(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
తెలంగాణ అమ్మాయికి, ఆంధ్రా అబ్బాయికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే అమ్మాయి, అబ్బాయి ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెళ్లి ముహూర్తానికి ఇండియాకు రాలేకపోయారు. దీంతో తల్లి దండ్రుల ఆశీస్సులు ఆన్ లైన్ లో తీసుకుని అనుకున్న ముహుర్తానికి ఆమెరికాలో పెళ్లి చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి కృష్ణరావు, వాణిశ్రీ దంపతుల కుమార్తె కొత్తపల్లి తనుజాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన రవి, పద్మ దంపతుల కుమారుడు కృష్ణతేజ కు పెద్దలు వివాహం చేసేందుకు నిశ్చయించారు.. మద్యవర్తి సహాయంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి చేసేందుకు ముహుర్తం పెట్టుకున్నారు. వధువు, వరుడు ఇద్దరు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్దలు తనూజ, కృష్ణతేజలకు వివాహం జరిపించేందుకు ఆరు నెలల క్రితం నిర్ణయించారు.
అంతర్జాతీయ విమానాలు తిరిగే పరిస్థితి లేకపోవడంతో వధూవరులు భారత్ రాలేకపోయారు. అయినా అనుకున్న ముహూర్తానికే అమెరికాలోని ఇండియన్ కాన్స్‌లేట్ సెంటర్ టెంపుల్‌లో ఆదివారం వివాహం చేసుకున్నారు. సంప్రదాయ బద్దంగా వధూవరులు ఒక్కటయ్యారు. వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎల్‌ఈడీ తెరలపై ఈ వేడుకను వీక్షించి ఆశీర్వదించారు.
పెళ్లిలో మెము లేము అనే లోటు తప్ప అంత సప్రదాయం ప్రకారం జరిగిదని అమ్మాయి తండ్రి కొత్తపల్లి కృష్ణరావు చెప్పారు. కరోనా కారణంగా విమనాలు రాకపోకలు లేకపోవడంతో అనుకున్న ముహూర్తానికి మా అమ్మాయి పెళ్లి జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. మా దగ్గరి బంధువులు ఆమెరికాలో ఉన్నారు. వారందరూ పెళ్లికి హాజరయ్యారు.. మేము పెళ్లి తంతులో ప్రత్యక్షంగా లేము అనే లోటు తప్ప పెళ్లి మొత్తం మా కళ్ల ముందే జరిగిందని అయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Guntur, Marriage, Nizamabad District, Telangana