హోమ్ /వార్తలు /తెలంగాణ /

Thousand rupees murder: వెయ్యి రూపాయల కోసం క‌జిన్ బ్ర‌ద‌ర్ హత్య.. కామారెడ్డి​లో దారుణం.. మ‌ర్డ‌ర్ కేసును ఒక్క రోజులో చేధించిన పోలీసులు

Thousand rupees murder: వెయ్యి రూపాయల కోసం క‌జిన్ బ్ర‌ద‌ర్ హత్య.. కామారెడ్డి​లో దారుణం.. మ‌ర్డ‌ర్ కేసును ఒక్క రోజులో చేధించిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ‌బ్బు కొసం మ‌నిషి ఏమైనా చేస్తాడు.. డ‌బ్బుకు బంధాలు.. ప్రేమ‌లు ఏమీ ఉండ‌వు.. ఎంతటి దారణానికైనా తెగిస్తాడు. ప్రాణం తీయ‌డానికైనా వెనుకాడరు. అయితే నిజామాబాద్​లో జరిగిన ఓ హత్య యావత్​ తెలంగాణ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.

(న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి, పి. మ‌హేంద‌ర్)

డ‌బ్బుకు బంధాలు.. ప్రేమ‌లు ఏమీ ఉండ‌వు.. డ‌బ్బు కొసం మ‌నిషి ఏమైనా చేస్తాడు.. ఎంతటి దారణానికైనా తెగిస్తాడు. ప్రాణం తీయ‌డానికైనా వెనుకాడరు. అయితే ఉమ్మడి నిజామాబాద్​లో జరిగిన ఓ హత్య (Murder) యావత్​ తెలంగాణ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డిలో వెయ్యి రూపాయ‌ల కొసం (Thousand rupees murder) క‌జిన్ బ్ర‌ద‌ర్ ను అతి దారుణంగా హ‌త్య చేశారు. ఈ కేసు  పోలీసులు ఒక్క రోజులోనే  చేధించారు. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు.

కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సమీఉద్దీన్ నిజామాబాద్ (Nizamabad)నగరంలోని ఓ ఫ్లవర్ మర్చంట్ లో పనిచేస్తున్నాడు.  అయితే తన చిన్నాన్న కొడుకు (Cousin brother) అయినా షేక్ వసీం ను కూడా అక్క‌డే  పనికి పెట్టాడు. వసీం తన యజమాని (Owner) వద్ద 45 వేలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డ‌బ్బులు కట్టలేక పోయాడు.  అయితే ఆ యజమాని.. మీ వాడు డబ్బులు తీసుకుని వెళ్లాడు, తిరిగి క‌ట్ట‌లేద‌ని షేక్ సమీఉద్దీన్ కు చెప్పాడు. దీంతో స‌మీ ఉద్దీన్  వసీం దగ్గరికి వెళ్లి డ‌బ్బులు ఆడిగారు. దీంతో వ‌సీం రూ. 45 వేలు తీసుకువచ్చి షేక్ సమీ ఉద్దీన్ కి ఇచ్చి యజమానికి ఇవ్వమని చెప్పాడు. సమీ ఉద్దీన్ మాత్రం 44 వేలు రూపాయలు ఓనర్​కు ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు (Thousand rupees) తన వద్దే ఉంచుకున్నాడు.

షేక్ సమీ ఉద్దీన్ (Sheikh Sami Uddin), షేక్ వసీం (Sheikh wasim) తో పాటుగా మరో స్నేహితుడు అలిమొద్దిన్ తో కలిసి ఫిబ్ర‌వరి 24న‌ రాత్రి దుబ్బ ప్రాంతంలోని వైన్​ షాపులో మద్యం సేవించారు. అయితే ఫ్లవర్ మర్చంట్ యజమాని వసీం కి ఫోన్ చేసి, సమీ ఉద్దీన్ 44 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు, ఇంకా వెయ్యి రూపాయలు  (Thousand rupees) ఎప్పుడిస్తావ‌ని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వసీం, సమీ ఉద్దీన్  (Cousin brother) ను నిలదీశాడు. మాటా మాటా పెరిగి ఇద్ద‌రు కజిన్స్​ గొడవ పడ్డారు. ఆగ్ర‌హించిన వ‌సీం కోడిని కోసే క‌త్తితో  సమీ ఉద్దీన్ పై  దాడి చేశాడు. విచ‌క్ష‌ణ ర‌హితంగా క‌త్తితో పొడిచాడు (Murder). దీంతో స‌మీ ఉద్దీన్  (Cousin brother) అక్క‌డికక్క‌డే చ‌నిపోయాడు. మరో స్నేహితుడు అలీమొద్దిన్​ను అపే ప్రయత్నం చేయగా అతనిపై సైతం వసీం దాడికి పాల్పడటంతో అతను అక్కడి నుండి పారిపోయాడు.


విషయం తెలుసుకున్న నిజామాబాద్ నగర సీఐ కృష్ణ, మూడో టౌన్ ఎస్ఐ భాస్కర చారీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వసీం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం లోని బస్టాండ్ లో ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు వసీంతో పోలీసులు

వసీంను అదుపులోకీ తీసుకుని విచారించగా  చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.  ఈ నేరానికి ఉపయోగించిన కత్తి, నిందితుడు వాడిన మోటార్ సైకిల్,​ రెండు సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఏసీపీ వెల్లడించారు.

First published:

Tags: Kamareddy, Murder, Nizamabad

ఉత్తమ కథలు