హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకుల బలత్కారం.. మయామాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి.. అత్యంత ఘోరంగా..

Telangana: తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకుల బలత్కారం.. మయామాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి.. అత్యంత ఘోరంగా..

కుబుంబసభ్యులతో బాలిక

కుబుంబసభ్యులతో బాలిక

Telangana: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాల్లో మార్పు మాత్రం రావడం లేదు. రోజు ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ మైనర్ బాలికను ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. నాలుగో తరగతి చదువుతోంది. ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకుల కళ్లు పడ్డాయి. ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఓ రోజు తమ వెంట తీసుకెళ్లారు. ఓ గదిలోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు బలత్కారం చేశారు. ఈ విషయం బయట చెబితే చంపేస్తామని ఆ ముగ్గురు బెదిరించడంతో ఆ బాలిక ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలికకు తీవ్రంగా కడుపునొప్పి మొదలైంది. ఇంట్లో వాళ్ల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో అప్పటిదాక విషయాన్ని దాచిన ఆ బాలిక జరిగిన విషయం వాళ్ల తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బలత్కారం చేసినట్టు బాలిక, బాలిక తండ్రి మీడియా తో తమ గోడును విన్నవించారు. నాలుగో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి గ‌దిలోకి తీసుకు వెళ్లారు. బాలిక‌ నోట్లో గుడ్డలు కుక్కి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బలత్కారం చేసినట్టు బాలిక తెలిపింది.. ల‌డ్డు, భ‌గ‌వాన్, కార్తీక్ అనే ముగ్గురు యువ‌కులు అత్యాచారం చేసార‌ని తెలిపారు.. ఈ విషయం బయట చెబితే చంపుతామని బాలికకు బెదిరించినట్టు వారు తెలిపారు.. గత నాలుగు రోజుల క్రితం (శనివారం రోజు) సాయంత్రం ముగ్గురు యువకులు బాలికపై బలత్కారం జ‌రిగింది. బాలికకు తీవ్రంగా కడుపునొప్పి ఉండడంతో బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు.


శనివారం నుంచి విషయం బయటికి చెప్పకుండా గోప్యంగా ఉంచిన బాలిక.. బాధను భరించ‌లేక తన కుటుంబంతో విషయం చెప్పడంతో ఈ విష‌యం బయటపడింది. విషయం బయట చెప్పకుండా ఉంటే లక్ష రూపాయలు ఇస్తామని తమకు ఆశ చూపారని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరీక్షల నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకులపై ఫోక్స్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Gang rape, Nizamabad