Home /News /telangana /

NAZIMABAD A MAN IN KAMAREDDY HAS BEEN CERTIFIED AS HAVING RECEIVED A SECOND DOSE OF THE CORONA VACCINE SEVEN MONTHS AFTER HE DIED NZB PRV

Vaccination To Dead Person: ఇదేం వింత?.. చనిపోయిన వ్యక్తికి కరోనా వ్యాక్సిన్​ వేసిన వైద్యాధికారులు.. కామారెడ్డిలో వింత ఘటన

మరణ ధ్రువీకరణ, కరోనా వ్యాక్సినేషన్​ ఫొటోలు

మరణ ధ్రువీకరణ, కరోనా వ్యాక్సినేషన్​ ఫొటోలు

ఓ వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ నెలలో కరోన వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న పది రోజులకు కరోన బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అదే నెలలో మృతి చెందాడు. కానీ..

    ఓ వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ నెలలో కరోన వ్యాక్సిన్ (Corona vaccine) మొదటి డోస్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న పది రోజులకు కరోన బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అదే నెలలో మృతి (Died) చెందాడు. కానీ అతను సెకండ్ డోస్ ఈ నెల 28 న సెకండ్ డోస్ తీసుకున్నట్టుగా ఆన్లైన్ లో ఎంట్రీ (Entry in Online) అయింది. దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సైతం డౌన్ లోడ్ అయింది. అయితే చనిపోయిన వ్యక్తి కోవిడ్ సెకండ్ డోస్ ఎలా తీసుకుంటారని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రవిచిత్ర ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లాలో చోటుచేసుకుంది.

    కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కొడిశాల రాజశేఖర్ (Kodishala Rajasekhar) అనే వ్యక్తి గత సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన కోవిడ్ టీకా తీసుకున్నాడు. టీకా తీసుకున్న 10 రోజులకు కోవిడ్ బారిన పడటంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ మదీనగూడా లోని అర్చన ఆస్పత్రి (Archana Hospital)కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సకు సుమారు 20 లక్షల వరకు కుటుంబసభ్యులు ఖర్చు చేశారు. అయినా అతను చికిత్స పొందుతూ అదే నెల 27 వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలు కూడా అక్కడే పూర్తి చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డెత్ సర్టిఫికెట్ (death certificate) కూడా వచ్చింది.

    అయితే ఆ వ్యక్తి ఈ నెల 28(శుక్రవారం)న కోవిడ్ సెకండ్ డోస్ తీసుకున్నట్టుగా కోవిడ్ పోర్టల్ లో ఎంట్రీ చేశారు. దాంతో అతను రెండు డోసులు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా అతను వాడిన మొబైల్ కు మెసేజ్ వచ్చింది.

    vaccination certificate


    దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కోవిడ్ పోర్టల్ లింకు (Covid Portal link) ఓపెన్ చేయగా రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్ డౌన్ లోడ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. గత సంవత్సరం ఏప్రిల్ లో చనిపోయిన వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ (Covid vaccine to dead person) ఎలా తీసుకున్నాడు అని అనుమానం వ్యక్తం చేశారు.

    మరణ ధ్రువీకరణ పత్రం


    అయితే ఇటీవల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, జిల్లాలో కిందిస్థాయి వైద్యాధికారులకు పై అధికారులు వ్యాక్సినేషన్ టార్గెట్ (vaccination target) ఇవ్వడంతో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ వేశారు. అయితే టార్గెట్ పూర్తి చేయడం కోసమే అధికారులు ఇలా ఆన్లైన్ ఎంట్రీలు చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేసామని వైద్యశాఖ చెప్తున్న దాంట్లో నిజమెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ ఇచినట్టుగా ఆన్లైన్ ఎంట్రీ చేసిన విషయంపై ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులు ఏ విధమైన సమాధానం చెప్తారో చూడాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona Vaccine, Kamareddy, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు