ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దే యూనివర్సిటీలో ఆవినీతి జరుగుతుందని ఆరోపణలు మిన్నంటాయి. గత 25 రోజులుగా తెలంగాణ యూనివర్సిటిలో ఆక్రమంగా నియామకాలు జరిగాయని.. అర్హత లేకున్నా ప్రమేషన్స్ ఇచ్చారని విద్యార్థి సంఘాలకు వీసీ మధ్య పోరు జరిగింది. అయితే వాటాన్నింకి తెరపడింది. ప్రస్తుత రిజిస్ట్రార్ ను తొలగించారు. అక్రమ నియామకాలు రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త రిజిస్ట్రార్ గా సీనియర్ ప్రొఫెసర్ నియామకానికి పచ్చజెండా ఊపింది. యూనివర్సిటి పాలక మండలి సభ్యులు- యూనివర్సిటీ అధికారులు కలిసి కట్టుగా పనిచేసి తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాలు, పదోన్నతుల పై విద్యార్థి సంఘాల నాయకులు నెల రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ అనుమతి, పాలక మండలి తీర్మాణం లేకుండా చేపట్టిన అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీసీకి విద్యార్ధి నాయకులకు మద్య చిన్న యుద్ధమే జరిగింది. ఆరోపణలు ప్రత్యారోపణలో యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. అయితే శనివారం యూనివర్సిటీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాతో పాటు పాలక మండలి సభ్యులు వర్సిటీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీసీ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ కనకయ్యలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియామకం చేసినట్లు తీవ్ర స్దాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని పాలక మండలి సభ్యులు సమావేశంలో వర్సిటీ అధికారులను నిలదీశారు.
హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో చేసిన తీర్మాణాలను అమలు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. వర్సిటీ లో వరుస వివాదాలకు బాధ్యున్ని చేస్తూ రిజిస్ట్రార్ కనకయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వైస్ ఛాన్స్ లర్ రవీందర్ గుప్తా ప్రకటించారు. కొత్త రిజిస్ట్రార్ గా సీనియర్ ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ రవీందర్ గుప్తా హయాంలో జరిగిన ఔట్ సోర్సింగ్ నియామకాలకు ఎలాంటి అనుమతి లేదని.. పాలక మండలి తీర్మాణం చేసిందని వీసీ వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన నియామకాలన్నీ రద్దు చేస్తున్నట్లు సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు.
అయితే ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని నియామించలేదని వీసీ తెలిపారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం జరుగుతుంది.. గ్రాడ్యుడ్యూటీ 12 లక్షల నుండి 16 లక్షల వరకు పెంపు ఉంటుందన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ పి.ఆర్.సి 2021 అమలు చేయడం జరుగుతుందన్నారు.. సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన జి.ఓ నంబర్ 141 అమలు చేస్తామని.. గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అర్హులు అయిన వారికి గైడ్ షిప్ ఇస్తామాన్నరు. వచ్చే సంవత్సరం నుండి ఎమ్.ఎస్సి జూవాలజి కోర్సులు ప్రారంభమవుతయని వీసీ రవీందర్ గుప్త వివరించారు. నవంబర్ ఒకటి నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తదుపరి ఈ.సి సమావేశం నవంబర్ 26 లేదా 27 న నిర్వహించనున్నారు.
పాలక మండలి సభ్యులు -అధికారులు కలిసి వర్సిటీని అభివృద్ది చేయాలని కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. గత 25 రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్నగందర గోలానికి తెరపడిందని పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్ అన్నారు. వీసీ రవీందర్ గుప్తా వచ్చిన తరువాత జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు రద్దు చేశామని.. పదోన్నతులు పొందిన వారిని తిరిగి అదే స్థానంలో విధులు నిర్వహించేందుకు నిర్వహించామన్నారు.
వారు తీసుకున్న ప్రమోషన్ సాలరీని తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలని పాలక మండలిలో నిర్ణయించామని అయన తెలిపారు. యూనివర్సిటీలో సమస్యలు సమసిపోయి యూనివర్సిటీ ఉన్నతితో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై వేటుతో యూనివర్సిటీలో వివాదాలు సమసిపోతయా.. డబ్బులిచ్చి విధుల్లో చేరిన ఉద్యోగులు పరిస్ధితి ఏంటి.. యూనివర్సిటి పాలక మండలి మరియు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాలు ఫలిస్తాయా.. లేదా చూదాం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.