Home /News /telangana /

Telangana: క‌రోనాతో తండ్రి మృతి.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన పదేళ్ల బాలిక.. ఏం చేసిందంటే..

Telangana: క‌రోనాతో తండ్రి మృతి.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన పదేళ్ల బాలిక.. ఏం చేసిందంటే..

కార్యక్రమంలో మంత్రాలు చదువుతున్న బాలిక

కార్యక్రమంలో మంత్రాలు చదువుతున్న బాలిక

Telangana: కరోనా తన తండ్రిని కాటేయడంతో కుటుంబం మొత్తం ఉపాధిని కోల్పోయింది. దీంతో తన తండ్రి పౌరాహిత్యాన్ని తన కూతురు కొనసాగిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. తండ్రి ద‌గ్గర నేర్చుకున్న పౌరాహిత్యంతో ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా మారి వారి బాగోలులు చూసుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

  వివాహం జరిగితే దాని కారణంగా ఎంతో మంది ఉపాధి పొందుతారు. చాకలి, కుమ్మరి, పురోహితం తదితర వృత్తుల వారు ఎంతో కొంత ఉపాధి పొందుతారు. ప్రస్తుతం కరోనా సమయంలో చాలామంది తమ వివాహాలను వాయిదా వేసుకుకోగా.. మరి కొంతమంది రద్దు చేసుకున్నారు. అయితే ఏ పెళ్లి అయినా పురోహితుడు లేకుండా జరగదు. ఎంత టెక్నాలజీ మారిన మంత్రాలు లేనిది పెళ్లి చేయడం అనేది జరగదు. అయితే ఈ మధ్య కరోనా భయంతో వాట్సాప్ లో పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతుండగా పెళ్లి తంత్రం కానిచ్చేశారు. ఏ వృత్తి అయినా వారసత్వంగా అందిపుచ్చుకునే వారు ఈ కాలంలో చాలా తక్కువ. అయితే క‌రోనా మ‌హ‌మ్మ‌రి కొన్ని కుటుంబాల‌ను చిన్న బిన్నం చేసింది. ఒకే ఇంట్లో తండ్రి, కోడుకు, త‌ల్లి, కోడుకు, త‌ల్లిదండ్రులు ఇలా ఇంటి పెద్ద దిక్కును కొల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే కొంద‌రు అప్పులు చేసి ఆసుప‌త్రుల్లో పోసిన ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు. చివ‌ర‌కు ఆస్తులు పోయి అప్పులు మిగులుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది. అయితే తాజాగా ప‌దేళ్ల చిన్నారి తండ్రిని క‌రోనా బ‌లి తీసుకుంది. ఆ కుటుంబానికి పెద్ద అయిన తండ్రి లేకపోవ‌డంతో వారికి ఎలాంటి ఆధారం లేదు. తండ్రి పౌరాహిత్యం చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే తండ్రి ద‌గ్గర నేర్చుకున్న పౌరాహిత్యంతో ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా మారి వారి బాగోలులు చూసుకుంటుంది. త‌ల్లి తన ఇద్ద‌రు చెల్లెళ్లకు ఆ బాలికే ఆకలి తీర్చుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం గ్రామానికి చెందిన పూజారి సంతోష్. సంతోష్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. దేవుడు ఇచ్చిన ప్ర‌సాదాలుగా చూసుకునే వారు. సంతోష్ వంశపారంపర్యంగా సంక్రమించిన పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బోగారం గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తూ పూజాలు, వ్ర‌తాలు, పెళ్లిలు చేసేవారు. అయితే సంతోష్ నెల రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డాడు. వైద్యం చేయించుకున్న అత‌నికి న‌యం కాలేదు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో చివ‌ర‌కు ప్రాణాలు విడిచాడు. సంతోష్ మరణంతో ఒక్కసారిగా అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడింది. కుటుంబానికి ఆధారం సంతోష్. ఆయ‌న సంప‌ద‌న తోనే కుటుంబాన్ని పోషించేవారు. ఇంటి పెద్ద‌ చనిపోవడంతో ఇల్లు గడవడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ పెద్ద కూతురు శ్రీవిద్య ఆ ఇంటి భారాన్ని త‌న భూజాల‌పై వేసుకుంది. త‌న తోటి పిల్ల‌లు ఆడుకుంటుంటే త‌ను మాత్రం కుటుంబం కోసం పూజారిగా మారింది. గ్రామంలో స‌త్య‌నారాయణ వ్రతాలు, పూజా కార్యక్రమాలతో పాటు అన్ని రకాల వ్రతాలు కూడా చేస్తుంది. త‌ల్లి ఇద్ద‌రు చెల్ల‌ల‌ను పోషించుకుంటూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకు గా బాధ్యత‌లు నిర్వ‌హిస్తుంది.

  తాను ఏడవ తరగతి చదువుతున్నానని.. మా నాన్న‌ బతికున్నప్పుడు పూజలు వ్రతాలు చేయడం నేర్పించాడని శ్రీదివ్య చెబుతుంది. నాన్న నేర్పి విద్య‌నే ఈ రోజు మాకు ఆన్నం పెడుతుంద‌ని చెప్పింది. సంతోష్ కాలం చేసిన 15 రోజుల్లోనే తిరిగి తన తనకు తన తండ్రి నేర్పించిన విద్య‌తో తన కుటుంబ సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఇంటికి పెద్దదిక్కు అయింది. శ్రీవిద్య‌ పూజలు చేయించే శైలిని గమనిస్తే ఆ తండ్రికి తగ్గ తనయగా గ్రామ‌స్తులు అభివర్ణిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Family, Minor girl, Nizamabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు