Home /News /telangana /

NAZIMABAD A FIGHT BROKE OUT BETWEEN THE BJP AND THE TRS OVER THE TURMERIC BOARD AFFAIR ISSUE IN NIZAMABAD DISTRICT AND ISSUE GETTING SERIOUS NOW NZB PRV

Turmeric board: పసుపు బోర్డు చిచ్చు.. కారు, క‌మ‌లం మ‌ధ్య తారాస్థాయికి పోరు.. నువ్వా..నేనా? అన్న‌ట్లుగా రాజ‌కీయం..

ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్)

ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్)

నిజామాబాద్ జిల్లాలో ఎన్నిక‌ల‌కు ముందే భార‌తీయ జ‌న‌త పార్టీకి. టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య వారు మొద‌లైంది. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అడ్డుకున్నారు.

    (న్యూస్18 తెలుగు ప్ర‌తినిధి, పి మ‌హేంద‌ర్)

    నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఎన్నిక‌ల‌కు ముందే భార‌తీయ జ‌న‌త పార్టీకి (BJP). టీఆర్ఎస్ (TRS) పార్టీల మ‌ధ్య వారు మొద‌లైంది. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అడ్డుకున్నారు. ఓ వైపు ప‌సుపు రైతులు (Turmeric farmers), టీఆర్ఎస్ శ్రేణులు.. మ‌రో వైపు క‌మ‌లం పార్టీ వారు ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. భాజ‌పా ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ (MP Dharmapuri Aravindh), పార్టీ శ్రేణుల‌పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎంపీ రెండు కార్ల అద్ద‌లు ధ్వసం అయ్యాయి. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని ఎంపీ అర్వింద్ నిల‌బెట్టు కోవాల‌ని ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి (MLA Jeevan reddy) డిమాండ్ చేశారు.  ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని ఓడించి గుణ‌పాఠం చెబుతానని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.

    నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు (Turmeric Board) వివాదం ద‌శ‌బ్దాలుగా సాగుతోంది. ఎన్నిక స‌మ‌యంలోనే ప‌సుపు బోర్డు తెర‌పైకి వ‌చ్చేది త‌రువాత ఆ విష‌యంలో ఎవ‌రు స్పందించే వారు కాదు. అయితే 2019 పార్ల‌మెంట్ సుమారు 185 మంది ప‌సుపు రైతులు నామినేష‌న్ వేశారు. దీంతో ప‌సుపు బోర్డు స‌మ‌స్య దేశ‌రాజ‌కీయ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అటు టీఆర్ఎస్ నుంచి ప‌సుపు రైతులు (Turmeric farmers) నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న చోటు నుంచి 20 మంది రైతులు ఎంపీ అభ్య‌ర్థులుగా పోటీ చేశారు. అయితే నిజామాబాద్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ధ‌ర్మ‌పురి అర్వింద్. ఒక అడుగు ముందుకు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే ప‌సుపు బోర్డు (Turmeric Board)  తీసుకు వ‌స్తాన‌ని.. లేదంటే తన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి పోరాటం చేస్తాన‌ని  బాండ్ పేప‌ర్ పై రాసి ప‌సుపు రైతులకు ఇచ్చారు. అనుకున్న‌ట్టుగానే కేంద్రంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే ప‌సుపు బోర్డు వ‌స్తుంద‌ని రైతులు బీజేపీకి ఓటు వేసి ధర్మపురి అర్విందను ఎంపీగా గెలిపించారు. ముఖ్య‌మంత్రి కూతురు. సిట్టింగ్​ ఎంపీ క‌విత‌పై అర్వింద్​ ఘ‌న‌విజ‌యం సాధించారు.. అయితే ఎంపీగా గెలిచి రెండున్న‌ర యేళ్లు అవుతున్నా ప‌సుపు బోర్డు (Turmeric Board) రాలేదు. అర్వింద్​ బోర్డు తీసుకు రాలేద‌ని ప‌సుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

    ప‌సుపును సుగంధ ద్రవ్యాలలో చేర్చడంతో..

    ఆర్మూర్, బాల్కొండ నియోజ‌వ‌ర్గాల్లోనే ఎక్కువ‌గా ప‌సుపు రైతులు ఉన్నారు.  ప‌సుపు పోరాటానికి ఆర్మూర్ వేదిక‌గా ఎన్నో పోరాటాలు జ‌రిగాయి.  రైతుల పోరాటాన్ని అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల్లో వాడుకుని, వ‌దిలేశాయి.. అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం.  అయితే ఎంపీ అర్వింద్ మాత్రం ప‌సుపు బోర్డు (Turmeric Board) కంటే స్పైసీ బోర్డు మెంబ‌ర్ తీసుకు వ‌చ్చానని చెబుతున్నారు. ప‌సుపును సుగంధ ద్రవ్యాలలో చేర్చడంతో ప‌సుపు బోర్డు రాలేదని ఎంపీ వాద‌న. అయితే ఈ విష‌యం మాకు తెలియాదు మాకు మాత్రం ప‌సుపు బోర్డు మాత్ర‌మే కావాల‌ని ప‌సుపు రైతులు, టీఆర్ఎస్ వారు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ విష‌యంలో ఆర్మూర్ నియోజ‌కవ‌ర్గంలో ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి ఎంపి ఆర్వింద్ కు మ‌ధ్య రాజ‌కీయ పోరు సాగుతుంది.

    ఇస్సాప‌ల్లి కి రాగానే..

    నిన్న‌ ఆర్మూర్ నియోజకవర్గం లో నందీపేట్ మండ‌లంలో ని గ్రామాల్లో  ఎంపీ అర్వింద్ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు పెట్టుకున్నారు. అయితే ఎంపీ వ‌స్తున్న విష‌యం తెలిసిన ప‌సుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఎంపీని అడ్డుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. ఆ విష‌యం ఎంపీ అర్వింద్ పోలీసుల‌కు చెప్పారు. అయినా స‌మ‌స్య ప‌రిష్క‌రం కాక‌పోవ‌డంతో  ఎంపీ అర్వింద్ ఆర్మూర్ లోని అంబేడ్కర్​ చౌరస్తాలో ధర్నాకు దిగారు. రెండు గంట‌ల త‌రువాత ఎంపీ ఇస్సాప‌ల్లి కి రాగానే ప‌సుపు రైతులు ఎంపీని అడ్డుకున్నారు.. అయితే ఇదే స‌మ‌యంలో కొంద‌రు రాళ్లు రువ్వారు.  ఈ దాడిలో భాజ‌పా శ్రేణుల‌కు కొంద‌రికి గాయాలు అయ్యాయి.. అయితే ఎంపి అర్వింద్ ఈ విష‌యంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

    ఇద్ద‌రు ద‌ళితులను హ‌త్య చేయించారని..

    కావాల‌నే టీఆర్ఎస్ (TRS) వాళ్లు దాడి చేశారని, తనతో పాటు బీజేపీ నాయ‌కుల‌ను చంపేందుకు ప్ర‌య‌త్నం చేశారని అర్వింద్ ఆరోపించారు. పోలీసులు కూడా వారికే మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని ఆర్మూర్ లోనే ఓడించి త‌గిన బుద్ది చెబుతాన‌ని ఎంపీ అన్నారు. ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఇప్ప‌టికే ఇద్ద‌రు ద‌ళితులను హ‌త్య చేయించారని, ఓ విలేక‌రిపై కూడా దాడి చేసి చంప‌బోయాడ‌ని ఎంపీ ఆరోపించారు. జీవ‌న్ రెడ్డి మాకు లెక్క కాదు. ఆయ‌న‌ను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడించి తగిన బుద్ది చెబుతానని అర్వింద్​ స‌వాల్ విసిరారు.

    ఆ విష‌యంలో ఎందుకు స్పందిచరు..

    ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి కూడా ఆదే స్థాయిలో మండి ప‌డుతున్నారు. 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎంపీ అర్వింద్ ఇచ్చిన హ‌మిని నేర‌వేర్చు కోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప‌సుపు బోర్డు తీసుకు వ‌స్తాన‌ని చెప్పి రైతుల‌తో ఓట్లు వేయించుకుని రెండేళ్లు అవుతున్నా ఆ విష‌యంలో ఎందుకు స్పందిచరని జీవ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య యుద్ద‌మే సాగుతుంది. ఇదంతా  ఓవైపు అయితే ఈ రోజు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడిగా జీవ‌న్ రెడ్డిని నియ‌మిస్తూ కేసీఆర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో  జీవ‌న్ రెడ్డికి పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందనేది అర్థం అవుతోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, Dharmapuri Arvind, Jeevan reddy, Nizamabad, Trs, Turmeric farmers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు