• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • NAZIMABAD 29 YEARS OLD YOUNG MAN DIED WITH HEART ATTACK IN BAHRAIN DEAD BODY REACHED TO NIZAMABAD DAYS AFTER HIS DEATH HSN

Nizamabad: తండ్రికి వైద్య చికిత్స.. చెల్లికి పెళ్లి.. సొంతింటి నిర్మాణం.. ఈ కలలతో గల్ఫ్ దేశానికి వెళ్లాడో కుర్రాడు.. ఇంతలోనే ఊహించని ఘోరం..!

Nizamabad: తండ్రికి వైద్య చికిత్స.. చెల్లికి పెళ్లి.. సొంతింటి నిర్మాణం.. ఈ కలలతో గల్ఫ్ దేశానికి వెళ్లాడో కుర్రాడు.. ఇంతలోనే ఊహించని ఘోరం..!

జశ్వంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)

అనారోగ్యంతో ఉన్న తండ్రికి వైద్య చికిత్స. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం. సొంతింటిని నిర్మించుకోవడం, తల్లిదండ్రులకు కష్టం లేకుండా చూసుకోవడం.. ఇవీ ఆ కుర్రాడి టార్గెట్లు. అందుకే బహ్రెయిన్ బాట పట్టాడు. కానీ ఇంతలోనే..

 • Share this:
  తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బతికి ఉండగానే జీవశ్చవంలా మారాడు. అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. సొంతూళ్లో ఆస్తులు అమ్ముకుని సిటీకి వెళ్లి అద్దె ఇంట్లో మకాం పెట్టారు. స్థానికంగా పనికి వెళ్లినా ఖర్చులకు కూడా డబ్బు సరిపోకపోవడంతో కుటుంబానికి తానే పెద్దదిక్కులా మారాలని ఆ కుర్రాడు అనుకున్నాడు. తల్లికి, చెల్లికి ధైర్యం చెప్పి గల్ఫ్ బాట పట్టాడు. కొన్నేళ్లు కష్టపడితే అప్పులన్నీ తీరిపోయి, కుటుంబ కష్టాలు పోతాయనీ, శాశ్వతంగా తిరిగొచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పేవాడు. నెల నెలా ఇంటికి డబ్బులు పంపేవాడు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు చెప్పినా ‘ముందు మన కష్టాలు తీరిన తర్వాతే‘ అని తేల్చిచెప్పేవాడు. కానీ ఊహించని రీతిలో దేశంకాని దేశంలో గుండెపోటుతో మరణించాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అతడి మృతదేహం కుటుంబసభ్యుల వద్దకు చేరింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ కు చెందిన నలిమెల రాంరెడ్డి, దివ్య దంపతులకు 29 ఏళ్ల కుమారుడు జశ్వంత్ రెడ్డి, కుమార్తె దివ్య ఉన్నారు. రాంరెడ్డి పరిస్థితి బాగున్నంతకాలం ఆ కుటుంబానికి పెద్దగా ఇబ్బందులు ఏమీ రాలేదు. అప్పులు ఉన్నా కుటుంబ పెద్ద ఉన్నాడన్న ధైర్యం వారిలో ఉండేది. అయితే కొన్నేళ్ల క్రితం రాంరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ పెద్దకు కష్టం వచ్చిందన్న బాధలో ఉంటే అప్పుల వాళ్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో సొంతూళ్లో ఆస్తులు అమ్మి కొంత అప్పులు తీర్చి నిజామాబాద్ కు వచ్చేశారు. నిజామాబాద్ లోనే అద్దె ఇంట్లో ఉంటూ పనులకు వెళ్లేవాళ్లు. అయితే సంపాదించినదంతా ఖర్చులకే సరిపోవడాన్ని జశ్వంత్ రెడ్డి గుర్తించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  ’నేను బహ్రెయిన్ పోతా. తెలిసిన వాళ్లు ఉన్నారు. రమ్మన్నారు. పని ఇప్పిస్తా అన్నారు. ఇక్కడే ఉంటే అప్పులు ఎన్నేళ్లయినా తీరవు. మన కష్టాలు పోవు. చెల్లికి పెళ్లి చేయాలి. మనం సొంతిల్లు కట్టుకోవాలి. నాన్నకు వైద్యంచేయించాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటే అవ్వవు. నేను కొన్నేళ్ల పాటు బహ్రెయిన్ లో కష్టపడి పనిచేస్తా. ఆ డబ్బుతో మన కష్టాలు తీరతాయి’ అని ఇంట్లో చెప్పి ఆ గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. రోజూ ఇంటికి ఫోన్ చేసేవాడు. పొద్దంతా పడిన కష్టాన్ని రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడితే మర్చిపోయేవాడు. నెల నెలా ఇంటికి డబ్బులు పంపించేవాడు. అయితే అనూహ్యంగా అతడు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. చిన్నవయసులోనే గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో బహ్రెయిన్ నుంచి జశ్వంత్ రెడ్డి శవపేటిక హైదరాబాద్ కు చేరుకుంది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

  29 Years old Young man died, Heart attack, Bahrain, Dead Body, Nizamabad, నిజామాబాద్, గుండెపోటుతో యువకుడి మృతి, బహ్రెయిన్, చెల్లి పెళ్లి, గల్ఫ్,
  మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  నిజామాబాద్ లో అద్దె ఇంట్లో అతడి అంత్యక్రియలకు ఇబ్బందులు రావడంతో అతడి మేనత్త నివసించే ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. కొద్ది నెలల క్రితమే బహ్రెయిన్ కు వెళ్లిన జెశ్వంత్ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అతనిపై ఆధారపడ్డ తండ్రి రాంరెడ్డి, తల్లి దివ్య, చెల్లెలు నిఖిల దిక్కులేని వారయ్యారు. కరోనా ఆంక్షలు, రంజాన్ సందర్బంగా కుదించిన పనివేళలు ఉన్నప్పటికీ శ్రమకోర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు తిర్మన్ పల్లి శేఖర్, ఎపి ఎన్నార్టి కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర్ రావు, తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ ఎల్లపు, మురళి నోముల బృందం సహకరించారు.
  Published by:Hasaan Kandula
  First published: