ సమస్యలతో ఆలస్యం అవుతుంది.. రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతయాని చెబుతున్నారు.. రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు.. మీ డబ్బులు ఎక్కడికి పోవు మీ డబ్బులు మీకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad